వేలాది మందిని ప్రభావితం చేయగల సెలబ్రిటీ హోదా ఒక గొప్ప బాధ్యత. అది అర్థం చేసుకున్న తారలంతా ప్రపంచానికి పనికొచ్చే ఏదో ఒక మంచి కార్యక్రమంలో భాగమవుతున్నారు. వీరిలో తానూ ఉన్నానని ముందుకొచ్చింది బాలీవుడ్ తార పరిణీతి చోప్రా. గతంలో ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన ఆమె…తాజాగా ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (పడి) ప్రచారకర్తగా ఎంపికైంది. సముద్రాల పరిరక్షణకు ఈ అసోసియేషన్ కృషి చేస్తుంటుంది. ఈ సందర్భంగా పరిణీతి చోప్రా స్పందిస్తూ…అందమైన పుడమిని కాపాడుకోవాలి. మొదటిసారి సముద్రంలో డైవింగ్ చేసి బయటకొచ్చాక భావోద్వేగంతో ఏడ్చేశాను. అప్పటి నుంచి సీ డైవింగ్ నా జీవితంలో భాగమైంది. సముద్రంలోపల మనందరం ఒక్కటే. మనందరి భాష ఒక్కటే. ప్రతి మూడు నెలలకొకసారైనా డైవింగ్‌కు వెళ్తుంటాను. సముద్రాలు కలుషితం అవడం చాలా బాధాకరం. వాటి పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కృషి చేస్తా’అని చెప్పింది.