DailyDose

కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. – TNI నేర వార్తలు

కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం..  – TNI  నేర వార్తలు

*తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్‌ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు.ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్‌ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

* సికింద్రాబాద్ జూబ్లీ బ‌స్ స్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప‌ద‌కొండో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఆర్టీసీ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డున్న ప్ర‌యాణికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది.

*విశాఖ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి నుంచి సీబీఐ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ అధికారి ఆర్‌.పదంసింగ్‌ నుంచి రూ.1.86 కోట్లు సీబీఐ స్వాధీనం చేసుకుంది. కేంద్ర వ్యవసాయశాఖ ప్లాంట్‌ ప్రొటెక్షన్ డైరెక్టరేట్‌లో పదం సింగ్ పనిచేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రూర్కీలో జరిపిన సోదాల్లో నగదు పట్టుబడింది. సరకు ఎగుమతుల అనుమతికి లంచం తీసుకున్నారని పదంసింగ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదంసింగ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.

* అమర్‌నాథ్‌ యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అనంతపురం జిల్లా వాసి కలవల సుబ్రహ్మణ్యం (58) గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు పెనకచెర్ల డ్యాం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతులు ఈ నెల 10న బంధువులతో కలసిఅమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. దర్శనానంతరం డోలీలో కిందకు బయలుదేరారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కారణంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయి. దీంతో సుబ్రహ్మణ్యం తీవ్ర అస్వస్థతకు గురై, కొండపై నుంచి కిందకి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయారు.

*శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధతో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్బన్‌ పోలీసులు, కార్మికుడి భార్య తెలిపిన వివరాల మేరకు, పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురం కాలనీకి చెందిన ముత్తన రవి (36) కూలికి మగ్గం నేసేవాడు. ఆ సొమ్ము కుటుంబ పోషణకు సరిపడక, రూ.8 లక్షల దాకా అప్పులు చేశాడు. వాటికి వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో రుణదాతల ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో శుక్రవారం సాయంత్రం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

*వరద బాధితులకు అందించే సాయంపై వార్తల సేకరణకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో గల్లంతైన విలేకరి జమీర్‌(36) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపెల్లి సమీపంలో వరదలో రైతులు చిక్కుకున్న సంఘటనను కవర్‌ చేసేందుకు టీవీ జర్నలిస్టు అయిన జమీర్‌ ఈ నెల 12న వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కారుతో సహా వరదలో గల్లంతయ్యారు. జమీర్‌ స్నేహితుడు ఇర్షాద్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. కారుతో సహా జమీర్‌ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రామాజీపేట సమీపంలో కారును గుర్తించి బయటికి తీశారు. అక్కడికి సమీపంలోనే అతడి మృతదేహం లభించింది. కాగా, జమీర్‌ మరణంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్‌లో విచారం వ్యక్తం చేశారు.

*దిల్లీలోని అలీపుర్లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ గోదామును అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసినా నిర్మాణ పనులు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో అడ్డువచ్చిన యువతి తల్లి, చెల్లికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కూచిపూడి పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అవసరం కోసం వచ్చిన ఆడపిల్ల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.. సమాజంలో చెడు చేసినవారికి బుద్ది చెప్పాల్సిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ బాగోతం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు.

*దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్ (దురంతో ఎక్స్‌ప్రెస్‌) వెళ్తున్న రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. రైలు మంచిర్యాల సమీపానికి చేరుకున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. గొడవ జరుగుతున్న క్రమంలోనే ఓ వ్యక్తి.. ఎదుటి వ్యక్తి దగ్గర తుపాకి తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది గమనించిన టికెట్‌ కలెక్టర్‌.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గొడవపడిన ఇద్దరిని.. కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులు.. ఆర్మీలో పని చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.

*బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భిణిని చేసిన కేసులో నిందితుడికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌ సోమవారం తీర్పు వెలువరించారు. పోక్సో కేసుల ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కసనూరు విద్యాపతి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన బాబునాయక్‌ అలియాస్‌ అశోక్‌నాయక్‌ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చింది. తర్వాత నిందితుడు కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పామిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సీ, ఎస్టీ విభాగపు డీఎస్పీ మహబూబ్‌బాషా కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున విద్యాపతి వాదనలు వినిపించారు. కోర్టు 9 మంది సాక్షులను విచారించింది. నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో 13 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

*దేశరాజధాని ఢిల్లీ లోని అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో 9మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రాజా హరీష్ చంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

*పల్నాడు: జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడులో కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం ప్రదర్శించాడు. మరుగు దొడ్డి నిర్మాణం విషయంలో తల్లి అశ్రబీ(70)పై కొడుకు ఈసూబు దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులపై ఈసూబు దౌర్జన్యం చూపాడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది. అయితే దొడ్డి ఏర్పాటు చేయటానికి వీలులేదంటూ తల్లిపై ఈసూబు దాడి చేశారు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ వృద్ధురాలు వేడుకుంటోంది.

*దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ (Godown) గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో 9మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రాజా హరీష్ చంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

*మొవ్వలో ప్రేమోన్మాది కత్తితో దాడి. నలుగురికి తీవ్ర గాయాలు.కృష్ణాజిల్లా మొవ్వ మండలం అంబేద్కర్ నగర్ లో దారుణ ఘటన.ప్రేమించడం లేదని, అతని ప్రేమను తిరస్కరించిందని విచక్షణా రహితంగా దాడిచేయడంతో నలుగురు మహిళలు గాయపడ్డారు.గాయపడిన వారు బల్లారపు నిఖిత (22), బల్లారపు అఖిల (21), బల్లారపు రాజరాజేశ్వరి, బల్లారపు నగరాజ్యం (40)మొవ్వ మండలం అంబేద్కర్ కాలానికి చెందిన నాగదేసి జోయల్ ఈ దాడికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు.మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

*డ్డుపై రూ.50 నోట్లను విసిరేసిన దుండగులు ఓ వ్యక్తి దృష్టిని మళ్లించి రూ.1.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసీపురలో జరిగింది. మైసూరు నజర్‌బాద్‌ నివాసి అబ్దుల్‌ ఖాదర్‌ టీ.నరసీపురలోని ఎన్‌కేఎఫ్‌ పబ్లిక్‌ పాఠశాలలో పనులు చేస్తున్నాడు. పనుల నిమిత్తం ఇచ్చిన చెక్‌ను కెనరా బ్యాంక్‌లో వేసి డబ్బులు డ్రా చేసుకుని బైక్‌పై పాఠశాలకు బయల్దేరాడు.ఆ సమయంలో వర్షం రావడంతో బ్రిడ్జి వద్ద బైక్‌ నిలిపి డిక్కీ తెరిచి అందులోని జర్కీన్‌ వేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతన్ని వెంబడిస్తూ వచ్చిన దుండగులు రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసి ఆ డబ్బు మీదేనేమో చూడండి అంటూ దృష్టి మరల్చారు. ఖాదర్‌ కిందకి వంగి నోట్లు తీసుకుంటుండగా దుండగులు డిక్కీలోని రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. క్షణాల్లో నగదు మాయం కావడంతో కంగుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

*గోపవరం మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాం తంలో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 26 ఎర్రచందనం దుంగ లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో బద్వేలు రూరల్‌ సీఐ హనుమంత్‌నాయక్‌ తన ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ ద్వారా సిబ్బంది స్మగ్లర్లపై నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో గాలి బోయిన జయన్న, మనీమల్‌కొండయ్య, ఆరవ సురేంద్ర, గోపురం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గువ్వల శివయ్య, ఖాజీపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటయ్యలు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 725 కేజీల బరువు గల 26 ఎర్రచందనం స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. అనంతరం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషి చేసిన సిబ్బందిని రివార్డులతో ఎస్పీ అభినందించారు.

*నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ(59)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచింది. న్యాయస్థానం ఆమెను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి పంపింది. ఆమెతో పాటు ఎన్‌ఎ్‌సఈ మరో మాజీ సీఈవో రవి నారాయణన్‌, ముంబై పోలీసు మాజీ కమిషనర్‌ సంజయ్‌ పాండేలపై మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు చెందిన ఉద్యోగుల ఫోన్లు ట్యాప్‌ చేసిన వ్యవహారంలో ఈ కేసు పెట్టినట్లు అధికారులు తెలిపారు. సదరు ఉద్యోగులపై అక్రమంగా నిఘా పెట్టే బాధ్యతను పాండేకు చెందిన ఐసెక్‌ సర్వీసెస్‌ కంపెనీ(ఢిల్లీ)కి చిత్ర, రవి అప్పగించారన్న ఆరోపణలపై సీబీఐ గత వారమే ఈ ముగ్గురితోపాటు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రవి వారణాసి, ప్రాంగణం అధిపతి మహేశ్‌ హల్దీపూర్‌పై కేసు నమోదుచేసింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది.

*యాదాద్రి: జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద కరెంట్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన అనిల్ (21), ప్రశాంత్ (17)గా గుర్తించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా, విద్యుత్ సరఫరా నిలిపివేయక పోవడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.

*నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో విద్యార్థినుల ర్యాగింగ్‌ కలకలం సృష్టిస్తోంది. డీపీటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొందరు ర్యాగింగ్‌ చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సమీపంలో ఉన్న రైలు కింద పడగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు.అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వండిన ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంపిళ్లను సేకరించారు.

*నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండ‌లం కేంద్రంలో దారుణం జ‌రిగింది. త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని ఓ యువ‌తిపై బీర్ సీసాతో యువ‌కుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయ‌మైంది. బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

*ఒక మహిళ పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల మొహమ్మద్ కైష్‌ మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే ఆ మహిళ అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 24న కైష్‌, ఆ మహిళను ఒక ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ అపస్మారకంగా పడిఉండగా ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.