DailyDose

గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్ళు మృతి – TNI నేర వార్తలు

గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్ళు మృతి – TNI  నేర వార్తలు

* కొవ్వూరు మండలం, మద్దూరు లంక సమీపంలో గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్ళు మృతి చెందారు. నిడదవోలు మండలం, పురుషోత్తమపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్ళు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం. కర్లపాలెం కు చెందిన జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పై యువకుడు కత్తి తో దాడికి యత్నించిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు కర్లపాలెం పంచాయితీ ఎం.వి రాజుపాలెం లో జరుగుతున్న కొలుపులు సందర్భంగా జడ్పిటిసి పిట్ల వేణుగోపాల్ రెడ్డి కొలుపులు లను చూస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన యువకుడు కత్తి తో వెనుక నుంచి దాడి చేయబోయాడు. వెంటనే ఒక మహిళ గమనించి చేతులు అడ్డం పెట్టగా ఆమె చేతికి బలమైన అయిన గాయం అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా పక్కనున్న మరో గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

*మనుబోలు మండలంలోని మనుబోలు-పొదలకూరు మార్గంలో పర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అక్కంపేట వద్దనున్న జీడిపప్పు పరిశ్రమలో సుమారు 70 మంది మహిళా కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా రోజూ రాత్రి 7గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి ఆటోల్లో గ్రామాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో శనివారం పరిశ్రలో పనులు ముగించుకుని జట్లకొండూరు, గోవిందరాజపురం, మడమనూరు గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ఒకే ఆటోలో ఎక్కారు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఆటో పర్లపాడు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై గేదె అడ్డురావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న లక్ష్మీతేజ, జి.కల్పన, రమ, నీరజ, శ్రీవల్లి, ఏ పావని, పల్లవి, మునెమ్మ, కుమారమ్మ, అశ్విత, పల్లవిలతో పాటు ఆటో డ్రైవర్‌ పోలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని 108లో నెల్లూరుకు, కొందరిని మడమనూరు, మనుబోలు, గూడూరులోని ప్రైవేట్‌ వైద్యశాలలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి డిగ్రీ విద్యార్థిని బలైంది. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు వంశీ. వంశీ వేధింపులు భరించలేక శ్వేత అనే డిగ్రీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్వేత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్వేతను పొట్టన పెట్టుకున్న వంశీని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

*నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిధిలాల తొలగింపు కొనసాగుతోంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వర్షకాలం నేపథ్యంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా బిల్లర్లు వాటిని పట్టించుకోవడం లేదు.

* భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి డిగ్రీ విద్యార్థిని బలైంది. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు వంశీ. వంశీ వేధింపులు భరించలేక శ్వేత అనే డిగ్రీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్వేత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్వేతను పొట్టన పెట్టుకున్న వంశీని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

*నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిధిలాల తొలగింపు కొనసాగుతోంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వర్షకాలం నేపథ్యంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా బిల్లర్లు వాటిని పట్టించుకోవడం లేదు.

*మేడ్చల్‌ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్‌పల్లిలోని ఓ కన్వెన్షన్‌ హాలు వద్ద బ్లాస్ట్‌ జరిగింది. కన్వెన్షన్‌ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. పేలుడు ధాటికి అక్కడికక్కడే మృతి మృతి చెందింది. అయితే, పేలుడుకు గల కారణాలు, మృతురాలి వివరాలు తెలియరాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

* ‘‘దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన సత్తాను చాటుకోవాలి’’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్‌ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శనివారం జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ఇటీవల పల్నాడు పర్యటనలో ‘భయం మా బయోడేటాలో లేదు’ అని లోకేశ్‌ చెప్పడం హాస్యస్పాదమని అన్నారు. ‘‘కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో జగన్‌ దెబ్బకు ఓటమితో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే ఇన్నాళ్లకు అక్కడ సొంతిల్లు కట్టుకుంటున్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం’’ అని అన్నారు.

*ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పాము కనిపించడంతో వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. శనివార ఉందయం 10 గంటలకు ఉస్మానియా పాత భవనంలోని జనరల్‌ సర్జరీ విభాగం వద్దకు ఓ పాము రావడంతో వైద్య విద్యార్థులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్నేక్‌ సొసైటీ ప్రతినిధులను పిలిపించారు. వారు పామును పట్టుకోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా వర్షాకాలం వచ్చిందంటే ఉస్మానియాలో పాముల బెడద తీవ్రంగా ఉంటుందని, ఆస్పత్రికి ఆనుకొని మూసీ ఉండడంతో అందులో నుంచి పాములు వస్తున్నట్టు పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

*గొర్రెల స్కీం పేరుతో రూ.8 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారన్న ఆరోపణపై మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల పశువైద్య ఉపకేంద్ర జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ సజ్జా శ్రీనివాసరావు ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ ఎస్‌.రామచందర్‌ శనివారం సస్పెన్షన్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ కేసులో శీనివాసరావును ఈ నెల 9న ఘటకేసర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో ఆయన భార్య లక్ష్మితో పాటు బావ అనిల్‌కుమార్‌, మరో వ్యక్తి అరవింద్‌ కుమార్‌నూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

*ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దొంగరి శంకర్‌ (38) తనకున్న మూడెకరాలతో పాటు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు రూ.8 లక్షల వరకు పేరుకుపోయాయి. వీటిని తీర్చే అవకాశం లేకపోవడంతో జీవితంపై విరక్తితో శంకర్‌ ఈనెల 22న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.

*పట్ట పగలు.. అటవీ ప్రాంతంలో వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత గత గురువారం పశువులను మేపేందుకు శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన బస్సి రాజేందర్‌, బస్సి రెడ్యాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వాగు సమీపంలో అపస్మారక స్థితిలో పడివున్న బాధితురాలిని కుటుంబీకులు గురువారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం నిందితుల ఇళ్లకు వెళ్లగా వారు లేకపోవడంతో కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

*హైదరాబాద్: నగరంలోని రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో భార్య భర్తల సూసైడ్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే సాయి గౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకొని శ్రీనగర్ కాలనిలో నివాసం ఉంటున్నారు. కాగా గత రాత్రి దంపతులిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త ఉరివేసుకోగా, భార్య విషం సేవించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*వరంగల్: జిల్లాలోని రాయపర్తి మండలం సూర్యతండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూతగాదాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*హైదరాబాద్: నగరంలోని బోలక్‌పూర్ వద్ద విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. భోలకపుర్ డివిజన్ దేవిచౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్(14) ద్విచక్రవాహనంపై పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కామారెడ్డి: జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్ చేసింది. బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. మతిస్థిమితం లేని మహిళను పోలీసులకు అప్పగించారు. మూడు గంటల పాటు స్టేషన్‌లో ఉంచి పంపించేసినా.. మళ్లీ తీరు మారకపోవడంతో మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. సదరు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు.