Movies

ఆ హీరో ఒకడే నన్ను మేడం అని పిలుస్తాడు

ఆ హీరో ఒకడే నన్ను మేడం అని పిలుస్తాడు

తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్న. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాతో ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమెకు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అభిమానులు ఏర్పడ్డారు. రష్మిక బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసింది. తాజాగా మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించింది. ప్రస్తుతం ‘యానిమల్’ లో నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్హీ రోగా నటిస్తున్నాడు. ‘యానిమల్’ కు సంబంధించిన ఓ షెడ్యూల్ ఈ మధ్యనే మనాలీలో ముగిసింది. ఈ సందర్భంగా ఆ సినిమా షూటింగ్ విశేషాలను అభిమానులకు వివరించింది. రణ్‌బీర్‌ కపూర్‌ను మొదటిసారి కలసినప్పుడు నెర్వస్‌గా ఫీల్ అయ్యానని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ‘‘రణ్‌బీర్ మంచి వాడు అయినప్పటికీ మొదటిసారి కలసినప్పుడు నెర్వస్‌గా అనిపించింది. అతడిని కలసిన ఐదు నిమిషాలకే మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సందీప్, రణ్‌బీర్‌లతో పనిచేయడం అద్భుతంగా ఉంది. సినీ ఇండస్ట్రీలో రణ్‌బీర్ కపూర్ ఒకడే నన్ను మేడం అని పిలుస్తాడు. ఆ విధంగా పిలవడం నాకు ఇష్టం ఉండదు’’ అని రష్మిక మందన్న తెలిపింది. ‘యానిమల్’ ను టి-సిరీస్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను 2023, ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. రష్మిక ఈ చిత్రంలో గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది.