DailyDose

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో మరో పది మంది అరెస్ట్ – TNI నేర వార్తలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో మరో పది మంది అరెస్ట్   – TNI  నేర వార్తలు

* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కేసుకు సంబంధించి పోలీసులు మరో పది మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ వందల మంది సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుని నిరసన తెలిసిన విషయం తెలిసిందే. అనుమానితులను విచారించాక వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించే సమయంలో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

* ఏలూరులో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ల పై కేసు నమోదైంది. నగరంలోని చాటపర్రు రోడ్‌లో భూ కబ్జాపై దారం రాజేంద్రనాథ్ అనే వ్యక్తి గ్రీవెన్స్‌ లో ఫిర్యాదు చేశారు. రాజేంద్రనాథ్‌పై అనుచరులతో కలిసి వైసీపీ కార్పొరేటర్లు సుంకర చంద్ర శేఖర్, జయకర్ దాడి చేశారు. బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* ముత్తుకూరు మండలంలో పలుచోట్ల జరిగిన విద్యుత్‌ మోటార్ల చోరీ కేసుల్లో ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి మంగళవారం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు మండలంలో నేలటూరు, మామిడిపూడి, బలిజపాలెం ప్రాంతాల్లో వరుసగా విద్యుత్‌ మోటార్ల చోరీలు జరిగాయి. కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ఎస్‌ఐలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. ముత్తుకూరుకు కొత్త దళితవాడకు చెందిన అరవ వినోద్‌, కనుపర్తిపాడుకు చెందిన గిద్దలూరు గోవర్దన్‌, ముత్తుకూరు ధర్మల్‌ పునరావాస కాలనీకి చెందిన గండవరపు మహేష్‌, నెల్లూరు వంశీ, తాండ్ర శ్రీనివాసులును నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు విద్యుత్‌ మోటార్లు, 4 ఏరియేటర్లు, 2 మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు సుబ్బారెడ్డిపాలెంలోని ఒక ఇంట్లో చోరీ చేసిన మూడు సవర్ల బంగారును స్వాధీనం చేసుకు న్నారు. నిందితులను అరెస్టు చేయడలో ప్రతిభ చూపిన సిబ్బందిని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాఽథరెడ్డి రివార్డులు అందించి అభినందించారు.

*కర్ణాటక నుంచి హైదరాబాద్‌ మీదుగా మంచిర్యాలకు తరలిస్తున్న 3 వేల కిలోల నకిలీ పత్తి విత్తనాలను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కథనం ప్రకారం.. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ జిల్లా నుంచి మంచిర్యాలకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఉప్పందుకున్నారు. కర్ణాటకు చెందిన గంగారెడ్డి, ఏపీకి చెందిన రమేశ్‌రెడ్డి ఈ దందా నిర్వహిస్తున్నారు. వారితోపాటు.. మంచిర్యాలకు చెందిన వెంకటేశ్వరరావు 54 బస్తాల్లో 3 వేల కిలోల నకిలీ పత్తివిత్తనాలను డీసీఎంలో తరలిస్తుండా.. నందిగామ పీఎస్‌ పరిధిలోని మేకగూడ వద్ద పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సీజ్‌ చేసిన నకి లీ విత్తనాల విలువ రూ.80లక్షలుగా ఉంటుందని రవీంద్ర వివరించారు.

*ఆలయం నుంచి వచ్చే భక్తిపాటలు గ్రామమంతా వినిపించాలనే ఆలోచనతో మైకు ఎత్తు పెంచాలని చేసిన ప్రయత్నం ముగ్గురు రైతుల ప్రాణం తీసింది. ఆ మైకు విద్యుత్‌ తీగలకు తగలడంతో కరెంట్‌ షాక్‌ కొట్టి వారు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అందనాలపాడులోని అభయాంజనేయస్వామి ఆలయంలోని మైకు ద్వారా ప్రతీ రోజు భక్తిపాటలు వినిపించేవారు. ఓ ఇనుప గొట్టానికి కట్టి ఉండే ఆ మైకు కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దీంతో గ్రామానికి చెందిన దుంపల సుబ్బారావు (55), మిరియాల మస్తాన్‌రావు(51), గొర్రె వెంకయ్య (50) మంగళవారం ఉదయం దానికి మరమ్మతు చేశారు. దానిని తిరిగి బిగించే క్రమంలో పాటలు ఎక్కువ దూరం వినిపించాలని మైకు ఎత్తు పెంచాలని భావించారు.

* అది పొలం.. దుక్కి దున్ని పంట కోసం సిద్ధం చేశారు. బాగా వర్షం పడటంతో ఆ పొలంలో ఓ చోట మనిషి కాళ్లూ, చేతులు పైకి తేలి కనిపించాయి! తవ్వి తీస్తే.. అది ఓ మహిళ మృతదేహం! పూర్తి నగ్నంగా ఉంది! పక్కనే దుస్తులు, మద్యం సీసాలు కనిపించాయి. గుర్తు తెలియని దుండగులు, ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామ శివారులో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

* నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు రైతులు ప్రాణాలొదిరారు. కుబీర్ మండలానికి అనుకోని ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని పాలజ్ గ్రామ శివారులో రైతులు పొలం పనులు చేస్తున్నారు. చినుకులతో మొదలైన వాన ఒక్కసారిగా జోరందుకుంది. ముగ్గురు రైతులు సమీపంలో ఉన్న చెట్టు కిందకి వెళ్లారు. కాసేపటికి వారు నిలుచున్న చెట్టు మీద పిడుగు పడడంతో గ్రామానికి చెందిన సాయినాథ్, రాజు, బోజన్న అనే ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*మెదక్‌: జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి దుండగులు పాతి పెట్టారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించారు. ఆత్యాచారం చేసి చంపినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతదేహంపై బట్టలు లేకుండా ఉండడంతో ఆత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షానికి మట్టికొట్టుకుపోవడంతో బయటకు శవం తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో దొంగతనం చోరీకి పాల్పడి 17 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేలు ఎత్తుకెళ్లారు. జరిగిన ఈ చోరీపై ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దుండగులు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విశ్రాంత ఉద్యోగి సుందర్ రాజన్‌గా గుర్తించారు.

*హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్టలో 14 ఏళ్ల బాలికపై దుండగులు గ్యాంగ్‌ రేప్‌‌కు పాల్పడ్డారు. ఈనెల 18న బాలికను కిడ్నాప్‌ చేసి ఇద్దరు యువకులు రేప్‌ చేశారు. తల్లితో గొడవపడి బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డుపై ఉన్న బాలికను కిడ్నాప్‌ చేసి దుండగులు రేప్‌ చేశారు. మర్నాడు ఇంటికి చేరుకున్న బాలిక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. చాంద్రాయణగుట్ట పీఎస్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.