భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై జూన్ 24 నాడు అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్వెట్ హాల్ లో ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా బుధవారం న్యూ జెర్సీ నార్త్ బ్రున్స్విక్ లోని బిర్యానీ జంక్షన్ రెస్టారంట్ లో తెలుగు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ప్రముఖ ఎన్నారై బ్రహ్మాజీ వలివేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో జస్టిస్ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం ప్రతి తెలుగు వారు తమ బాధ్యతగా భావించి కారక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు.