Business

57 భారత కంపెలీకు చోటు కల్పించిన ఫోర్బ్స్

Forbes lists 57 Indian companies in their top customer satisfied financial institutions

ప్రపంచంలోని 2000 అతిపెద్ద సంస్థల జాబితాలో భారత్‌కు చెందిన 57 కంపెనీలు చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. అదే సమయంలో అంతర్జాతీయంగా అగ్రగామి 10 వినియోగదారు ఆర్థిక సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఉండడం విశేషం.
* మొత్తం జాబితాలో ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది.
* భారత సంస్థల్లో తొలి ర్యాంకులో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంతర్జాతీయంగా 71వ స్థానంలో నిలిచింది. చమురు రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయంగా 11వ స్థానం లభించగా.. రాయల్‌ డచ్‌ షెల్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
* వినియోగదారు ఆర్థిక రంగంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలి స్థానంలో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ ఏడో ర్యాంకులో నిలిచింది. మొత్తం జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీది 332వ స్థానం కావడం విశేషం.
* మొత్తం జాబితాలో తొలి పది స్థానాల్లో ఐసీబీసీ, జేపీ మోర్గాన్‌, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌, అగ్రికల్చరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, యాపిల్‌, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, రాయల్‌ డచ్‌ షెల్‌, వెల్స్‌ ఫార్గోలున్నాయి.
* భారత్‌ నుంచి కేవలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే టాప్‌-200 జాబితాలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(209), ఓఎన్‌జీసీ(220), ఇండియన్‌ ఆయిల్‌(288), హెచ్‌డీఎఫ్‌సీ(332)లు కూడా మెరుగైన ర్యాంకులనే దక్కించుకున్నాయి.
* టాప్‌-500 సంస్థల్లో భారత్‌కు చెందిన టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో ఉన్నాయి.