Movies

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనె

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనె

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆమె తండ్రి, మాజీ ఆటగాడు ప్రకావ్‌ పదుకొనె బర్త్‌డే సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమలను సందర్శించారు. శుక్రవారం(జూన్‌ 10) ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దీపికాకు ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. కాగా ప్రస్తుతం దీపికా పఠాన్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె షారుక్‌ ఖాన్‌ సరసన నటిస్తున్నారు. దీనితో పాటు మరో హాలీవుడ్‌ చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.