రెక్కలు కట్టుకుని విదేశీ విహారానికి వెళ్తున్న ఆనందంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. దుస్తులు, ఆహారం… డాక్యుమెంట్లూ ఇలా! మరి మీ ఫోన్‌ని కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధం చేసుకున్నారా? అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం కాదు మరెన్నో..
* విదేశాలకు వెళ్లినప్పుడు అయినవాళ్లతో కమ్యూనికేషన్ ఎంత కీలకమో తెలియంది కాదు. మీ ఫోన్‌కి అంతర్జాతీయ ఛార్జీలు పడకుండా ఉండాలంటే ముందుగా మీ ప్రొవైడర్ అందించే అంతర్జాతీయ ప్లాన్ వివరాల గురించి తెలుసుకోండి. లేదంటే… ఇంటర్నేషనల్ సిమ్‌లు, ఫోన్‌లు అద్దెకు దొరుకుతాయి. విహారం పూర్తయ్యే వరకు వాటిని వాడుకోవచ్చు.
* ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు యూనివర్సల్ అడాప్టర్లు, కన్వర్టర్లు ఉంటాయి. వాటిని కొనుగోలు చేస్తే ఛార్జింగ్ సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఫేస్‌టైమ్, వాట్సాప్ వంటి యాప్స్ సాయంతో వాయిస్‌కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు పంపుకోవచ్చు. విదేశాల్లో మొబైల్ డాటాకు సంబంధించి పరిమితులు ఉంటాయి. చాలా హోటల్స్, రెస్టారెంట్లు ఉచిత వైఫై సౌకర్యం అందిస్తాయి. వాటిని వాడుకుంటే మంచిది.
విదేశాలకు వెళ్లినప్పుడు ఫోను సిమ్ ఎలా?
Related tags :