Devotional

రాజధాని ప్రాంతంలో వెంకన్న ఆలయం..వైభవంగా మహాసంప్రోక్షణ

Auto Draft

రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొనాల్సి ఉన్నా.. ఆయన పర్యటన అర్ధాంతరంగా రద్దయింది.గత ప్రభుత్వం అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు కేటాయించగా.. దీనిలో తితిదే తొలి విడతగా రూ.35 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామని.. ఇంకా 1200 ఆలయాల నిర్మించాల్సి ఉందని చెప్పారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ పూర్తయిన నేపథ్యంలో నేటి నుంచి వెంకటపాలెం ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు.