Movies

హృదయానికి దగ్గరైన సినిమా

హృదయానికి దగ్గరైన సినిమా

‘గని’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది ముంబయి భామ సయీ మంజ్రేకర్‌. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ హీరోగా శశికిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సయీ మంజ్రేకర్‌ మాట్లాడుతూ “నా హృదయానికి ఎంతగానో దగ్గరైన చిత్రమిది. ఇందులో నేను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాఠశాల మిత్రురాలు, ఆయన భార్య ఇషా పాత్రలో కనిపిస్తాను. సందీప్‌ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ప్రభావితం చేసే మహిళగా నా పాత్ర భిన్నకోణాల్లో సాగుతుంది. ఈ సినిమాకు స్వయంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను.తెలుగు స్పష్టంగా పలకడానికి ఎంతో సాధన చేశాను. సినిమా చూస్తున్నప్పుడు చాలా సహజంగా డబ్బింగ్‌ చెప్పాననిపించింది. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. కొద్ది రోజుల క్రితం సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పేరెంట్స్‌ను కలిశాను. వారు నా పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. కెరీర్‌ తొలినాళ్లలోనే తెలుగులో పెద్ద సంస్థల నుంచి అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఓ నటిగా ఇంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తూ నాయికగా రాణించాలనుంది’ అని చెప్పింది.