అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి కాజోల్ . అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 30ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడింది. అనేక ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. చిత్ర పరిశ్రమలో తనకు మంచి స్క్రీప్ట్స్ లభించినందుకు సంతోషంగా ఉందని కాజోల్ చెప్పింది. ‘‘బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 30ఏళ్లు అయిందని నాకు గుర్తుకు రాలేదు. కెరీర్ నిన్ననే మొదలుపెట్టినట్టుంది. నా పిల్లలను చూస్తే కాలంతో పాటు వారు ఎదిగారు. వారిని చూస్తేనే కాలం గడుస్తున్నట్టు తెలుస్తుంది. అద్భుతమైన స్క్రిఫ్ట్స్, కొత్త పాత్రలు ఇచ్చినందుకు అబ్బాస్-మస్తాన్, కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, అజయ్ దేవగణ్ తదితరులకు రుణపడి ఉంటాను’’ అని కాజోల్ పేర్కొంది. కాజోల్ త్వరలోనే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అందువల్ల డిజిటల్ ఫ్లాట్‌ఫాంల గురించి కూడా మాట్లాడింది. థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పింది. ఓటీటీలో కొంచెం స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘‘బిగ్ స్క్రీన్‌పై అన్ని విషయాలు చెప్పలేము. ఓటీటీలో పలు రకాల కొత్త పాత్రలు పోషించవచ్చు. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లో మొదటగా అవకాశం నాకే వచ్చింది. ఆ స్క్రిఫ్ట్ కూడా నాకు నచ్చింది. కానీ, ఆ సమయంలో నేను ఆ స్క్రిఫ్ట్‌ను చేయలేకపోయాను. అనేక కారణాలతో అందులో నటించలేకపోయాను’’ అని కాజోల్ వెల్లడించింది. ‘ఆర్య’ వెబ్‌సిరీస్ ఓటీటీలో సంచలన విజయం సాధించింది. ఈ షోలో సుస్మితా సేన్ నటించింది. కాజోల్ చివరగా ‘త్రిభంగా’ లో కనిపించింది. ఈ చిత్రానికి రేణుకా సాహ్ని దర్శకత్వం వహించింది. కాజోల్ ప్రస్తుతం ‘సలామ్ వెంకీ’ చిత్రం చేస్తుంది. రేవతి దర్శకత్వం వహిస్తుంది.