ఉత్తర కర్ణాటకలోని గుళేద్గుడ్డ ఖానా ఫ్యాబ్రిక్.. బ్లౌజ్ క్లాత్‌కు పెట్టింది పేరు. ఇప్పుడా సంప్రదాయ వస్త్రం ఆన్లైన్ వేదికగా మళ్లీ ప్రాణం పోసుకుంది. అందుకు కారణం 79 ఏండ్ల ఆదప్ప చినప్ప అలోర్లి. పదమూడేండ్ల వయసు నుంచి దోబీ మగ్గంపై ఖానా వస్త్రాన్ని నేస్తున్నారామె. అయితే, వెరైటీ ఫ్యాబ్రిక్స్ ధాటికి ఖానా వస్త్రం కనుమరుగయ్యే పరిస్థితులు తయారయ్యాయి. ఖానా ఖజానాను ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్, ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా ఎంచుకున్నారు అలోర్లి. ఖానా వస్త్రానికి కొత్త హంగులు అద్దుతున్నారు. దీనికోసం కర్ణాటక హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి టెక్స్‌టైల్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రమేశ్ అయోడి సహకారం తీసుకుంటున్నారు.
బాగల్కోట్ జిల్లా ఖానా బ్లౌజ్ ఫ్యాబ్రిక్, ఇల్కల్ చీరలకు నిలయంగా చెబుతుంటారు. నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు ఖానాలోనే వెఫ్ట్ కాటన్, వార్ప్ కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్‌ను రూపొందిస్తున్నారు. వాటిపై ప్రకృతి చిత్రాలు, పురాణగాథలు అచ్చువేస్తున్నారు. అలోర్లి ఇచ్చిన స్ఫూర్తితో స్థానిక చేనేత కళాకారులు ఓ సమూహంగా ఏర్పడి ఖానా ఫ్యాబ్రిక్‌ను నేస్తున్నారు. దానిని www.khanaweaves.in వెబ్సైట్లో, @khana_weaves పేరుతో ఇన్‌స్టాలో నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. తయారైన ఫ్యాబ్రిక్‌ను వెంటనే విక్రయించేలా వినియోగదారులతో వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేశారు. ఇలా కేవలం రెండు నెలల్లోనే ‘ఖానా వీవ్స్’ రూ.10 లక్షలు ఆర్జించడం విశేషం.