తెలుగు బుల్లితెరపై స్టార్ మహిళగా, తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతున్న యాంకర్ సుమ ప్రస్తుతం న్యూయార్క్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.అమెరికాలో తెలుగు సంఘాల వారు నిర్వహించిన కార్యక్రమానికి ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ క్రమంలోనే అక్కడ వారు తమకు చేసిన సత్కారాలు గురించి మనకు తెలిసిందే.ఇకపోతే యాంకర్ సుమతో పాటు రవి కూడా తన ఫ్యామిలీతో అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
సుమ సైతం అమెరికా రోడ్లపై డాన్సులు చేస్తూ ఎప్పటికప్పుడు తన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా సుమ వీడియో ద్వారా అమెరికాలో తాను పడుతున్న ఇబ్బంది గురించి తెలియజేశారు.ఇక ఈ విషయాన్ని సుమ ఒక రీల్ ద్వారా తెలియజేశారు.మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్లినా మంచి చాయ్ తాగే అలవాటు ఉంటుంది.ఇండియాలో ఎక్కువగా చాయ్ లవర్స్ ఉంటారు.మన సుమ కూడా చాయ్ లవరే.
అయితే చాయ్ అంటే ఎంతో ఇష్టమున్న సుమకు అమెరికాలో ఎంత వెతికినా ఒక్క చాయ్ దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.ఒక మంచి చాయ్ తాగడానికి అమెరికాలో కావాల్సి వస్తుందని ఎంత వెతికినా తనకు ఒక చాయ్ కూడా దొరకలేదని చెబుతూ చివరికి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి..ఎలాగోలా సంపాదించినట్టుంది.
ఈ రీల్ వీడియోలో సుమ తనకు చాయ్ దొరకలేదని చెబుతున్న కామెడీ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది.ఇక అమెరికాలో కాఫీ టీ బండి పెట్టుకుంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు అని ఈ సందర్భంగా సుమ అమెరికాలో తన పడుతున్న కష్టాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.మొత్తానికి సుమా అమెరికా ట్రిప్ బాగానే చిల్ అవుతున్నారని తెలుస్తోంది.
https://www.instagram.com/kanakalasuma/?utm_source=ig_embed&ig_rid=aa68e768-59ff-4ec0-a3da-51ac4a6baa13