త్వరలోనే చిప్ ఆధారిత పాస్‌పోర్టులు ముందుకు రానున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. ఈ ఏడాది చివరికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో కలిసి దీని కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు బ్యాక్ ఎండ్ పనుల కోసం డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే టీసీఎస్‌తో పదేళ్ళకు గాను రూ.ఆరు వేల కోట్లకు పీఎస్కే డీల్‌ను కూడా ప్రభుత్వం రెన్యువల్ చేసుకుంది. పాస్‌పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఇది రెండో దశ. ఇప్పటివరకు మన దేశంలో ఇదే అతి పెద్ద కార్యక్రమంగా పేర్కొనవచ్చు.
చిప్ పాస్‌పోర్ట్ రూపం
ఇలాఈ పాస్‌పోర్ట్ చూడటానికి రెగ్యులర్ దానిలానే ఉంటుంది. లోపల చిన్న చిప్‌తో డ్రైవింగ్ లైసెన్స్ మాదిరిగా ఉంటుంది. పేరుతోపాటు పుట్టిన రోజు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. ట్రావెలర్ వివరాలను ఇమిగ్రేషన్ అధికారుల త్వరితగతిన చెక్ చేసుకునేందుకు మైక్రోచిప్ సహాయపడుతుంది. ఎంబెడెడ్ – రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడి) చిప్ ఇది. బ్యాక్ కవర్ ఎంటెన్నా ఎంబెడెడ్. పాస్‌పోర్టులోని క్రిటికల్ సమాచారం ప్రింట్ అయి ఉంటుంది. అలాగే చిప్లోనూ స్టోర్ అయి ఉంటుంది.
ఇదీ లాభం
ఫేక్ పాస్‌పోర్ట్‌లను అడ్డుకునేందుకు ఈ పాస్‌పోర్టులు ఉపయోగపడతాయి. భద్రతను పెంచడానికి తోడు డూప్లికేషన్, డేటా టాంపరింగ్ తదితరాలకు వీలు లేకుండా కట్టుదిట్టం చేయవచ్చు. కమాండింగ్ సెంటర్ టీసీఎస్ ఆవరణలో ఉంది. దానికి బదులుగా సింగిల్ జాయింట్ కమాండ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీస్‌ను రీఫ్రెష్ చేసే ప్రయత్నాల్లో టీసీఎస్ ఉంది. బయోమెట్రిక్స్, చాట్‌బోట్స్, ఆటో రెస్పాన్స్ వంటి పరిష్కారాలను కూడా చూపుతోంది. ఇదంతా ఈ ఏడాది చివరిలోగా పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుత పాస్‌పోర్టులు ఏమవుతాయంటేకొత్తగా చిప్ ఆధారిత పాస్‌పోర్ట్‌లు ఇష్యూ చేయడం మొదలుపెట్టినప్పటికీ అంతకు ముందు జారీ చేసిన పాస్‌పోర్టులు వాటి వాలిడిటీ ఉన్నంత వరకు అవి చెల్లుబాటు అవుతాయి. ఇవి రెన్యువల్‌కి వచ్చినప్పుడు వాటి స్థానంలో చిప్ పాస్‌పోర్టు జారీ చేస్తారు.
చిప్ క్రైసెస్
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమికండక్టర్ కొరతను తాము మేనేజ్ చేయగలమన్న దీమాను టీసీఎస్ బాధ్యులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు చాలాకాలంగా కొనసాగుతున్నందున అవాంతరాలను అధిగమించవచ్చని భావిస్తున్నారు.