NRI-NRT

కేసీఆర్‌ వైపే ఉత్తర భారత ఎన్నారైలు

కేసీఆర్‌ వైపే ఉత్తర భారత ఎన్నారైలు

ఉత్తర భారత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్రపోషించాలని ఆశిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ కో-ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పేర్కొన్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై 51వ శాఖను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ఉత్తర భారతదేశ ఎన్నారైలు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాకు మద్దతు కూడగట్టేందుకు మహేశ్‌ బిగాల యూరప్‌ దేశాల్లో ఉన్న ఎన్నారైలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి హంగేరీలో ఉన్న ఎన్నారైలతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, జమ్ము-కశ్మీర్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు గిరి అభిలాష్‌, కల్యాణ్‌వర్మ, భవానీప్రసాద్‌,్ర సాగర్‌, పొట్లూరి అర్వింద్‌కుమార్‌, సాహుల్‌, ఎలాజ, జోసెఫ్‌ తదితరులు పాల్గొన్నారు.