‘ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులున్నాయి. నటిగా పరిణితి సాధించా. ఎన్నో కొత్త విషయాన్ని నేర్చుకున్నా’ అని చెప్పింది ఢిల్లీ సోయగం రాశీఖన్నా. ఇటీవల విడుదలైన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఈ భామ లాయర్ ఝాన్సీగా అల్లరి, అమాయకత్వం కలబోసిన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాయర్ ఝాన్సీ పాత్రను మారుతి వైవిధ్యంగా డిజైన్ చేశారు. నా హావభావాలతో పాటు సంభాషణలు పలికిన విధానం చాలా కొత్తగా ఉందని ప్రశంసలొస్తున్నాయి. ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశా. ప్రతి నటి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. నా కెరీర్‌లో అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్ని అంగీకరించా. త్వరలో వాటి వివరాల్ని ప్రకటిస్తా. కార్తితో చేస్తున్న ‘సర్దార్’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవలే ఓ వెబ్ సిరిస్ పూర్తి చేశాను. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతున్నది’ అని చెప్పింది.