* ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. రాకసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి. ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, తండ్రి, బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. కూతురి ఆచూకీ లభించలేదు.
*ఘోర ప్రమాదం.. 15 మంది అమర్‌నాథ్ యాత్రికులు మృతి
అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్ క్రాసింగ్ వద్ద టిప్పర్ డంపర్ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్ యాత్రకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్-పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు.
*కుమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు.మృతులను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రాము, సతీశ్‌గా గుర్తించారు. శ్రీరామ్‌పూర్ ఏరియా సింగరేణి రెస్క్యూ టీమ్‌లో పనిచేస్తున్న వీళ్లిద్దరూ.. వరద సహాయక చర్యల కోసం దహేగాం ప్రాంతానికి వచ్చి మృత్యువాత పడ్డారు.
*నలుగురు హెడ్ కానిస్టేబుళ్లపై ఎస్పీ పరమేశ్వర రెడ్డి సస్పెన్షన్ వేశారు. ఇసుక మాఫియా నుంచి ఈ నలుగురు కానిస్టేబుళ్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు ఎస్పీకి ఎంఆర్ పల్లె సీఐ సురేంద్రనాథ్ రెడ్డి రిపోర్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆర్. మణి, ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎస్ .వెంకటరమణ, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎం. దుర్గాప్రసాద్, ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ.ప్రభును సస్పెండ్ చేస్తూ ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
*పోలీసుల చిత్రహింసలను నారాయణ అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూలై 14వ తేదీ చలో నెల్లూరుకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
*భర్తను భార్య క్రికెట్ బ్యాట్‌తో చితకబాదింది. అరుపులు విన్న స్థానికులు ఆ భర్తను రక్షించారు. అయితే భార్యాభర్తలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలు అనీషా, అమీన్.. రిద్మల్సర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారిద్దరూ తరచుగా గొడవపడుతుంటారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటలకు భార్య అనీషా తన భర్త అమీన్‌ను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదింది. దీంతో అతడు కేకలు వేయడంతో పొరుగున ఉండేవారు ఆ ఇంటికి వెళ్లారు. అనీషా నుంచి క్రికెట్ బ్యాట్ లాక్కొని భర్తను కాపాడారు. రక్తం కారుతూ తీవ్రంగా గాయపడిన అమీన్‌ను ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడి తలకు 17 కుట్లు పడ్డాయి.
*నలుగురు హెడ్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్. ఇసుక మాఫియా నుండి లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్స్ పై ఎస్పీకి రిపోర్ట్ చేసిన సీఐ. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నలుగురిపై వేటు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆర్. మణి. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎస్ .వెంకటరమణ. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎం. దుర్గాప్రసాద్. ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ. ప్రభు లపై వేటు.
*కుమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు.మృతులను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రాము, సతీశ్‌గా గుర్తించారు. శ్రీరామ్‌పూర్ ఏరియా సింగరేణి రెస్క్యూ టీమ్‌లో పనిచేస్తున్న వీళ్లిద్దరూ.. వరద సహాయక చర్యల కోసం దహేగాం ప్రాంతానికి వచ్చి మృత్యువాత పడ్డారు.
*యాదాద్రి: జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద కరెంట్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన అనిల్ (21), ప్రశాంత్ (17)గా గుర్తించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా, విద్యుత్ సరఫరా నిలిపివేయక పోవడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.
* కర్నాటకలోని మైసూరుకు చెందిన కిక్ బాక్సర్ నిఖిల్ మృతిచెందాడు. జూలై 10వ తేదీన బెంగుళూరులో జరిగిన కిక్ బాక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొని గాయపడ్డాడు. అయితే ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రస్థాయి కే1 కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఈ నెల 10వ తేదీన నిర్వహించారు. కెంగేరికి చెందిన కే1 కిక్ బాక్సర్ సంస్థ ఈ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో పోటీపడ్డ నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థి పంచ్‌లకు నిఖిల్ సొమ్మసిల్లిపోయాడు. బాక్సింగ్ రింగ్‌లోనే కుప్పకూలాడు. అయితే అతన్ని తక్షణమే హాస్పిటల్‌కు తరలించారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్న ఆ బాక్సర్ జూలై 12న ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో నవీన్ రవిశంకర్‌తో పాటు కిక్ బాక్సింగ్ అసోసియేషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
*జమ్మూ డివిజన్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో అనుమానాస్పద సిలిండర్‌ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై బలగాలు, పోలీసులు విచారణ జరుపుతున్నాయి. సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం దోమన అసెంబ్లీ నియోజకవర్గం కానా చక్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరాగ్వల్ రోడ్ సమీపంలో ఈ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
*అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 14 మంది యాత్రికులు గాయపడ్డారు. మరో వైపు ఎడతెరపిలేని వర్షాల కారణంగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
*రెండు ట్రాలీ బ్యాగుల్లో పిస్తోళ్లు తీసుకొని వస్తు న్న ఇద్దరిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్ట మ్స్ అధికారులు అరెస్టు చేశారు. భారాభర్తలు అయిన జగజిత్ సింగ్, జస్విందర్ కౌర్ నుంచి 45 పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఖరీదు రూ.22.50 లక్షలు ఉంటుందని అంచనా. కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎ్‌సజీ)లోని కౌంటర్ టెర్రరిజమ్ విభాగం విచారణకు స్వీకరించింది. ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి బయల్దేరిన నిందితులు వియత్నాం మీదుగా జూలై 10న భారత్‌కు వచ్చారు. వీరు వియత్నాంలో దిగినప్పుడు జగజిత్ సింగ్ సోదరుడు మన్‌జిత్ సింగ్ ఆయనకు పిస్తోళ్లు ఉన్న బ్యాగులను అందజేశాడు.
* ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. రాకసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి. ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, తండ్రి, బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. కూతురి ఆచూకీ లభించలేదు.
* వాట్సాప్‌లో పరిచయమైన అమ్మాయి మాటలు నమ్మిన ఓ యువకుడు రూ.లక్షల్లో మోసపోయి పోలీసులకు ఆశ్రయించాడు. ఓల్డ్ మలక్ పేటకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ యువతి వాట్సాప్‌లో పరిచయమైంది. కొన్ని రోజులు మాట్లాడుకుని ఒకరికొకరు ఇష్టపడ్డారు. తాను యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదిస్తున్నానని నువ్వు కూడా పెట్టుబడులు పెట్టాలని కోరింది. ‘బీపీఎం 2021’ అనే యాప్‌లో ముందుగా రూ.50 వేలు పెట్టగా రూ.30 వేలు, రూ.2 లక్షలు పెట్టించి రూ.80 వేలు లాభాలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత రూ.7 లక్షలు పెట్టించి లాభాలు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
* ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంలోని ఆరుగురు మధ్యప్రదేశ్‌లోని నందగౌముల్క్ నుంచి మహారాష్ట్రలోని ముల్తాయ్‌కు స్కార్పియోలో వెళ్తున్నారు.
*కడప: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇందు కు సంబంధించి నిందితులపై బుధవారం అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.
*అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న చిన్నారుల పైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
* తెనాలి సమీపంలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్ పై యువతీ యువకుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. తలలు పగిలిపోయి గుర్తించలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నాయి. పినపాడు – మల్లెపాడు మధ్య ట్రాక్‌పై మృతదేహాలను స్థానికులు గుర్తించారు. చేబ్రోలు మండలం, బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
* కామారెడ్డి అంగడి మార్కెట్‌లో నకిలీ 500 రూపాయల నోట్లు కలకలం రేపాయి. ఓ వ్యక్తి ఓ షాపులో రూ.500 నోట్‌తో వస్తువులు కొనుగోలు చేశాడు. కొద్ది సేపటికి తిరిగి మరో నోటుతో వస్తువులను కొనుగోలు చేశాడు. అనుమానంతో ఆరా తీసిన వ్యాపారి, నోటు నకిలీగా గుర్తించి, స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించాడు. నకిలీ నోట్లు కలిగి ఉన్న వ్యక్తి గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన సంజీవులుగా గుర్తించారు. ప్రస్తుతం సంజీవులు పోలీసుల అదుపులో ఉన్నాడు.
*యువతులు, విద్యార్థినులు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను జాగ్రత్తగా నిర్వహించండి. మహిళలు, యువతుల పేర్లతో మీకు స్నేహపూర్వక అభ్యర్థనలు పంపితే స్పందించకండి. ఎందుకంటే మీ ఖాతాలోని ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్చి మీరు పంపించినట్టుగానే మీ పేరుతో పదుల సంఖ్యలో ఇన్‌స్టా ఖాతాలను తెరిచి స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపుతామంటూ బెదిరింపులు వచ్చే అవకాశాలున్నాయి. వాటిని పంపించకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేయవచ్చు. లైంగిక కోర్కెలు తీర్చాలంటూ హెచ్చరించే ప్రమాదాలున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువవుతున్నాయని వివరిస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగైదు నెలల నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వ్యక్తిగత ఐచ్ఛికాంశాలను ‘‘కేవలం నాకు మాత్రమే’’ అని ఎంచుకుంటే కొత్తవారు, కొత్త స్నేహితులు ఫోటోలు, వీడియోలు చూడలేరని సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.