DailyDose

కాలిఫోర్నియాలో కూలిన యూఎస్ మిలటరీ విమానం – TNI నేర వార్తలు

కాలిఫోర్నియాలో కూలిన యూఎస్ మిలటరీ విమానం  – TNI  నేర వార్తలు

* దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ప్రమాదవశాత్తూ యూఎస్ సైనిక విమానం కూలిపోయింది. మెక్సికన్ సరిహద్దు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లామిస్ సమీపంలో 3 డి మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్‌కు చెందిన విమానం కూలిపోయిందని యూఎస్ సైనిక ప్రతినిధి చెప్పారు.కూలిపోయిన సైనిక విమానంలో రేడియో ధార్మిక పదార్థం తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్లను సైన్యం ఖండించింది.కూలిపోయిన విమానం వల్ల ప్రాణ నష్టంపై తక్షణ సమాచారం లేదని యూఎస్ ఆర్మీ తెలిపింది. మార్చిలో నార్వేలో నలుగురు మెరైన్‌లు మరణించారు. గతంలో యూఎస్ మిలిటరీకి చెందిన పలు విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి.

*వైకాపా-తెదేపా కార్యకర్తల ఘర్షణతో… కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లవ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో సచివాలయం నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే స్థలం లేని కారణంగా సచివాలయం కట్టడం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్థలం చూపిప్తామని.. గ్రామంలో సచివాలయం నిర్మించాలని గ్రామ సర్పంచ్‌ తోట రామకృష్ణ డిమాండ్ చేయడంతో గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభలో సచివాలయం నిర్మించాలని తెలుగుదేశం కార్యకర్తలు పట్టుపట్టారు. అక్కడే ఉన్న వైకాపా వర్గీయులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. వివాదంపై ఇరువురు పెద్దాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

* బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ‌టంతో ఆగ్ర‌హించిన స్ధానికులు నిందితుల‌ను స‌జీవ ద‌హ‌నం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి కాలిన గాయాల‌తో మ‌ర‌ణించ‌గా మ‌రో నిందితుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా డు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.

*కర్నూలు: జిల్లాలోని మద్దికెర పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శ్రీరామ్ నాయక్, శేఖన్న, హోంగార్డ్‌ జహీర్‌పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మద్దికెరలో వైసీపీ నేత వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వదిలేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

*యాదాద్రి: జిల్లాలోని భువనగిరి మండలం హనుమపూర్ బాచ్పన్ స్కూల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్కూటీని డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు వలిగొండ మండలం టేకులసోమారంకు చెందిన భార్యాభర్తలు దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి, నర్సింహ వదిన జంగమ్మగా గుర్తించారు. వీరు బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో ఓ చావుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కామారెడ్డిలో మద్యం మత్తులో రఫిక్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. ఏ వన్ బార్ మేనేజర్‎కు గన్‎తో బెదిరించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. బార్ వద్దకు చేరుకున్న పోలీసులు రఫిక్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు ఉపయోగించిన గన్..ఎయిర్ గన్‎గా పోలీసులు గుర్తించారు.
*దుకాణాలు మూసిన తర్వాత మద్యం అమ్ముతున్న పసుపులేటి సుబ్బరాయుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. స్థానిక కొత్త రోడ్డు వద్ద మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత రాత్రి 10 గంటలకు మద్యం విక్రయి స్తుండగా సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 41 క్వార్టర్‌ బాటిళ్లు స్వా ధీనం చేసుకున్న కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

*రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత ఓవైసీపై కేసు నమోదు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌లోని ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్‌ విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్‌పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఆమెతోపాటు నవీన్‌ జిందాల్‌ జర్నలిస్ట్‌ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

*దుకాణాలు మూసిన తర్వాత మద్యం అమ్ముతున్న పసుపులేటి సుబ్బరాయుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. స్థానిక కొత్త రోడ్డు వద్ద మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత రాత్రి 10 గంటలకు మద్యం విక్రయి స్తుండగా సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 41 క్వార్టర్‌ బాటిళ్లు స్వా ధీనం చేసుకున్న కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

*బెజవాడ పోలీసుల అదుపులో నలుగురు రౌడీ షీటర్స్ .. గంజాయ్ అక్రమ సరఫరా కేసులో రౌడీ షీటర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రౌడీ షీటర్స్ వద్ద మారణాయుధాలు, తుపాకీ ఉందన్న వార్తలలో వాస్తవం లేదన్న పోలీసులు. నగరంలో శాంతి భద్రతలు నేపధ్యంలో రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులపై నిఘా పటిష్టం చేసిన పోలీసులు

*విశాఖ జిల్లా పెందుర్తి లో దారుణం.టివి ఛానెల్ రిపోర్ట్ ను అంటూ మహిళ పై లైంగిక దాడి..మహిళపై లైంగిక దాడి….. ఆపై వీడియోతీసి బెదిరించిన రిపోర్ట్ పెందుర్తిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్ కుమార్ అని చెప్పి తనపై లైంగిన దాడి చేశాడని బాధితరాలు పిర్యాదు.. ఆ దృశ్యాలను రికార్డు చేసి ఛానళ్లలో ప్రచారిస్తాను అంటూ బెదిరించినట్లు బాధితురాలు వాపోయింది.. డబ్బులు కూడా డిమాండ్ చేసి,ఇవ్వకపోకడంతో తనపై దాడి చేసి బీరువాలోని 2 ఉంగరాలు,రూ.5 వేల నగదు తీసుకెళ్లినట్లు పెందుర్తి పోలీస్ స్టేషన్లోకు ఇచ్చే ఫిర్యాదు లో తెలిపింది. ఇంకా.. రిపోర్ట్ ఎవరన్నాది విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*నక్కలగుట్టలోని కళానికేతన్ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో షాప్ లోని వినాయకుని మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు షాప్ యజమానులు తెలిపారు.

*భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో ఫేస్‌బుక్‌లో అసభ్య ఫొటోల ప్రచారంపై కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాకింగ్ అయినట్లు భద్రాచలం పోలీసుల నిర్ధారణకు వచ్చారు. సైబర్ క్రైమ్‌కు పోలీసులు కేసు బదిలీ చేశారు. వేద పాఠశాల విద్యార్థులు క్రియేట్ చేసిన భద్రాచలం దివ్య క్షేత్రం అకౌంట్ హ్యాక్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*హస్తినాపురంలో జరుగుతున్న సినీ షూటింగ్‌లో రౌడీషీటర్‌ హల్‌చల్‌ చేశారు. దిల్‌రాజ్‌ (dilraju) ప్రొడక్షన్‌లో బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హస్తినాపురంలో జరుగుతోంది. వీజే సన్నీపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో రౌడీషీటర్‌ ఒక్కసారిగా వీరంగం సృష్టించారు. వీజే సన్నీపై దాడికి యత్నించారు. దీంతో ప్రొడక్షన్ సిబ్బంది అడ్డుకుని రౌడీషీటర్‎ను బయటకు పంపారు.

*లవ్‌ బ్రేకప్‌ అయినా మాజీ ప్రియుడు వదల్లేదు. గతంలో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను ప్రియురాలి కాబోయే భర్తకు పంపాడు. తమ ప్రేమ వ్యవహారం చెప్పాడు. అదీ మరికొద్ది గంటల్లో ఆ యువతికి పెండ్లి అవుతుందనగా.. పెండ్లి కుమారుడు ఈ విషయం వధువు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన ఆ యువతి చీర మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుల మండలం జాజులకుంటలో జరిగిన ఈ ఘటన పచ్చని పెండ్లి పందిరిలో పెను విషాదం నింపింది. బత్తుల అలేఖ్య (24) అనే యువతికి కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన బుచ్చిబాబుతో ఈనెల 9న వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే అలేఖ్య, టీటీసీ చదివే సమయంలో రవితేజ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత వారిద్దరికీ బ్రేకప్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు పెండ్లి నిశ్చయమైంది. దీన్ని జీర్ణించుకోలేని రవితేజ గతంలో తాము దిగిన ఫొటోలు, వీడియోలు పెండ్లికుమారుడికి పంపి తమ ప్రేమసంగతి చెప్పాడు. విషయాన్ని తెలుసుకున్న అలేఖ్య తీవ్ర ఆవేదనతో ఉరి వేసుకుని ఊపిరి తీసుకుంది. అలేఖ్య బంధువులు ఇచ్చిన పిర్యాదుతో రవితేజ, అతనికి సహకరించిన సునీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

* దెందులూరు ఘర్షణలో టీడీపీ వైసీపీ వర్గాలపై పోలీసులు కేసు చేశారు. ఆరుగురు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్త రాంబాబు ఫిర్యాదు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత మహేష్‌తో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైసీపీ నేత కామిరెడ్డి నానితో పాటు ఆరుగురిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వైసీపీ టీడీపీ మధ్య ఫేస్‌బుక్‌ పోస్టు వివాదానికి కారణమైంది. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు.

*మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేసిన ఘటన ఆత్మకూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఆత్మకూరులోని వెంగళరెడ్డి నగర్‌లో కూలి పని చేసుకొని జీవించే తండ్రీ కొడుకులు హసన్‌పీరా(70), మౌలాలి (25) మద్యానికి బానిసలై తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం మౌలాలి నిద్రిస్తుండగా మద్యం తాగి వచ్చిన తండ్రి హసన్‌ పీరా మౌలాలిపై కత్తి పీటతో దాడి చేశారు. గొంతు తెగి తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న మౌలాలిలను స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ద్వారా మౌలా లిని కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ శృతి, సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హసన్‌పీరా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

*పట్టపగలే తలుపులు బద్దలు కొట్టి దుండగులు చోరీ కి పాల్పడ్డారు. 33 గ్రాముల బంగారం), 750 గ్రాముల వెండి నగలు అపహరించారు. తిరుపతి, ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని, కాలూరు క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నారాయణ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రాంమోహన్. ట్రైనింగ్ కోసం భార్యా భర్తలు ఇరువురు నెల్లూరుకు పోయి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.