షిర్డి సాయిబాబ ఆలయానికి విచిత్ర సమస్య ఎదురైంది.
ఆ ఆలయ బోర్డు వద్ద ఉన్న చిల్లర నాణాలను బ్యాంకులు స్వీకరించడం లేదు. దీంతో సాయిబాబా ట్రస్టు సీఈవో దీపక్ ముంగలీకర్ ఆర్బీఐకి తన గోడును వినిపించారు.
తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అత్యధిక స్థాయిలో భక్తుల కానుకలు అందుకుంటున్న ఆలయాల్లో షిర్డి రెండవ స్థానంలో ఉంటుంది.
ప్రతి రోజు భక్తులు దేవుడి హుండిలో కానుకలు వేస్తుంటారు. నోట్లతో పాటు నాణాలను కూడా సమర్పించుకుంటారు.
ఆ చిల్లర నాణాలను బాబా ట్రస్టు ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం సాధారణం.
అయితే సుమారు 15 లక్షల విలువైన నాణాలు ఇటీవల హుండీ ఆదాయం ద్వారా వచ్చాయి.
కానీ ఈ మధ్య బ్యాంకులు ఆ నాణాలను స్వీకరించడం లేదు.
తమ వద్ద డిపాజిట్ చేసేందుకు సరిపోను స్థలం లేదని బ్యాంకులు ట్రస్టు అభ్యర్థనలను నిరాకరిస్తున్నాయి.
ప్రతి ఏడాది షిర్డి ఆలయానికి సుమారు 5 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వస్తుంది. వాటిని దాదాపు 8 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. కానీ ఇప్పుడు విచిత్ర సమస్య తలెత్తింది.