ఈనెల 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. 5న కల్యాణం, 6న రథోత్సవం జరగనుంది. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా అమ్మవారి కల్యాణాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక కవర్లు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జోనల్ కమిషనర్ రవికిరణ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, జిల్లా వైద్యాధికారి వెంకటి, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, జీఎం హరిశంకర్, ఐఅండ్‌పీఆర్ సీఐఈవో రాధాకృష్ణ, సీఐ సైదులు, ఈవో అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
**అమ్మవారిని దర్శించుకున్న శశిధర్‌రెడ్డి
బల్కంపేట ఎల్లమ్మను సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మంగళవారం జరగనున్న ఎల్లమ్మ కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, వాటర్ వర్క్స్ జోనల్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. శశిధర్ వెంట బి-బ్లాక్ అధ్యక్షుడు నరేందర్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్ తదితరులు ఉన్నారు.