మొబైల్లో హఠాత్తుగా ఓ పాప్అప్ ఈ మెయిల్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సహజంగా దానిపై క్లిక్ చేస్తాం. అందులోని లింక్ ద్వారా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్తాం. తెలియక వారు అడిగిన వివరాలను చాలా మంది నింపేస్తుంటారు. ఫలితంగా మన బ్యాంకు ఖాతాకో, వ్యక్తిగత సమాచారానికో గండి పడటం ఖాయం. ఇలాంటి కేసులు నిత్యం ఎన్నో చూస్తుంటాం. దీనిపై అమెరికాకు చెందిన ‘వాలిమెయిల్’ అనే సంస్థ పరిశోధన చేపట్టింది. దాదాపు 20 లక్షల మంది ఖాతాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ సీఈవో అలెగ్జాండర్ గ్రేసియా తోబార్ వెల్లడించారు. ప్రపంచ వ్యాపంగా రోజుకు సగటున 300కోట్ల నకిలీ ఈ మెయిల్లు బట్వాడా అవుతున్నాయని వాలిమెయిల్ పరిశోధనల్లో తేలింది. వీటిలో చాలా వరకు అనుమానాస్పద మెయిల్స్ ఉండటం, ఫిషింగ్, స్ఫూఫింగ్ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని దొంగలించేవే కావడం గమనార్హం. పలు సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆయా సంస్థల పేర్లతో హ్యాకర్లు మెయిల్స్ పంపిస్తున్నారని వాలిమెయిల్ వెల్లడించింది.
రోజుకు 300కోట్ల స్పామ్ ఈమెయిల్స్
Related tags :