హీరోయిన్ ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూతురిని పొత్తిళ్లలోకి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ‘పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను’ అంటూ వైద్యులతో దిగిన పలు ఫొటోలు షేర్ చేసింది. కానీ ఇందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాతృత్వ మధురిమలతో ఉప్పొంగిపోతున్న ప్రణీతకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్ కాపీని షేర్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. బేబీ బంప్‌తో పాటు సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది.