Politics

ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే… – TNI రాజకీయ వార్తలు

ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే…  – TNI  రాజకీయ వార్తలు

* రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్‌ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు.తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్‌ కాంగ్రెస్‌ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు.యాదృచికంగా సిన్హా జూన్‌21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్‌ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది.దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం.

*విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేదు : మంత్రి కేటీఆర్
విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్న వార్త‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. మొన్న జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా.. విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను తాను కించ‌ప‌రిచిన‌ట్లు కొంత‌మంది చేస్తున్న ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలే కావాల‌ని రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కులాన్ని త‌క్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు అని తేల్చిచెప్పారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు

*ఈజీఎస్‌ను ప్రధాని లోతుగా అర్థం చేసుకోవాలి : రాహుల్‌
కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన సమయంలో చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నామని, బ్యూరోక్రాట్లు, వ్యాపారులు డబ్బు వృథా అవుతుందని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభలో ఈజీఎస్‌కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యాను. యూపీఏ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నంగా అభివర్ణించారు. ఇది ఖజానాపై భారం’ అని అన్నారన్నారు. ఈజీఎస్‌ పథకం ప్రధానికి అర్థం కాలేదని, దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు.

*మోదీపై యుద్ధం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌తోనే ఆగ‌దు : య‌శ్వంత్ సిన్హా
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్ర‌భుత్వంపై విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా మండిప‌డ్డారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, విషయం అదికాదు. ఈ యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో ముగియదు. తరవాత కూడా కొనసాగుతుందని య‌శ్వంత్ సిన్హా తేల్చిచెప్పారు. త‌న‌కు తెలంగాణ‌లో ఇంత ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తుంద‌ని ఊహించ‌లేదు.. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. జై తెలంగాణ అని య‌శ్వంత్ సిన్హా అన్నారు.

* జగన్ ఇచ్చిన పదవితో వారికి న్యాయం చేయలేకపోతున్నా..: బొంతు
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పదవితో ప్రజలకు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని పీఆర్,ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారు బొంతు రాజేశ్వరరావు అన్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.కోనసీమ జిల్లా రాజోలు వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామాలు చేయగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు పీఆర్,ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. జగన్ ఇచ్చిన పదవితో ప్రజలకు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన అన్నారు.కోనసీమ జిల్లా లక్కవరంలో ఆ పార్టీ అసమ్మతి నేతల సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. సుమారు 11 ఏళ్లపాటు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశామని అన్నారు. నేడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిపై ఎన్నిసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా.. స్పందించటం లేదన్నారు. రెండు మూడు పర్యాయాలు ఓడిన ప్రజాప్రతినిధులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన జగన్ నియోజకవర్గ వైకాపా పార్టీ బాధ్యతలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు అప్పగించి బొంతు విషయంలో అన్యాయం చేసిందన్నారు. కనీసం ఇంఛార్జ్గా కూడా కొనసాగించకుండా అవమానించారని విమర్శించారు. పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొంతు.. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.

*వైసిపి కార్యకర్తల కోసం కొత్త స్కీం.! – మంత్రి బుగ్గాన రాజేంద్రరెడ్డి.!
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకెలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అధినేత జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసుకుంటే తామే ముఖ్యమంత్రి అయినంతగా వైసిపి కార్యకర్తలు నాయకులు ఫీల్ అయ్యారని ఎలాగైతేనేం జగన్ ను సిఎం ను చేసుకున్నారు అయితే తమకేంటని ప్రశ్నించుకుంటే ఈ మూడేళ్లలో అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు కలిగిన ప్రయోజనం శూన్యమని.ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలో ఎన్నికలు వుండటంతో కార్యకర్తలపై వైసిపి అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టిందని వైసిపి కార్యకర్తలను సంతృప్తిపరచటానికి సిఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని బుగ్గాన తెలిపారు ఇందులో భాగంగా వారి కోసం ప్రత్యేకంగా స్కీంను తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు …!

*ఈజీఎస్‌ను ప్రధాని లోతుగా అర్థం చేసుకోవాలి : రాహుల్‌
కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన సమయంలో చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నామని, బ్యూరోక్రాట్లు, వ్యాపారులు డబ్బు వృథా అవుతుందని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభలో ఈజీఎస్‌కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యాను. యూపీఏ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నంగా అభివర్ణించారు. ఇది ఖజానాపై భారం’ అని అన్నారన్నారు. ఈజీఎస్‌ పథకం ప్రధానికి అర్థం కాలేదని, దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు

*గద్దె రామ్మోహన్‌కు నేను ఏకలవ్య శిష్యుడిని: Kesineni nani
కొన్ని విషయాల్లో గద్దె రామ్మోహన్‌ కు తాను ఏకలవ్య శిష్యుడిని అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. చాలా కాలం తర్వాత జిల్లా పార్టీ నేతలతో కలిసి ఎంపీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో గద్దె ముందు వరుసలో ఉంటారన్నారు. అగ్నికుల క్షత్రియుల భవనం విషయంలో గద్దె రామ్మోహన్ కృషి ఉందన్నారు. యాంటీ వేవ్‌లో కూడా గద్దె గెలిచారని.. తన ఎంపీ ల్యాడ్స్ అంతా గద్దె రామ్మోహన్‌కే ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ సెగ్మెంటులో నగరాల సామాజిక వర్గం వాళ్లు కమ్యూనిటీ హాల్ లేదని అన్నారని, అవసరమైన నిధులు ఇస్తానంటే.. తానే రూ. 4 కోట్లు ఇస్తానని వెలంపల్లి హామీ ఇచ్చారని అయితే… ఆ పని ఇప్పటి వరకు నెరవేర లేదని మండిపడ్డారు. ఇప్పుడైనా తాను నిధులిస్తానంటే.. మళ్లీ రూ. 4 కోట్లు ఇస్తానంటూ వెలంపల్లి హామీ ఇచ్చారని అన్నారు. జగనుకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారో కానీ.. నష్టపోయింది పేద ప్రజలే అని ఎంపీ చెప్పుకొచ్చారు.

*అగ్నికుల క్షత్రియులంతా Kesineni Naniని గుర్తుంచుకుంటారు: Kollu Ravindra
అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణానికి కేశినేని నాని పెద్ద హృదయంతో నిధులు కేటాయించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర వెల్లడించారు. భవన నిర్మాణానికి రూ.65 లక్షలు అంచనా అని చెబితే.. ఆ మొత్తాన్ని ఆమోదించేశారన్నారు. అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణం వల్ల కేవలం కృష్ణా, విజయవాడల్లో ఉన్న వారే కాకుండా.. ఏపీలోని అగ్నికుల క్షత్రియులంతా కేశినేని నానిని గుర్తుంచుకుంటారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మత్స్యకారులకు అండగా ఉంటోంది టీడీపీనేనని.. వైసీపీ ఇప్పుడేదో మాయ మాటలు చెబుతోందన్నారు. వలలు, పడవలు లేకుండా మత్స్యకార భరోసా పేరుతో వైసీపీ మభ్యపెడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బెజవాడ లోక్‌సభ నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

*పాలన చేతకాకే చార్జీల పెంపు : Batchula Arjunudu
గన్నవరం నియోజవర్గం పలు మండలాల్లో ఆర్టీసీ చార్జీల పై బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. జగన్ సర్కార్‌ పై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. పాలన చేతకాకనే రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. అడుగడునా బాదుడే-బాదుడు అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.

*మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొవాలి: తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బీజేపీ నాయకులనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానికి నేను స్వాగతం పలికాను. సీఎం స్వాగతం పలకాలని అని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొవాలి. భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు ప్రొటొకాల్ అవసరం లేదా? సీఎం అవసరం లేదా? అప్పటి నుంచి గ్యాప్ నడుస్తుంది. గతంలోనే 2వ తేది యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తా అన్నారు. రోజు హైదరాబాద్‌కు ఎంతోమంది పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు..వీళ్లు అంతే. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీలో మేము చూపించిన చిన్న శాంపిల్ మాత్రమే. ఎవ్వరు ఎవ్వరికి భయపడరు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటయిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారు. మహారాష్ట్ర పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది….బీజేపీ బలం ఇక్కడ ఎంత ? ముందస్థు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

*పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దు: Madhu
, సీపీఎం మధు , ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. సీఎం జగన్మా టలకు, చేతలకు పొంతనే ఉండటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలపై జగన్ ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దన్నారు. ప్రధాని మోదీకి దాసోహమై ఏపీలో జగన్ పాలన చేస్తున్నారని మధు పేర్కొన్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా కేంద్రం తప్పులను ప్రశ్నించలేక పోతోందన్నారు. జనంతో జనసేన అన్న పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన పోరాడాలన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీ నిర్ణయాలపై నిరసన తెలపాలన్నారు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కి పిలుపునిస్తామన్నారు. జనసేన, టీడీపీ కూడా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించాలని మధు పేర్కొన్నారు.

*ఔరంగజేబును మించిన జగన్‌: తులసిరెడ్డి
‘‘డీజల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయం. చార్జీలు, ధరలు, పన్నులు పెంచడంలో సీఎం జగన్‌, ఔరంగజేబును మించి పోయాడు. వైసీపీ ప్రభుత్వం తేలు కొండిలా వడ్డింపులు, వాయింపుల ప్రభుత్వంగా తయారయింది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, మోదుడే మోదుడు, బాదుడే బాదుడు పథకాలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మూడేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచింది. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

*తెలంగాణలో కుటుంబపాలన సాగుతోంది: Sanjeev kumar
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం లో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని తెలిపారు. మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ సర్కారు ట్యాక్స్ తగ్గించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో రాజరికం అమల్లో ఉందా అని కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ ప్రశ్నించారు.

*పాలన చేతకాకే చార్జీల పెంపు : Batchula Arjunudu
గన్నవరం నియోజవర్గం పలు మండలాల్లో ఆర్టీసీ చార్జీల పై బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. జగన్ సర్కార్‌ పై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. పాలన చేతకాకనే రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. అడుగడునా బాదుడే-బాదుడు అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.

*తప్పుడు కేసులు పెట్టే పోలీసులను వదిలి పెట్టం: Chandra Babu
సీఐడీ పోలీసుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేవన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయిన వెంకటేష్, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని పేర్కొన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తప్పుడు కేసులు బనాయించే అధికారులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

*‘జనవాణి’తో ప్రభుత్వంలో చలనం వస్తుంది: Nadendla Manohar
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో వైసీపీ నేతలు సమస్యలను పట్డించుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా తమ గోడు వినేవారు లేక ప్రజలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పవన్ కృషి చేస్తున్నారని చెప్పారు. జూలై 3, 10 తేదీలలో జనవాణి‘‘విజయవాడ ఎం.బి.కె భవన్‌లో జూలై 3, 10 తేదీలలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి మా టీం సభ్యులు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా జనవాణి జరుగుతుంది. జనవాణి కార్యక్రమ నిర్వహణకు విజయవాడలో మూడు హాల్స్ చూశాం. వాటిని మాకు ఇవ్వనివ్వకుండా వైసీపీ నాయకులు అడ్డు పడ్డారు. ఇస్తే ఊరుకోమని వారిని హెచ్చరించారు. చివరకు కామ్రేడ్స్ మాకు హాల్ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు.’’ – నాదెండ్ల మనోహార్ పవన్ స్పందించాకే.. ప్రభుత్వం‘‘ముఖ్యమంత్రి జగన్ సొంత అమ్మమ్మ ఊర్లో కౌలు రైతులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ రూ. లక్ష సాయం చేశాక.. ప్రభుత్వం కూడా రూ. లక్ష ఇచ్చింది. 74మంది రైతుల కుటుంబాలకు పవన్ సాయం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అవార్డు ఎవరికి ఎలా వచ్చింది? ఈ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా.. ఉన్న ఉపాధి కూడా పోయింది. కియా మోటార్స్‌కి APIIC 63 ఎకరాల స్థలం ఎలా ఇచ్చారు. ఏ రూల్ ప్రకారం ఇచ్చారో చెప్పాలి. నిజంగా కియా పరిశ్రమ అక్కడ పెడుతున్నారా? మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తున్నా.. సమాధానం చెప్పాలి.’’ అని నాదెండ్ల మనోహార్ అన్నారు.

*ఆ ప్రకటన నకిలీది.. త్వరలోనే ఫిర్యాదు: అశోక్‌బాబు
‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ప్రకటన నకిలీది. సంబంధిత వ్యవస్థలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నేతలు ఆడుతున్న పన్నాగంలో భాగమే ఈ నకిలీ ప్రకటన’’ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు స్పష్టం చేశారు. ‘టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తాం’ అంటూ అచ్చెన్న ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు. నకిలీ ప్రకటనను వైరల్‌ చేస్తున్న వారిపై త్వరలో పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తాం’’ అని అశోక్‌ తెలిపారు.

*పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?: దేవినేని ఉమా
ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం డ్యామ్‌ స్పిల్‌వే, అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌, ల్యాండ్‌ ఎక్విజిషన్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ విసిరారు. సీఎం జగన్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి పోలవరం ప్రాజెక్టుకు ఈ దుర్గతి పట్టించారని మండిపడ్డారు.

*ల్యాప్‌టాప్‌పై మోసం చేసిన జగన్‌ : బుద్దా
‘‘విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు ఇస్తామని జగన్‌ ప్రభుత్వం మోసం చేసింది. వారికి ల్యాప్‌టా్‌పలు ఇచ్చే వరకు టీడీపీ ఆందోళన కొనగసాగుతుంది’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ల్యాప్‌టా్‌పలు ఇస్తామని చెప్పి టాబ్‌లు ఇచ్చేందుకు చూస్తున్న జగన్‌ ప్రభుత్వం మోసంపై శుక్రవారం చిట్టినగర్‌ జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు.

*పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?: దేవినేని ఉమా
ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం డ్యామ్‌ స్పిల్‌వే, అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌, ల్యాండ్‌ ఎక్విజిషన్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ విసిరారు. సీఎం జగన్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి పోలవరం ప్రాజెక్టుకు ఈ దుర్గతి పట్టించారని మండిపడ్డారు.

*2024లో బాబుకే అధికారం: రాజ్‌కుమార్‌
ఏపీలో 2024 ఎన్నికల్లో చంద్రబాబే అధికారంలోకి వస్తారని సినీ, టీవీ నటుడు రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిసినట్లు తెలిపారు.

*రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా?: తమ్మినేని
న్యాయమైన పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసిత రైతులను బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రైతుల కోసమే పుట్టామని, జీవితాంతం రైతుల కోసమే పనిచేస్తామని చెప్పి.. ఇలా అవమానించడం సరికాదన్నారు. రైతులకు బేడీలు వేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులపై కేసులు ఉపసంహరించి, న్యాయపరంగా వారికి రావాల్సిన పునరావాస పరిహారం అందజేయాలని కోరుతున్నామన్నారు. కేరళ రాష్ట్ర కమిటీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

*6.6 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: గంగుల
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.6 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఈ యాసంగిలో 50.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రూ.9,680 కోట్లు చెల్లించామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సేకరించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మినహా వేరే ఏదీ లేదన్నారు.

*విభజన చట్టం హామీలు అమలు చేయాలి: భట్టి
ఏపీ పునర్విభజన చట్టం-2014లోని హామీల అమలుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. 8 ఏళ్లు కావస్తున్నా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు, ఆందోళనలతో ప్రజలకిచ్చిన హామీని సోనియాగాంధీ నెరవేర్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పు పడుతూ ప్రజల మనోభావాలను ప్రధాని గాయపరిచారని అన్నారు.

*రాష్ట్రపతి పాలన విధించాకే ఎన్నికలు నిర్వహించాలి:Uttam
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రపతి పాలన విధించాకే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ ఆగడాలను పోలీసులకు వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఐకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ లో కోరతానని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే తిప్పలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

*యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి Gangula kamalakar
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో చేపట్టిన యాసంగి ధాన్యం సేకరణ ముగింసిందని, రైతులకు సకాలంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.ఈ ఏడాది రబీలో 9916 కోట్ల విలువగల 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 9 లక్షల 52వేల మంది రైతుల దగ్గరనుండి సేకరించామన్నారు. ఈ నిదుల్ని మొత్తం సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకొందని తెలిపారు. మొత్తం 9724 కోట్లకు గానూ 9680 కోట్లను సకాలంలో రైతులకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఓపీఎంఎస్ లో నమోదైన ప్రకారం వెంట వెంటనే చెల్లింపులు కొనసాగుతాయన్నారు.అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6,42,894 మెట్రిక్ టన్నుల్ని, అత్యల్పంగా అధిలాబాద్ లో 322 మెట్రిక్ టన్నుల్ని సేకరించామన్నారు.2014-15 సీజన్ నుండి ఇప్పటివరకూ దాదాపు ఒక కోటీ ఎనిమిది వేల కోట్లను ప్రభుత్వం రైతులకు అందజేసిందని, ఎంఎస్పీ ప్రకారం పంట సేకరణ చేయడమే కాకుండా కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలుగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేశామన్నారు.

*బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్‌ఎస్ ఆటంకాలు: Kishan reddy
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ (Modi) సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామన్నారు. ఎనిమిదేళ్ళుగా మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కార్యవర్గ సమావేశాలు ప్రజల‌ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మోదీ రాక కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకేసారి రావటం అరుదైన సంఘటన అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

*సీపీఎస్‌ రద్దుపై త్వరలో నిర్ణయం: మేరుగు నాగార్జున
సీపీఎస్‌ రద్దుపై కేబినెట్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా చర్చించారని, దీనిపై త్వరలోనే సానుకూల ప్రకటన వెలువడతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గాన్ని విద్యా, అభివృద్ధి, సంక్షేమంలో ముందుంచేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తాను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

*ఔరంగజేబును మించిన జగన్‌: తులసిరెడ్డి
‘‘డీజల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయం. చార్జీలు, ధరలు, పన్నులు పెంచడంలో సీఎం జగన్‌, ఔరంగజేబును మించి పోయాడు. వైసీపీ ప్రభుత్వం తేలు కొండిలా వడ్డింపులు, వాయింపుల ప్రభుత్వంగా తయారయింది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, మోదుడే మోదుడు, బాదుడే బాదుడు పథకాలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మూడేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచింది. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.
*