DailyDose

రెండు తాటాకు ఇళ్లు దగ్ధం.. తల్లీకూతుళ్లు సజీవ దహనం! – TNI నేర వార్తలు

రెండు తాటాకు ఇళ్లు దగ్ధం.. తల్లీకూతుళ్లు సజీవ దహనం!   – TNI  నేర వార్తలు

* కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో ఆకుల వారి వీధిలో ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఒక ఇంట్లో నివసిస్తున్న తల్లి సాధనాల మంగాదేవి(40) కుమార్తె జ్యోతి(23) మంటల్లో కాలిపోయారు. జ్యోతికి ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆమె ఐదో నెల గర్భిణి అని.. భర్త సురేష్ నిన్న రాత్రి ఆమెను పుట్టింటి వద్ద దింపి వెళ్లాడని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*విశాఖ నగరం పాతగాజువాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మానసిక రోగి అయిన 21 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈమేరకు బాధిత యువతి తల్లి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మల్లేశ్వర రావు తెలిపారు. కేసులో దర్యాప్తు జరుగుతుందని.. బాధితురాలిని కేజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

* కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో ఆకుల వారి వీధిలో ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఒక ఇంట్లో నివసిస్తున్న తల్లి సాధనాల మంగాదేవి(40) కుమార్తె జ్యోతి(23) మంటల్లో కాలిపోయారు. జ్యోతికి ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆమె ఐదో నెల గర్భిణి అని.. భర్త సురేష్ నిన్న రాత్రి ఆమెను పుట్టింటి వద్ద దింపి వెళ్లాడని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ఆఫ్ఘనిస్థాన్‌ లో ప్రతి రోజు కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆప్ఘనిస్థాన్ పార్లమెంటు మాజీ డిప్యూటీ స్పీకర్ ఫాజియా కూఫీ తెలిపారు. అవకాశాలు లేకపోవడం, మానసిక అనారోగ్యం వంటివి మహిళల ప్రాణాలు తీసేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవా లోని మానవ హక్కుల మండలి లో మహిళల హక్కుల సమస్యపై అత్యవసర చర్చ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

*ఎన్టీఆర్: జిల్లాలోని ఏ.కొండూరు మండలం పెద్దతండా సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన రాజు(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్. అంకారావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

*విశాఖ: జిల్లాలోని పాతగాజువాక బజాజ్ షోరూం మేడపై దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ళ యువతి మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి పోల రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలను కే.జి.హెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మలేశ్వరావు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు.

*వికారాబాద్‌ జిల్లాలోని కుల్కచర్లలో సినీఫక్కీలో చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన జోగు అంజయ్య కుటుంబంలో పొలం వద్ద నివాసముంటున్నది. శుక్రవారం రాత్రి మంకీ క్యాప్ పెట్టుకొని వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అంజయ్య ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఆయన భార్య అలవేలు ఒంటిపై ఉన్న పుస్తెల తాడును లాక్కున్నారు. బీరువాలో ఉన్న బంగారం సహా మొత్తం 4.5 తులాలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*బీటెక్‌ పూర్తి చేసి ‘గేట్‌’కు శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు గురువారం వరంగల్‌ జిల్లా చింతల్‌పల్లి వద్ద గూడ్స్‌రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జి.నరేష్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుని మండలం మల్లవరానికి చెందిన చలపాకల ఉపేంద్ర (25) బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో గేట్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ట్యూషన్‌లు చెబుతూ చదువుకున్న ఉపేంద్ర బీటెక్‌తోపాటు కొద్దికాలం ప్రయివేట్‌ ఉద్యోగం చేసి మానేశాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రావడం లేదని బాధపడుతుండేవాడు. గురువారం సాయంత్రం చింతల్‌పల్లి-ఎల్గూరు రైల్వేస్టేషన్‌ల మధ్య సంగెం రైల్వేగేటు వద్ద విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి.. అది ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

*గుంటూరు: జిల్లాలోని ఏటి అగ్రహారం 11వ లైనులో వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది. గత రాత్రి వీధి కుక్కలు ఇంట్లోకి వచ్చి మరీ పెంపుడు కుక్కపిల్లపై దాడి చేశాయి. దీంతో చనిపోయిన పెంపుడు కుక్క పిల్లతో యజమాని శివారెడ్డి, బంధువులు నిరసనకు దిగారు. వీధి కుక్కల విషయంలో కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కుక్క పిల్ల యజమాని మండిపడ్డారు. మనుషులపై దాడులు చేస్తున్న పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించే వరకూ ఆందోళన చేస్తామని శివారెడ్డి తెలిపారు.

*అమలాపురం: జిల్లాలోని అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు సాధనాల మంగాదేవి(40), మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు. మృతుల్లో కూతురు గర్భవతి అని తెలుస్తోంది. ఐదు నెలల క్రిమతమే జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. కాగా ప్రమాదంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లి కూతురు సజీవదహనమైన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూరి గుడిసె దగ్ధమైంది. తల్లి సాధనాల మంగాదేవి (40), కూతురు మెడిశెట్టి జ్యోతి (23) మృతి చెందింది. 5 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న జ్యోతి ప్రస్తుతం గర్భవతి.అగ్నిప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుడు వీరిద్దరిని హత్య చేసి ఇల్లు తగలపెట్టారని అనుమానిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లవరం పోలీసులు అనుమానితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్నారు.

*పాకిస్థాన్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌, పొలిటికల్‌ అనలిస్ట్‌పై దుండగులు దాడి చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ అయాజ్‌ అమీర్‌ శుక్రవారం రాత్రి లాహోర్‌లోని దునియా న్యూస్‌ చానల్‌లో ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అదిముగిసిన అనంతరం తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారును అడ్డగించిన గుర్తు తెలియని వ్యక్తులు.. దాడికి పాల్పడ్డారు. ఆర్మీ అధికారులను ప్రాపర్టీ డీలర్లుగా పేర్కొన్నందుకుగాను తనపై దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు.

*ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించించింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్‌ అబ్బాస్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. బందర్‌ అబ్బాస్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప ప్రభావంతో ముగ్గురు మరణించారని, 19 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

*విశాఖ: జిల్లాలోని పాతగాజువాక బజాజ్ షోరూం మేడపై దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ళ యువతి మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి పోల రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలను కే.జి.హెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మలేశ్వరావు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు.

*రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల హిందూ టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసినవారితో తమకు ఎటువంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించింది. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించింది. బీజేపీ మైనారిటీ విభాగం చీఫ్ సాదిక్ ఖాన్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అంతకుముందు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు.