NRI-NRT

కువైత్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన

కువైత్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. పాస్‌పోర్ట్, వీసా సేవలను అందించే జలీబ్(అబ్బాసియా), ఫహాహీల్‌లోని బీఎల్ఎస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రాలను తాత్కాలికంగా క్లోజ్ చేసినట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ రెండు సెంటర్లు మూసే ఉంటాయని Indian Embassy పేర్కొంది. అయితే, కువైత్ సిటీలోని అలీ అల్ సేలం స్ట్రీట్‌లోని జవహార్ టవర్స్‌లో ఉన్న మూడో కేంద్రం మాత్రం ఇకపై 24/7 తెరిచే ఉంటుందని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రవాసులు వీసా, పాస్‌పోర్టు తాలూకు దరఖాస్తులను ఈ కేంద్రంలో సమర్పించాలని కోరారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రవాసులు దీన్ని దృష్టిపెట్టుకుని అసౌకర్యానికి గురికాకుండా ముందే ప్రణాళిక ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కువైత్ సిటీ బీఎల్ఎస్ సెంటర్‌లో దరఖాస్తు సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రవాసులు 65506360 నం.కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.