తానా తదుపరి అధ్యక్షుడు, న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, భద్రాచలం ప్రవాసుడు తాళ్లూరి జయశేఖర్ లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జయశేఖర్ సోదరుడు, ప్రముఖ వైద్యులు డా.తాళ్లూరి రాజశేఖర్ నివాసంలో ప్రతి ఏటా లూసియానా బాలికా నాయకత్వ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో జయశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు లూసియానా పరిపాలనా విభాగ కమీషనర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ జే డార్డీన్, లూసియానా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.రెబెక్క జీ తదితరులతో జయశేఖర్ సమావేశమయ్యారు.
లూసియానా గవర్నర్‌ను కలిసిన తాళ్లూరి జయశేఖర్
Related tags :