సమంత లాంటి స్టార్ ఐటెమ్ గీతంలో కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే.. ఆమె తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఐటెమ్ పాటల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. అయితే అనూహ్యంగా ‘పుష్ప’లో ‘ఊ అంటావా మామా..’ అంటూ మాస్‌ని ఉర్రూతలూగించారు. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ‘పుష్ప’ విజయంలో ఆ పాట కూడా కీలక పాత్ర పోషించింది. ఆ పాటకు గానూ సమంతకు రూ.1.5 కోట్ల పారితోషికం అందిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఓ ఐటెమ్ గీతం కోసం అత్యధిక పారితోషికం తీసుకొన్న దక్షిణాది కథానాయికగా సమంత రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. అయితే ఆ తరవాత… సమంత మరే ఐటెమ్ గీతంలోనూ కనిపించలేదు. దానికి తోడు తెలుగులో ఆమె మరింత బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లోనూ ఓ సినిమా ఒప్పుకొన్నారు. దాంతో.. సమంత మళ్లీ ఐటెమ్ గీతంలో కనిపించడం కష్టమనే వార్తలొచ్చాయి.