మూత్రపిండాలు, లివర్, థైరాయిడ్ కేన్సర్లకు వినియోగించే ‘సొరఫెనిబ్’ ఔషధం జనరిక్‌ను అమెరికా మార్కెట్లోకి నాట్కో ఫార్మా విడుదల చేస్తోంది. ‘నెక్సావర్’ బ్రాండ్‌తో ఈ ఔషధాన్ని బేయర్ విక్రయిస్తోంది. సొరఫెనిబ్నకు అమెరికా మార్కెట్లో తమదే తొలి జనరిక్ అని నాట్కో ఫార్మా వెల్లడించింది. విక్రయాల భాగస్వామి వైట్రిస్ కంపెనీ ద్వారా 200 ఎంజీ మోతాదు టాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. 2021, డిసెంబరుతో ముగిసిన ఏడాదికి అమెరికాలో నెక్సావర్ విక్రయాలు దాదాపు 7 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి.