అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పరిపాలన విధానాన్ని మంత్రి వారికి వివరించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్షించారు.గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదని, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు. ఈ మధ్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం జరగ్గా ఎన్నారైల ఆధ్వర్యంలో మరోసారి కేక్‌ను కట్ చేసి, ఎన్నారైలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎన్నారైలు పాల్గొన్నారు.