Movies

పద్నాలుగు కోట్లా?

Deepika Padukone Charged 14 Crore INR For 83 Movie

ఇండస్ట్రీలో పారితోషికంపరంగా కొన్ని లెక్కలుంటాయి. హీరో కంటే హీరోయిన్‌కు పెద్ద అంకెల్లో చెక్కులు అందేవి కావు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. మార్కెట్‌ ఉన్న యాక్టర్స్‌కు అదే రేంజ్‌లో పారితోషికాలు అందుతున్నాయి. తాజాగా ‘83’ సినిమా కోసం దీపికా పదుకోన్‌ 14 కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలిసింది. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘83’. ఇందులో కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకోన్‌ కనిపిస్తారు.వివాహం తర్వాత రణ్‌వీర్‌– దీపికా కలసి నటిస్తున్న సినిమా ఇదే. తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన నేపథ్యంతో పాటు దీపిక– రణ్‌వీర్‌ మళ్లీ కలసి నటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. దీంతో దీపికా 14 కోట్లు వరకూ తీసుకుంటున్నారనుకోవచ్చు. అన్నట్లు ‘పద్మావత్‌’ సినిమాకి అందులో నటించిన రణ్‌వీర్, షాహిద్‌ కపూర్‌లకన్నా దీపికానే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఇక ‘83’ షూట్‌లో జాయిన్‌ అయ్యే ముందు రోమీ భాటియాతో కొంత సమయం గడిపి ఆ కథను తన కోణం నుంచి అర్థం చేసుకోవాలనుకుంటున్నారట దీపిక. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.