‘గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.’ అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం’ అని పేర్కొంది.