Movies

ఎప్పటికి గుర్తుండిపోతుంది

Auto Draft

నటిగా ఉత్తమ ప్రతిభను కనబరచాలంటే వ్యక్తిత్వంలో కూడా ఉన్నతమైన పరివర్తన, పరిణితి అవసరమని చెప్పింది సీనియర్‌ కథానాయిక తమన్నా. ప్రస్తుతం తాను ఆ దశలో ఉన్నానని, మనసుకు నచ్చిన పాత్రలు తనను వెతుక్కుంటూ రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్‌’ చిత్రంలో నటిస్తున్నది. లేడీ బౌన్సర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తన వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుటివరకు భారతీయ సినిమాలో ఈ తరహా కథాంశం రాలేదు. మహిళలు తమదైన సున్నితత్వాన్ని కాపాడుకుంటూనే శారీరకంగా బలవంతులుగా కనిపించవొచ్చనే సందేశం కలబోసిన చిత్రమిది. నా పాత్రలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి సరసన ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటిస్తున్నది.