DailyDose

తిరుమలలో ఆగస్టు 7న కళ్యాణమస్తు కార్యక్రమం – TNI తాజా వార్తలు

తిరుమలలో ఆగస్టు 7న కళ్యాణమస్తు కార్యక్రమం  –  TNI  తాజా వార్తలు

* తిరుమలలో ఆగస్టు 7న కళ్యాణమస్తు కార్యక్రమం జరగనుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం 8.07 నుంచి 8.15 గంటల మధ్య కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. జులై 1 నుంచి జిల్లా కేంద్రాల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో మాత్రమే కల్యాణమస్తు నిర్వహించనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

*కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌తో పాటు పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాల‌కు చికిత్స పొందుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. క‌రోనా వైర‌స్ సోక‌డం, ముక్కు నుంచి ర‌క్త‌స్రావం కావ‌డంతో జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చేరారు. సోనియాకు ఆస్ప‌త్రిలో వైద్యులు స‌ర్జరీ నిర్వ‌హించారు.

* త్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో.. పని మనిషిగా చేసిన ఎస్సీ మహిళపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేశారని.. తెదేపా నేత వర్ల రామయ్య ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. చేయని దొంగతనాని ఒప్పుకోవాలంటూ మహిళపై చేసిన కస్టోడియల్‌ టార్చర్‌ ఫిర్యాదుపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

* చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో.. పని మనిషిగా చేసిన ఎస్సీ మహిళపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేశారని.. తెదేపా నేత వర్ల రామయ్య ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. చేయని దొంగతనాని ఒప్పుకోవాలంటూ మహిళపై చేసిన కస్టోడియల్‌ టార్చర్‌ ఫిర్యాదుపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

* అవినీతి ఆరోపణలతో కర్ణాటకలోని పలువురు ప్రభుత్వ అధికారుల నివాసాలపై శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించింది అవినీతి నిర్మూలన విభాగం(ఏసీబీ). తనిఖీల్లో భాగంగా బాగల్కోట్ ఆర్టీఓ అధికారి బంధువు ఇంట్లో రూ.42 లక్షల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. నగదుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు.

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

*జ‌గిత్యాల జిల్లాకు బీసీ స్ట‌డీ స‌ర్కిల్ మంజూరు కావ‌డంపై ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌కుమార్ హ‌ర్షం వ్య‌క్తంచేశారు. స్ట‌డీ స‌ర్కిల్ మంజూరుకు కృషిచేసిన బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బీసీ స్ట‌డీ స‌ర్కిల్‌లో గ్రూప్ 1,2,3,4, ఇత‌ర‌ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ఇస్తూ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారని చెప్పారు.

*ఏపీలోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్న 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాల కోసం ముద్రించిన ముహూర్త పత్రికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ముద్రించిన పత్రికలను ముందుగా శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో పూజ‌లు చేసి అక్కడి నుంచి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ‌ ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ కల్యాణమస్తులో వివాహం చేసుకునే జంటలు జులై 1వ తేదీ నుంచి తమ పేర్లను న‌మోదు చేసుకోవాల‌ని తెలిపారు. అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో తమ పేర్లను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమం నిర్వహిస్తామ‌ని, ఇందుకోసం పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజ‌నం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప‌దేళ్ల త‌రువాత క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించా మ‌ని వివరించారు.మొద‌ట ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించి ఆ త‌రువాత ఇత‌ర రాష్ట్రాల్లో చేప‌డ‌తామ‌ని ఈవో చెప్పారు. అనంత‌రం ముహూర్త ప‌త్రికను సిద్ధం చేసిన టీటీడీ ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యుల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో శాలువ‌తో స‌న్మానించారు.

*తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ద‌ర్శన‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, ఆల‌య ప్రధాన అర్చకులు, కంక‌ణ‌బ‌ట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌వాణి, అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

*అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను అంటుబెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లను క్యాన్సల్‌ చేశారు.

*రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోద‌రుడు అగ్ర‌సేన్ గెహ్లాట్ ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంది. అగ్ర‌సేన్ ఆఫీసుకు కూడా ద‌ర్యాప్తు సంస్థ వెళ్లిన‌ట్లు తాజా స‌మాచారం ద్వారా తెలుస్తోంది. గ‌తంలో ఫెర్టిలైజ‌ర్ల స్కామ్‌లో అగ్ర‌సేన్‌ను ఈడీ అధికారులు విచారించారు. గ‌త ఏడాది ప‌లు ప్ర‌దేశాల్లో ఈడీ దాడులు కూడా చేసింది. 2007 నుంచి 2009 మ‌ధ్య స‌బ్సిడీ ఫెర్టిలైజ‌ర్‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసిన‌ట్లు అగ్ర‌సేన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవాళ జోద్‌పూర్‌లో ఉన్న అగ్ర‌సేన్ ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

*తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ కళల పట్ల మమకారంతో ఉన్నారని, కేసీఆర్ చొరవతో సాహిత్యానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు.ర‌వీంద్ర భార‌తిలో గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ నిర్వ‌హిస్తున్న శిల్పకళా ప్రదర్శనను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారితో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కళలు,సాహిత్యానికి ఎంతో గుర్తింపు లభిస్తోందన్నారు.

*ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.షర్మిల చెప్పే సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేసిన విమర్శలకు మంత్రి స్పందించారు.షర్మిలకు దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు.వైఎస్‌ హయాంలో భూములెవరు కబ్జా చేశారో అందరికీ తెలుసునని, నేను ఉత్త పుణ్యానికి మంత్రి అయ్యాని పువ్వాడ పేర్కొన్నారు.మీ అన్న, నాన్నలా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులివ్వడం కేసీఆర్‌కు తెలీదని అన్నారు.

* వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జులియ‌న్ అసాంజేను అమెరికాకు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ ఆమోదించింది. ఈ విష‌యాన్ని బ్రిట‌న్ హోంశాఖ మంత్రి ప్రీతీ పాటిల్ తెలిపారు. అయితే 14 రోజుల్లోగా దీనిపై ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ఇస్తున్న‌ట్లు హోంశాఖ తెలిపింది. అమెరికాలో ఉన్న స‌మ‌యంలోనూ స‌రైన రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వ‌నున్న‌ట్లు అప్ప‌గింత ఒప్పందంలో తెలిపారు. 2010లో డాక్యుమెంట్లు లీక్ చేసిన కేసులో అమెరికా వాంటెడ్ లిస్టులో అసాంజే ఉన్నారు. అయితే బ్రిట‌న్ నిర్ణ‌యంపై కోర్టుకు అపీల్ చేయ‌నున్న‌ట్లు వికీలీక్స్ సంస్థ తెలిపింది. అమెరికాకు అప్ప‌గింత అంశంపై అసాంజే భార్య స్టెల్లా మాట్లాడుతూ.. త‌న భ‌ర్త ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని, ఆయ‌న ఎటువంటి నేరానికి పాల్ప‌డ‌లేద‌న్నారు. ఆయ‌నో జ‌ర్న‌లిస్టు అని, ప‌బ్లిష‌ర్ అని, త‌న డ్యూటీ చేసినందుకు ఆయ‌న్ను వేధిస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు.

*సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. ఆర్మీ అధికారుల‌తో చ‌ర్చ‌ల‌కు 10 మంది రావాల‌ని వారిని పోలీసులు కోరిన‌ప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు. వ‌స్తే చ‌ర్చ‌ల‌కు అంద‌రం వ‌స్తాం.. కానీ ప‌ది మంది అయితే వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని యువ‌కులు తేల్చిచెప్పారు. ఆర్మీ అధికారుల‌తో చ‌ర్చ‌ల‌కు యువ‌కులు నిరాక‌రించారు. ఆర్మీ నియామ‌క అధికారి త‌మ వ‌ద్ద‌కే వ‌చ్చి చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. చావ‌డానికైనా సిద్ధం.. కానీ చ‌ర్చ‌ల‌కు రాం అని స్ప‌ష్టం చేశారు. ఇంకా ప‌ట్టాల‌పైనే యువ‌త ఉన్నారు. స్టేష‌న్‌లోనే కూర్చొని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. యువ‌కుల ఆందోళ‌న‌ల‌తో ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో పోలీసులు ఉన్నారు.

*బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటే వారిని ఉగ్రవాదులు మాదిరిగా ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అనడం దుర్మార్గమని అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవిద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారు.

*అగ్నిపథ్‌ పథకం పై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం సృష్టించాలనే అలజడులు సృష్టించారని మండిపడ్డారు. దేశభక్తి, జాతీయ భావం పెంచే క్రమంలోనే అగ్నిపథ్‌ తెచ్చామని తెలిపారు. అనేక దేశాల్లో అగ్నిపథ్‌ లాంటి పథకాలు ఉన్నాయని గుర్తుచేశారు. నాలుగేళ్ల తర్వాత విధిగా దేశ సేవ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశ సేవ చేయాలనుకున్నవారే అగ్నిపథ్‌లో చేరవచ్చన్నారు. ఇది కంపల్సరీ స్కీమ్‌ కాదని, అగ్నిపథ్‌ అనేది వాలంటరీ స్కీమ్ అని కిషన్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‌పై దేశంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అనేక దేశాల విధానాన్ని పరిశీలించాకే అగ్నిపథ్‌ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు.

*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ ప్రకటించింది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 040-27786666కు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు.

*కృష్ణ జిల్లా ఎస్పీగా జాషువా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..‘‘ కృష్ణాజిల్లాలో వివిధ ప్రాంతాలలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఎంతో చరిత్ర ఉన్న కృష్ణాజిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. జిల్లాలో శాంతి భధ్రతలపై ప్రత్యేక దృష్టి పెడతాం. చట్టాన్ని ఉల్లంఘించే శక్తుల‌పై నిఘా పెడతాం. మహిళా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ..తగిన చర్యలు తీసుకుంటాం. నాకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తా.’’ అని చెప్పారు.

*పిఎంఎస్ఐడీసీ జనరల్ మేనేజర్‌గా డాక్టర్ కె సురేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సర కాలం పాటు ఈయన జీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ కింద విధులు నిర్వహిస్తున్న సురేష్ నియామకం కోసం నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయాల్సిందిగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్‌ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లనున్నారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

*అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తున్న హింసాత్మక ఆందోళనలు జరుగకుండా ఏపీలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక రైల్వే స్టేషన్ల వద్ద భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైఅలర్ట్‌ ను ప్రకటించారు. స్టేషన్ల పరిసరాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుంటూరు, కడప , నరసరావుపేట, బాపట్ల స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలు భద్రతను పెంచాయి .

*పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీటింగుల గురించి సమాచారం ఇవ్వడంలేదని ఎంపీడీవోపై వైసీపీ ఎంపీపీ మండిపడ్డారు. ‘‘నేను మండల పరిషత్ అధ్యక్షుడు నేనా అనే అనుమానం కలుగుతుంది. సర్వసభ్య సమావేశం గురించి గాని అజెండా గురించి గాని ఎంపీడీవో ఎప్పుడూ చర్చించలేదు. నన్ను ఎంపీపీగా ఎప్పుడూ ఆయన గుర్తించలేదు. ఎమ్మెల్యే రంగనాథ్ రాజు కంటే ఇన్‌చార్జ్ ఎంపీడీవో సుప్రీమ్’’ అంటూ ఎంపీపీ కర్రీ వెంకట నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వాయులింగేశ్వరుని 17,047 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500, రూ.750, రూ.1500, రూ.2500, రూ.5వేల రూపాయల టిక్కెట్లతో మొత్తం 1873 మంది రాహు-కేతు కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. 22 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇవాళ రాహు-కేతు పూజల కోసం, స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటకు ఒకసారి రాహు-కేతు పూజలు జరగనున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. రూ.200ల ప్రత్యేక దర్శనానికి ఆర్థగంట సమయం పడుతోంది.

*అంగన్వాడీ పిల్లలకు గ్రోత్‌ మానిటరింగ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బరువు పెరగడం అనేది పిల్లల ఆరోగ్యానికి సూచిక కాగా, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ప్రధాన బాధ్యతలలో ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల క్రమమైన పెరుగుదల పర్యవేక్షణ కూడా ఒకటని తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని ముందస్తుగా గుర్తించి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ఈ గ్రోత్‌ డ్రైవ్‌ సహాయపడుతుదని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే 257 మంది సీడీపీవోలు, 1450 మంది సూపర్‌ వైజర్‌లు శిక్షణ పూర్తి చేశారన్నారు. ట్రయల్‌ ప్రాతిపదికన ఈ నెల మొదటి వారంలో పిల్లల ఎత్తులు, బరువులు నమూనా కొలతలు తీసుకోగా, ఈ డ్రైవ్‌ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని సిరి వివరించారు.

* అనంతపురం జిల్లాలో పంటల బీమా అందని రైతుల పేర్లను తిరిగి జాబితాలోకి చేర్చే కార్యక్రమం వైసీపీ నేతల కనుసన్నల్లో సాగింది. వజ్రకరూరు మండలం రాగులపాడులో గురువారం రాత్రి అధికారపార్టీ నాయకులే ఈ తతంగాన్ని నడిపించారు. గ్రామ సచివాలయంలో రాత్రి 8-45 గంటల ప్రాంతంలో లైట్లు వెలుగుతుండటంతో అనుమానం వచ్చిన రైతులు, సచివాలయంలోకి వెళ్లి పరిశీలించారు. వైసీపీ నాయకులు, వీఏఏ ఉష, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రెహమాన్‌ రైతుల పేర్లను కంప్యూటరులో నమోదు చేస్తూ కనిపించారు. దీంతో గ్రామస్థులు, కొందరు రైతులు వీఏఏను నిలదీశారు. క్రాప్‌ బుకింగ్‌లో పేర్లు నమోదై, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కాని రైతులు వివరాలను ఈ రోజు రాత్రిలోపు పంపాల్సి ఉందని, అందుకే వారు పని చేస్తున్నారని ఏఓ వెంకట రమణ తెలిపారు. అన్ని సచివాలయాల్లో ఇలాగే చేస్తున్నారా అని అడుగగా.. ల్యాప్‌ట్యా్‌పలలో ఇళ్లల్లో పని చేస్తున్నారని సమాధానమిచ్చారు. అలాగే, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దేవగిరిలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా సొమ్ము రాలేదని రైతులు ఆందోళనకు దిగారు. అయితే, ఆర్‌బీకేలో విధులు నిర్వహిస్తున్న తమను దౌర్జన్యంగా బయటకు పంపించారని, ఆర్‌బీకేకి తాళం వేసి విధులకు ఆటంకం కలిగించారని ఎంపీఈవో భాస్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌లో హై సెక్యూరిటీ పెట్టారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్ అన్ని గేట్లు వద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.

*మూడేళ్ల అనంతరం తిరిగి బాధ్యతలు స్వీకరించానని, అయితే తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌ కు గతంలో కీర్తి ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందుతూ వచ్చిందన్నారు. విభజన తరువాత మిగిలిన ఈ విభాగంలోని స్థితి గతులను అధ్యానం చేస్తానన్నారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సయితం ఇక్కడ ప్రింటింగ్ అయ్యేవని, ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా తాను భావించడంలేదన్నారు. నియామకాల విషయంలె ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు కార్యాలయాన్ని పరిశీలించారు.

*మర్రిపాడులో అధికారులు, వైసీపీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. చెత్త సేకరణ బండి ద్వారా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ఏకంగా పంచాయతీ సిబ్బందే కరపత్రాలు అంటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారుల తీరుపై బరిలో ఉన్న ప్రత్యర్థులు మండిపడుతున్నారు.

*సికింద్రాబాద్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 71 రైళ్లను నిలిపివేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. రైల్వే జీఎం అత్యవరసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తిగా రైల్వే శాఖ రద్దు చేసింది. జంట నగరాల్లోని పలు రైల్వేస్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కాజీపేట, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లలో పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులను లోపలికి అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారులన్నీ మూసేశారు. బస్సులను సైతం స్టేషన్ వైపునకు అనుమతించడం లేదు.

*విమాన ఇంధన(ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కిలో లీటరుకు 16.26ు మేర పెరిగి మునుపెన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరాయి. దీంతో ప్రస్తుతం కిలోలీటరు ధర రూ.1,41,232.87కు చేరుకుంది. ఇంధన ధరల పెంపుతో విమాన టికెట్‌ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఏటీఎఫ్‌ ధరలు భారీగా పెరగడం, రూపాయి ధర క్షీణించడంతో విమన చార్జీలు 10-15ు పెరిగే అవకాశాలున్నాయని స్పైస్‌ జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు.

*భూ వివాదాల పరిష్కారంలో కీలకమైన అప్పీల్స్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనరసింహం నియమితులయ్యారు. ఈ నెల 8నే నియామక ఉత్తర్వు(జీవో 1069) ఇచ్చినా.. దానిని ప్రభుత్వం గుట్టుగా ఉంచింది. నియామకం జరిగిన ఐదు రోజులవుతున్నా బయటపెట్టలేదు. లక్ష్మీనరసిహం ఇంకా విధుల్లో చేరలేదు. ఆయన బాధ్యతలు చేపట్టే రోజున నియామక ఉత్తర్వుల డాక్యుమెంటును సీసీఎల్‌ఏ కార్యాలయంతోపాటు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లోనూ సమర్పించాల్సి ఉంటుంది. ఈ జీవోను సర్కారు రహస్యంగా ఉంచడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనరసింహం రిటైర్మెంట్‌కు ముందు ఇన్‌చార్జి అప్పీల్స్‌ కమిషనర్‌గా ఉన్నారు. అయితే రిటైర్డ్‌ అధికారిని ఆ పోస్టులో నియమించడం ఇప్పుడు ఐఏఎస్‌ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది.

*సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికిబల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తులు ఆన్‌లైన్‌లో బోనాలు సమర్పించే అవకాశాన్ని దేవాదాయశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అరణ్యభవన్‌లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భక్తులు ఆన్‌లైన్‌లో బోనం బుక్‌ చేసుకుంటే ఆలయ నిర్వాహకులే భక్తుల పేరుతో అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి బోనంలోని బియ్యాన్ని ప్రసాదంలా తపాల శాఖ, ఆర్టీసీ కొరియర్‌ ద్వారా అందజేస్తారన్నారు. బియ్యంతోపాటు బెల్లం, అక్షింతలు, పసుపు-కుంకుమ భక్తులకు అందుతాయని మంత్రి వివరించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్‌లైన్‌ బోనం సేవలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఉత్సవాలు ముగిసే వరకు (జూలై 30) అందుబాటులో ఉంటాయన్నారు. ఖీ అఞఞ ఊౌజూజీ, మీ సేవ, ఆలయ వెబ్‌సైట్‌, పోస్టాఫీసు ద్వారా స్వదేశీ, విదేశీ భక్తులు ఆన్‌లైన్‌ బోనం సేవల్ని వినియోగించుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ బోనానికి స్వదేశీ భక్తులు రూ.300, విదేశాల్లో ఉన్న భక్తులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

*ఏపీ లో ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పెంచింది. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించింది. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో గడువు పెంచాలని సీఎం జగన్‌కు పలు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల గడువును నెలాఖరు వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.

*గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్ష పాసైన వారందర్నీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రతిపాదన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత గురువారం అత్యధికంగా 285 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య డైరెక్టర్‌ కార్యాలయం ప్రకటించింది. ఇందులో ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 188 కేసులు నమోదవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స కోసం 18 మంది ఆస్పత్రుల్లో చేరారు.

*రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల్లో కలిపి 13 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గురువారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. పరిగిలో రూ.కోటి నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పరిగి ప్రభుత్వాస్పత్రిని సందర్శించి, రోగులకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు. అనంతరం ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను సందర్శించి నిరుద్యోగ అభ్యర్థులకు స్టడీ మెటీరియర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతూ స్థానికులకు 95ు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు.

*పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల ప్రవాహాలపై తీవ్ర ప్రభావం పడనుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రాంతాలే ముంపునకు గురవుతాయని, ఆ రాష్ట్రాలే ప్రభావితం అవుతాయని పరిగణనలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణ అధికారికి తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు సమస్యపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయగా ఆ కేసులో తెలంగాణ కూడా ఇంప్లీడ్‌ అయిందని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని తీర్పు ఉందని, అయితే పీపీఏ మాత్రం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లనే పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు.

*అగ్నిప‌థ్ స్కీమ్‌పై చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌ర్మ‌నెంట్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రెండేళ్ల కోసం ఎందుకు రిక్రూట్ చేయ‌డంలేద‌ని సెటైర్ వేశారు. నాలుగేళ్ల త‌ర్వాత యువ‌కుడు ఇంటికి నిరుద్యోగిలా వ‌స్తే, అలాంటి స‌మ‌యంలో ఇంత భారీ సంఖ్య‌లో ఉన్న యువ‌త‌ను ఏ ద‌శంలోకి రిక్రూట్ చేసుకుంటార‌ని భూపేశ్ భ‌గ‌ల్ ప్ర‌శ్నించారు. ఒక‌వేళ పోలీసు ద‌ళంలోకి వాళ్ల‌కు తీసుకోకుంటే అప్పుడు ఏం జ‌రుగుతుంద‌ని సీఎం అడిగారు. పిస్తోళ్ల‌ను ఎలా ఆప‌రేట్ చేయాలో వాళ్లు నేర్చుకుంటార‌ని, మ‌రి అలాంట‌ప్పుడు ఈ స‌మాజాన్ని ఎటు వైపు తీసుకువెళ్తున్నార‌ని సీఎం ప్ర‌శ్నించారు. మీ ఆలోచ‌న‌లు స్వ‌చ్ఛంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డంలేద‌న్నారు. యువ‌తను మ‌ధ్య‌లో వ‌దిలేస్తే వాళ్లు గ్యాంగ్‌లుగా మారుతార‌ని, వాళ్లే నేరాల్లో పాలు పంచుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భ‌గ‌ల్ అన్నారు.

*అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ
శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో
విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో రథోత్సవం కోలాహలంగా జరిగింది.అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహిస్తామని, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారని టీటీడీ అర్చకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, ఆల‌య ప్రధాన అర్చకులు కంక‌ణ‌బ‌ట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌వాణి, అధికారులు పాల్గొన్నారు.

*ఈ నెల 30న ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రకు ఆన్‌లైన్‌లో హెలికాప్టర్‌ బుకింగ్‌ పోర్టల్‌ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా గురువారం ప్రారంభించారు. ఈ సేవలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. భక్తులు శ్రీనగర్‌ నుంచి నేరుగా పంచతర్ణి వెళ్లవచ్చు. ఒక్కరోజులో యాత్ర ముగించుకోవచ్చని మనోజ్‌సిన్హా ట్వీట్‌ చేశారు.
*విమాన ఇంధన(ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కిలో లీటరుకు 16.26ు మేర పెరిగి మునుపెన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరాయి. దీంతో ప్రస్తుతం కిలోలీటరు ధర రూ.1,41,232.87కు చేరుకుంది. ఇంధన ధరల పెంపుతో విమాన టికెట్‌ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఏటీఎఫ్‌ ధరలు భారీగా పెరగడం, రూపాయి ధర క్షీణించడంతో విమన చార్జీలు 10-15ు పెరిగే అవకాశాలున్నాయని స్పైస్‌ జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు.

*పోలీస్‌ పోస్టుల రాతపరీక్షల సిలబ్‌సకు ఏ ఒక్క పుస్తకమూ ప్రామాణికం కాదని రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) స్పష్టం చేసింది. ఫలానా పుస్తకాలు చదవమని అభ్యర్థులకు తాము సూచించబోమని వివరించింది. రాతపరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలపై తలెత్తే వివాదాల పరిష్కారానికి పాఠ్యపుస్తకాలను తెలుగు అకాడమీ పుస్తకాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే… సబ్జెక్టు నిపుణుల కమిటీని సంప్రదిస్తామని తెలిపింది. అభ్యంతరాల పరిష్కారంలో కమిటీదే తుది నిర్ణయమని పేర్కొంది. ఈ అంశంపై పోలీస్‌ నియామక మండలి అధికారులు స్పందిస్తూ… గత నోటిఫికేషన్‌ సమయంలో రాతపరీక్షల్లోని ప్రశ్నలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ ఇతర పాఠ్యపుస్తకాలను అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకుని… కొన్ని ప్రశ్నలకు ప్రాథమిక కీలో తప్పుడు సమాధానాలున్నాయని మా దృష్టికి తీసుకువచ్చారు. కొందరు హైకోర్టుకూ వెళ్లారు. ప్రశ్నలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు విషయ నిపుణులతో కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ సూచించిన సమాధానాన్నే పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో సిలబ్‌సకు ఎలాంటి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోబోం అని తెలిపారు.

*పారిస్‌ పర్యటనకు వెళ్లేందుకు తనకు వారం రోజుల పాటు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి (హైదరాబాద్‌)లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. జగన్‌ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి ఫాంటెయిన్‌బ్లూలోని ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. జూలై వ తే దీన విద్యాసంస్థలో స్నాతకోత్సవం జరగనుంది. సీఎం జగన్‌ వ్యక్తిగత హోదాలో ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల నుంచి వారం పాటు విదేశీ పర్యటనకు అనుమతి కోరారు. సీబీఐ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ జగన్‌ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. తాను పారిస్‌ వెళ్లడం కోసం ఆదేశాలను సవరించాలని సీబీఐ కోర్టును ఆయన అభ్యర్థించారు. జూలై 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తానని వెల్లడించారు. ఆయన అభ్యర్థనపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు శుక్రవారం నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇటీవల జగన్‌ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు కూడా వారం రోజులు పర్మిషన్‌ తీసుకున్నారు. ఆ సందర్భంగా లండన్‌లో దిగడం చర్చనీయాంశమైంది. విమానంలో ఇంధనం నింపుకోవడానికి ఇస్తాంబుల్‌లో ఎక్కువ ేసపు ఆపాల్సి వచ్చిందని, అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో జ్యూరిక్‌లో విమానం ల్యాండింగ్‌కు నిబంధనలు అడ్డొచ్చి.. తప్పనిసరి పరిస్థితుల్లో లండన్‌ వెళ్లాల్సి వచ్చిందని అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

*రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌లో సైబర్‌ దొంగలు పడ్డారు. వెబ్‌సైట్‌లోని లోపాలను ఆసరాగా చేసుకొని ప్రజల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వాటిపై ఉన్న ఫింగర్‌ ప్రింట్స్‌ను, ఆధార్‌ నెంబర్లను చోరీ చేసి పాలిమర్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ (క్లోనింగ్‌) సృష్టిస్తున్నారు. వాటి సహకారంతో కస్టమర్ల ఖాతాలను తెలుసుకొని ఏఈపీఎ్‌స(ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం) ద్వారా డబ్బులు దోచేస్తున్నారు. హైదరాబాద్‌లో కూర్చుని ఏపీలోని కస్టమర్‌ల బ్యాంకు ఖా తాలను ఖాళీ చేస్తున్న ఏడుగురు సభ్యుల సైబర్‌ దొంగల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా ఒంగోలు, గుంటూరుకు చెందిన వారు కావడం గమనార్హం. కేవలం నెల వ్యవధిలోనే 10వేలకు పైగా పాలిమర్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తయారు చేసిన వీరు.. రూ.కోట్లు కొల్లగొట్టేందు కు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 2,500 ఫింగర్‌ ప్రింట్స్‌ ఉపయోగించి 149 బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తమ ఖాతాలకు మళ్లించుకున్నట్టు గుర్తించారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం ఆయా వివరాలను వెల్లడించారు.

*దేవదాయశాఖ ఉద్యోగుల బదిలీకి ఎట్టకేలకు ఆదేశాలు వచ్చాయి. ఆ శాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలతో కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఐదేళ్లు దాటిన ఉద్యోగుల వివరాలివ్వాలని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. దేవదాయశాఖలో అధికారులు ఎక్కడికక్కడ పాతుకుపోయారని ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శాఖాపరంగా పెద్దగా స్పందన లేకపోవడంతో స్వయంగా ఉపముఖ్యమంత్రి కలుగజేసుకున్నారు. ఈ సాధారణ బదిలీల్లో అయినా వారందరికీ స్థానచలనం కల్పించాలని మంగళవారం ఉపముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగుల వివరాలను వెంటనే పంపాలని రీజినల్‌ జాయింట్‌ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్‌ కమిషనర్లు దేవస్థానాల ఈవోలను ఆదేశించారు. ఒకే చోట వేర్వేరు కేడర్లలో ఐదేళ్లు పూర్తిచేసిన ఉద్యోగులను కూడా ఈ జాబితాలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

*మాట తప్పుడు, మడమ తిప్పుడు ఈ ప్రభుత్వానికి షరా మామూలైంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులను, చివరికి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్రంలోని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఆక్షేపిస్తున్నారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తామన్న జగన్‌ మాటలు నీటిమూటలయ్యాయని విమర్శిస్తున్నారు. పీఆర్సీలో అందరికీ జీతం పెరిగితే తమకు పెంచారో? లేదో? చెప్పడం లేదంటున్నారు. గత ఆర్నెల్ల నుంచి హెల్త్‌ ఆక్యుపేషన్‌ అలవెన్స్‌ నిలిపేయడంతో సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

*ప్రభుత్వం నుంచి భూములు పొందిన సంస్థలు ప్రాజెక్టులను పట్టాలకెక్కించే సమయాన్ని పదేళ్లకు పొడిగిస్తూ ఏపీఐఐసీ బోర్డు నిర్ణయించింది. ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌(ఈవోటీ)కి సంబంధించి జరిమానాలను సరళతరం చేసేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జరిమానా విధించేందుకు భూమి కేటాయించే నాటికి ఉన్న ధరకు బదులు.. వాణిజ్య ఉత్పత్తి మొదలైన నాటికి ఉన్న ధరను పరిగణలోకి తీసుకోవాలని తీర్మానించింది. ఏపీఐఐసీ బోర్డు చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, సైన్‌బోర్డుల ఏర్పాటు, మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

* ప్రభుత్వం నుంచి భూములు పొందిన సంస్థలు ప్రాజెక్టులను పట్టాలకెక్కించే సమయాన్ని పదేళ్లకు పొడిగిస్తూ ఏపీఐఐసీ బోర్డు నిర్ణయించింది. ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌(ఈవోటీ)కి సంబంధించి జరిమానాలను సరళతరం చేసేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జరిమానా విధించేందుకు భూమి కేటాయించే నాటికి ఉన్న ధరకు బదులు.. వాణిజ్య ఉత్పత్తి మొదలైన నాటికి ఉన్న ధరను పరిగణలోకి తీసుకోవాలని తీర్మానించింది. ఏపీఐఐసీ బోర్డు చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, సైన్‌బోర్డుల ఏర్పాటు, మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

*అరవై రోజులుగా పెండింగులో ఉన్న ఓటరు నమోదు అభ్యంతరాలను తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనా ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒటరు నమోదుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలన్నారు.

*కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు చేపట్టిన రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమం అరెస్టులకు దారితీసింది.పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావుతోపాటు పలువురు నాయకులు గాంధీనగర్‌ నుంచి రాజ్‌భవన్‌కు గురువారం బయలుదేరారు. వారిని అక్కడే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. శైలజానాథ్‌ తదితరులను కృష్ణలంక పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. నరహరశెట్టి నరసింహరావు తదితరులను గవర్నరుపేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

* పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లాకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలో మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ… జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా సర్వీ్‌సలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు. జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ… ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వృత్తి జీవితంలో సహ కరించిన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌ శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా దంపతులను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది.

*ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ జారీచేసింది. రాష్ట్రం మొత్తం ఉర్దూ రెండో భాషగా ఉండాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు ఆమోదింపజేసుకుంది. దీనిపై వెంటనే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉండగా, మూడు నెలల తర్వాత ఇప్పుడు బిల్లును చట్టం రూపంలో అమల్లోకి తెస్తూ గెజిట్‌ జారీచేసింది.

*ఏపీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వాక్‌ ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. రాష్ట్రం నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్స్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్‌లోకి అడుగు పెట్టేవారు, ఇంటర్‌ పూర్తి చేసుకున్న వారికి ‘టెక్‌ బీ’ కార్యక్రమం కింద కెరీర్‌ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రత్యేక క్లాసులు, శిక్షణ అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం కల్పించటంతో పాటు వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదివేందుకు సహకరించనుంది. దీనిపై హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్బరామన్‌ బాలసుబ్రమణ్యం గురువారం విజయవాడలో మాట్లాడుతూ.. ఏపీలో గత రెండేళ్లుగా వెయ్యి మందిని టెక్‌బీ కింద తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది(2022-23) ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. విజయవాడ హెచ్‌సీఎల్‌ హెడ్‌ శివ ప్రసాద్‌ మాట్లాడుతూ, విజయవాడ హెచ్‌సీఎల్‌లో 3,500 మంది పని చేస్తున్నారని, క్యాంప్‌సను పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నామని వివరించారు.

*కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉండాల్సిందేనని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అధికారులకు స్పష్టంచేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా, కలెక్టరేట్‌లో కేంద్ర పథకాల అమలు తీరుపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. కేంద్ర పథకాలకు సీఎం జగన్‌ సొంత పేర్లు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆయన్ను అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని.. కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తున్నా, ప్రజలకు చెప్పడం లేదన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత కలెక్టర్‌దేనని స్పష్టంచేశారు.

* నలభై ఏళ్ల క్రితం వ్యవసాయ మోటార్లకు తొలగించిన మీటర్లను మళ్లీ బిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతు పోరు బాట పేరుతో ఈ నెల 25 నుంచి జూలై 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించాలని టీడీపీ అనుబంధ విభాగం తెలుగు రైతు నిర్ణయించింది. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ విభాగం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. మీటర్ల బిగింపు భవిష్యత్తులో రైతుల పాలిట ఉరితాడు అవుతుందని, దశలవారీగా ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడానికే మీటర్లను బిగిస్తున్నారని ఈ సమావేశం ఆరోపించింది. పంటల బీమా పరిహారం అర్హులైన రైతులు అందరికీ అందనందువల్ల అందరికీ అందే ఏర్పాటు చేయాలని ఈ సమావేశం కోరింది. భూమి శిస్తు బకాయిలు 6శాతం వడ్డీతో వసూలు నిర్ణయం ఉపసంహరణ సహా ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేసింది.

*‘‘పంటల బీమా పరిహారం అధికంగా వైసీపీ వారికి మాత్రమే అందింది. పంటలు సాగు చేసిన అసలు రైతులకు మొండి చెయ్యి చూపించి సొంత పార్టీ వారి ఖాతాలకు మాత్రం డబ్బులు జమ చేశారు’’ అని టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘కౌలు రైతులకు ఒక్కరికి కూడా పరిహారం రాలేదు. లంక భూముల్లో ఏక్‌ సాల్‌ లీజు కౌలుదారులకు, సొసైటీ భూములు సాగు చేస్తున్న దళిత రైతులకు, పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు, ఆలయ భూములు సాగు చేస్తున్న కౌలుదారులు, అస్సైన్డ్‌ భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అగ్ర కులాల్లో పేద రైతులకు పంటల బీమా అందలేదు.

*టీటీడీ, ఉన్నతాధికారులపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో పదవీకాలం పొడిగింపు కోసం లాబీయింగ్‌ చేసేందుకు ఏకంగా 300 కల్యాణోత్సవ లడ్డూలను ప్రత్యేక విమానంలో ధర్మారెడ్డి ఢిల్లీకి తరలించారని కొంతమంది పది రోజుల క్రితం సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారన్నారు. నిజానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కలుస్తారని, ఈ క్రమంలో స్వామి ప్రసాదాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అభ్యర్థన మేరకు 30 కల్యాణోత్సవ లడ్డూలను మాత్రమే పంపారని, దానికి సంబంధించిన మొత్తాన్ని టీటీడీకి జమ చేశారని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారన్నారు. టీటీడీ పోటు ఏఈవో నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

* వైవాహిక జీవితంలో అన్యాయానికి గురైన తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ మన్నేపల్లి నాగదుర్గారావు రిక్షాపై మరోమారు ఢిల్లీకి పయనమయ్యాడు. అయితే పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశా రు. మండలంలోని ముప్పాళ్లకు చెందిన నవ్యత అనే యువతికి నందిగామ మండలం చందాపురాకి చెందిన కొంగర నరేంద్రతో వివాహమైంది. కొన్నాళ్లకు గొడవలు వచ్చాయి. విడాకులకు సిద్ధపడ్డారు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.21 లక్షలు తిరిగివ్వాలని నవ్య తరపు పెద్దమనుషులు కోరడంతో రూ.15 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం సొమ్ము ఇవ్వకపోగా కుమారుడి మగతనంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నవ్యత కుటుంబ సభ్యులపై పరువునష్టం దావా వేశారు. దీంతో నవ్యత సోదరుడు నాగదుర్గారావు తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఫలితం లేక గత మే నెలలో తల్లిదండ్రులతో కలిసి మండుటెండలో కృష్ణానది ఇసుక తిన్నెలపై దీక్ష చేపట్టాడు. పోలీసులు, బలవంతంగా దీక్ష విరమింపజేశారు. తరువాత పట్టించుకోకపోవడంతో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసేందుకు ఎడ్ల బండిపై నాగదుర్గారావు ఢిల్లీ యాత్ర చేపట్టాడు. మే 28న వరంగల్‌ జిల్లా చందర్లపాడు పోలీసులు అడ్డుకొని కలెక్టర్‌ న్యాయం చేస్తారని చెప్పారు. తర్వాత కూడా పట్టించుకోకపోవటంతో ఎక్కడైతే యాత్రను ఆపాడో అక్కడ నుంచే యాత్ర ప్రారంభించాడు. ఈ సారి ఎద్దుల బండిపై కాకుండా రిక్షాపై యాత్ర ప్రారంభించాడు.

**తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ని బికనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తాను బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి, సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయి ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బికనూర్ జాతీయ రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

*అగ్నిపథ్ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు.ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.కాచిగూడ, విజయవాడ, వరంగల్, తిరుపతి, కడప, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో భద్రత పెంచారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వేస్టేషన్లలోనూ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద రెండు ప్రవేశద్వారాలను మూసివేశారు.

* ప్రధాని మోదీ ఏపీకి విచ్చేస్తున్నారు. వచ్చే నెల 4న విశాఖ, భీమవరంలలో ఆయన పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు భీమవరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బీజేపీ భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని, ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని పాండ్రంగా గ్రామం. చింతపల్లి అడవుల్లో ఆయన పోరాటం చేశారు. బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించింది కూడా విశాఖ ఏజెన్సీలోనే. కొయ్యూరు గ్రామంలో ఆయన చనిపోయారు. అల్లూరి జీవితం మొత్తం విశాఖ, విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంది. అందువల్ల అల్లూరి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నప్పటికీ… విశాఖకు వస్తున్న మోదీ భీమవరం కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు

* ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నెలరోజుల పెరోల్‌ లభించింది. దీంతో ఆయన శుక్రవారంనాడు హర్యానాలోని రోహ్‌తక్ జైలు నుంచి విడుదలయ్యారు. డేరాబాబాకు సంబంధిత అధికారుల సిఫారసుతో రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ 30 రోజుల రిమాండ్‌ మంజూరు చేసినట్టు హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ చౌతాలా తెలిపారు. ఉత్తరప్రదేశ్ భాగ్‌పట్‌లోని బర్నావాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి డేరాబాబా వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.డేరా ప్రధాన కార్యాలయమైన సిర్సాలో ఇద్దరు మహిళా భక్తులపై హత్యాచారానికి పాల్పడిన కేసులో ఆయనకు గతంలో 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. 2017 ఆగస్టులో పంచకులలోని సిబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్దారించింది. కాగా, గత ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలకు కాస్త ముందుగానే 21 రోజుల పెరోల్‌పై డేరాబాబా విడుదలయ్యారు. అయితే, పంజాబ్ ఎన్నికలకు, ఆయన విడుదలకు సంబంధమేమీ లేదని అప్పట్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తార్ వివరణ ఇచ్చారు. డేరాబాబా పెరోల్‌ సమయంలో గురుగామ్‌లో తన కుటుంబ సభ్యులతో గడిపారు.