Politics

తనను ఎందుకు నమ్మాలో జగనే చెప్పాలి – TNI రాజకీయ వార్తలు

తనను ఎందుకు నమ్మాలో జగనే చెప్పాలి  – TNI  రాజకీయ వార్తలు

*తనను ఎందుకు నమ్మాలో సీఎం జగనే(CM Jagan) చెప్పాలని మాజీ మంత్రి జవహర్(Jawahar) పేర్కొన్నారు. రైతులను దగా చేసినందుకు నమ్మాలా? అని ప్రశ్నించారు. ఇంకా సీఎం జగన్‌పై జవహర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పంట రుణాలు సబ్సిడీలో మోసం చేసినందుకు నమ్మాలా? నీ హయాంలో పంట విరామమిచ్చినందుకు నమ్మాలా? ధాన్యం కొనుగోలు డబ్బు ఈ నాటికి ఇవ్వనందుకు నిన్ను నమ్మాలా? విద్యార్థులకు మేనమామ అని వారికి బడులు దూరం చేసినందుకు నమ్మాలా? ఇంట్లో అందరికి అమ్మ ఒడి అని ఇంకో బిడ్డకు మోసం చేసినందుకు నిన్ను నమ్మాలా? దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నందుకు నిన్ను నమ్మాలా? దళితుల సంక్షేమ పధకాలు 27 రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? వెయ్యి అబద్ధాలు లక్షల వాగ్దాన భంగం చేస్తున్నందుకు నమ్మాలా? మధ్యపాన నిషేధాన్ని నినాదంగా మార్చి ప్రజలను ఏమార్చినందురు నిన్ను నమ్మాలా? వారంలో రద్దు చేస్తానని సీపీయస్ ఉద్యోగులను మోసగించినందుకు నమ్మలా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం జగన్ గారు నిన్ను నమ్మి పోసపోయినవి ..ఇంక నిన్నెలా నమ్మాలో చెప్పండి’’ అని జవహర్ ప్రశ్నించారు.

*రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దుష్ప్రచారం : ఎంపీ విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొనలేకే చంద్రబాబు, నాయకులు తనపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దుష్ప్రచారాలు మానుకోకపోతే చంద్రబాబుపై పదింతలు దుష్ప్రచారం చేసేందుకు తన వద్ద ఆదారాలతో సహ ఉన్నాయని వెల్లడించారు. అడాన్‌ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఖండించారు. పరిధిలు దాటితే సహించబోమని చంద్రబాబు, లోకేశ్‌ను హెచ్చరించారు.తాను ఏనాడు కూడా మహిళ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయలేదని అన్నారు. వైసీపీ బురద చల్లాలనే ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఎదుటివారి బురద చల్లి ఆనందించే వారిలో చంద్రబాబు ముందంజలో ఉంటారని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలో వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు మనుషులదేనని విమర్శించారు. సోషల్‌ మీడియా ద్వారా బూతులు తిడితే తాము కూడా అదే పని చేయవచ్చని కాని తాము అలా చేయబోమని, వైసీపీ విలువలు గల పార్టీ అని పేర్కొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వరుసకు‘ అన్న’ అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తన భార్య సోదరి కూతురిని తారకరత్నతో వివాహం జరిగిందని ఈ పరంగా చూస్తే తనకు చంద్రబాబు బంధువు అవుతారని వ్యాఖ్యనించారు.

*పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంత్రి వరదలపై అన్నిశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన సహాయక చర్యలు, ఆస్తి, పంట న‌ష్టం, బాధితుల‌కు అందుతున్న స‌హాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎడతెరపి లేని వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్ధేశం చేశారు. రైతు వారీగా వివరాలను సర్వేలో న‌మోదు చేయాల‌న్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. సమావేశంలో జ‌డ్పీ చైర్ పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠ‌ల్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం స‌క్కు, కలెక్టర్‌ రాహుల్ రాజ్, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

*అంబేద్కర్‌ పేరును తొలగించి జగన్‌ పేరును పెట్టడమా ? : చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ‘‘ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’’ పథకాన్ని అమలు చేశామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. అయితే ఈ పథకానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్‌ పేరును తొలగించి జగన్‌ పేరు పెట్టుకోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.‘‘ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’’ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్‌ డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. బీసీ, మైనారిటీ విధ్యార్థులకు ‘‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ’’ పథకం కింద రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశామని పేర్కొన్నారు.మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని వెల్లడించారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*వైసీపీ, టీడీపీ సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదం: Tulasireddy
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ , టీడీపీ పార్టీలు సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ అభ్యర్థి గిరిజనురాలు కాబట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పడం కేవలం సాకు మాత్రమే అని తెలిపారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే కల్లు కోసం కాదు, దూడ గడ్డి కోసం అన్నట్లుంది ఈ పార్టీల వైఖరి అని వ్యాఖ్యానించారు. 2012లో జరగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ , పిఏ సంగ్మా ల మధ్య పోటీ జరిగిందని, సంగ్మా మేఘాలయకు చెందిన గిరిజనుడని తెలిపారు. ఆ ఎన్నికల్లో గిరిజనుడు అయిన సంగ్మాకు కాకుండా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

*జగనన్న కృషి వల్ల మద్యం ఆదాయం పెరుగుతోంది: Lanka Dinakar
జగనన్న హమీ మద్యం నిషేధం నుంచి మద్యం ద్వారా ఆదాయం పెంపకం పథకం వైపు వెళుతోందని బీజేపీ నేత లంకా దినకర్ పేర్కొన్నారు. జగనన్న మద్యం దుకాణాల ప్రభుత్వ నిర్వహణ ద్వారా నియంత్రణ అని ఇప్పుడు ఆదాయం కోసం మళ్ళీ ప్రైవేట్ బాట పట్టారని లంకా దినకర్ తెలిపారు. జగనన్న ఇప్పటి వరకు అయినవారి బ్రాండ్లు అమ్మించి, ఇప్పుడు అన్ని బ్రాండ్లు అంటున్నారన్నారు. ఆయన కృషి వల్ల ప్రతి సంవత్సరం మద్యం ఆదాయం పెరుగుతోందన్నారు. జగనన్న తీరు ఇంకా మద్యం ఆదాయం పెంచాలనే ఆలోచన ఆయన దాహం తీరనిది అనిపిస్తోందని లంకా దినకర్ పేర్కొన్నారు.

*పేరు మార్చిన విషయం నాకు తెలియదు: మంత్రి బొత్స
విజయనగరం, పార్వతీపురం జిల్లాలో గతుకులడిన 20 రోడ్లు గుర్తించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 93 కోట్లుతో టెండరు పిలుస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 27 రోడ్లు గుర్తించామని చెప్పారు. ఒక్క ఆర్ అండ్ బి పరిధిలో 50 కిలోమీటర్లు రోడ్డు పాడైనట్టు గుర్తించామని చెప్పారు. బాగు కోసం టెండర్లు పిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో 270 స్కూల్స్ లో విలీన సమస్య ఉన్నట్టు కూడా గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. ఏఏ స్కూల్స్‌తో సమస్య వుందో తెలియచేయని సంబంధిత శాసనసభ్యులను కోరామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన విషయం తనకు తెలియదన్నారు.

* వైసీపీకి ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా?: శ్రవణ్కుమార్రా
ష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్లీనరీకి కూడా ఇటువంటి నిబంధనలు పెట్టారా?.. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా? అని శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ దురాగతాలపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. ఒంగోలు సభలో గళం విప్పుతారని శ్రవణ్కుమార్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అంబేడ్కర్‌ 131వ జయంతి రోజున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ‘జై భీమ్‌ భారత్‌’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసిన నిందితులను శిక్షించలేని దుర్మార్గపు పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దళితుల సమస్యలు పరిష్కరించని, దాడులపై స్పందించని వైసీపీలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.

*బటన్ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా?: Lokesh
రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్మం డిపడ్డారు. ‘‘జగన్ రెడ్డి గారు మీరు పంపే ఫ్యామిలీ డాక్టర్ వచ్చేలోగా జనాలు బతికేలా లేరు. సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది. విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందారు. వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? బటన్ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా?’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*గుజరాత్ ప్రభుత్వంపై కుట్రకు సూత్రధారి సోనియా గాంధీ : బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ శనివారం తీవ్రంగా విరుచుకుపడింది. 2002 గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచి, కూల్చివేసేందుకు పన్నిన కుట్రకు ఆమె సూత్రధారి అని ఆరోపించింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిలు పిటిషన్‌పై గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ నేపథ్యంలో బీజేపీ ఈ ఆరోపణలు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ ప్రమేయం లేదని సుప్రీంకోర్టు గత నెలలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్ల కేసును రగిలించేందుకు పదే పదే పిటిషన్లు దాఖలు చేసినవారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, అప్పటి గుజరాత్ పోలీసు ఉన్నతాధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌లను గుజరాత్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిలు కోసం తీస్తా సెతల్వాద్ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు బెయిలు ఇవ్వవద్దని సిట్ శుక్రవారం ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రలో సెతల్వాద్ భాగస్వామి అని ఆరోపించింది. అహ్మద్ పటేల్ ఆదేశాలను సెతల్వాద్, ఇతర నిందితులు అమలు చేసినట్లు ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలనుబట్టి తెలుస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మీడియాతో మాట్లాడుతూ, సిట్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం అహ్మద్ పటేల్ కుట్రదారు అని, అయితే వాస్తవ చోదక శక్తి ఆయన బాస్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని ఆరోపించారు. కుట్ర జరిగిందని ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైందన్నారు. అయితే ఈ కుట్రలకు చోదక శక్తి ఎవరు? అని ప్రశ్నించారు. ఆ శక్తి అహ్మద్ పటేల్ అని చెప్పారు. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు అని, సోనియా గాంధీకి ప్రధాన రాజకీయ సలహాదారు అని చెప్పారు. అహ్మద్ పటేల్‌ను వాడుకుని గుజరాత్ ప్రతిష్ఠను మసకబార్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని, అస్థిరపరచాలని ఆమె ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలోని అత్యున్నత స్థాయి నేత నుంచి సెతల్వాద్‌కు రూ.30 లక్షలు అందినట్లు అఫిడవిట్ పేర్కొందని తెలిపారు. బీజేపీ, మోదీల ప్రతిష్ఠను మసకబార్చేందుకు, రాహుల్ గాంధీకి మంచి పేరు వచ్చేలా చేసేందుకు సోనియా గాంధీ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఎవరికీ తెలియదన్నారు. మీడియా సమావేశం నిర్వహించి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎందుకు కుట్ర పన్నారో దేశానికి తెలియజేయాలని సోనియా గాంధీని హృదయపూర్వకంగా కోరుతున్నామని చెప్పారు.

*తనను ఎందుకు నమ్మాలో జగనే చెప్పాలి : Jawahar
తనను ఎందుకు నమ్మాలో సీఎం జగనే చెప్పాలని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు. రైతులను దగా చేసినందుకు నమ్మాలా? అని ప్రశ్నించారు. ఇంకా సీఎం జగన్‌పై జవహర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పంట రుణాలు సబ్సిడీలో మోసం చేసినందుకు నమ్మాలా? నీ హయాంలో పంట విరామమిచ్చినందుకు నమ్మాలా? ధాన్యం కొనుగోలు డబ్బు ఈ నాటికి ఇవ్వనందుకు నిన్ను నమ్మాలా? విద్యార్థులకు మేనమామ అని వారికి బడులు దూరం చేసినందుకు నమ్మాలా? ఇంట్లో అందరికి అమ్మ ఒడి అని ఇంకో బిడ్డకు మోసం చేసినందుకు నిన్ను నమ్మాలా? దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నందుకు నిన్ను నమ్మాలా? దళితుల సంక్షేమ పధకాలు 27 రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? వెయ్యి అబద్ధాలు లక్షల వాగ్దాన భంగం చేస్తున్నందుకు నమ్మాలా? మధ్యపాన నిషేధాన్ని నినాదంగా మార్చి ప్రజలను ఏమార్చినందురు నిన్ను నమ్మాలా? వారంలో రద్దు చేస్తానని సీపీయస్ ఉద్యోగులను మోసగించినందుకు నమ్మలా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం జగన్ గారు నిన్ను నమ్మి పోసపోయినవి ..ఇంక నిన్నెలా నమ్మాలో చెప్పండి’’ అని జవహర్ ప్రశ్నించారు

*తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మకండి: Sampath kumar
ఆరా సంస్థ యజమాని మస్తాన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావం చేయాలని చూశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆ సర్వే వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఉన్నాయని ఆరోపించారు. ‘‘మీరు చేసిన సర్వే ఎప్పుడు.. ఎక్కడ చేశారు.. ఎవరెవరిని కలిసారని ఆధారాలతో సహా ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ డబ్బులకు అమ్ముడు పోయి మస్తాన్ రాజకీయ లాలూచీకి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మవద్దని తెలిపారు. ‘‘మంత్రి కేటీఆర్… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి విమర్శించే ముందు నీ సిరిసిల్లను సరి చేసుకో… అక్కడ వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు’’ అంటూ సంపత్ మండిపడ్డారు.

*రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: Niranjan reddy
రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ఆయిల్ పామ్ డిమాండ్ గమనించే ప్రోత్సాహంఅందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం మోస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సఫరా చేస్తున్నామని అన్నారు. అలాగే ఏడాదికి రూ.1500 కోట్లు పెట్టి రైతుభీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకంఅమలు చేస్తున్నామన్నారు.

*ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: భట్టివిక్రమార్క
గోదావరి వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన భద్రాచలం వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి వరద పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు ఆయన్ను సారపాక వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ప్రతిపక్ష నేత వాహనాలను అనుమతించరా, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత భట్టి వాహనాన్ని పోలీసులు అనుమతించగా.. ఆయన కరకట్టపైకి చేరుకుని గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు.

*ఆ సర్వే ప్రకారం CONGRESSదే గెలుపు: ఉత్తమ్కాం
గ్రెస్ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్దే విజయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. మంత్రి కేటీఆర్స్థా యికి మించి రాహుల్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంకలో రాజపక్సకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీని రద్దు చేస్తే.. మేము ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు

*ప్రధాని ఏపీలో పర్యటించాలి: రామకృష్ణ
వరదలో మునిగి సతమతమవుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి ప్రధాని మోదీ ఏపీలో పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, దాదాపు 5 వేల గ్రామాలు ముంపులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

*ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చని పవన్‌: మంత్రి రోజా
ప్రజలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని పార్టీ పెట్టిన పవన్‌ కబుల్యాణ్‌ ఏనాడూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని మంత్రి ఆర్‌.కే.రోజా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ ప్రజలకు అందుబాటులో లేరని, కేవలం మీడియాలోనూ, లేఖల్లోనూ మాత్రమే కనిపిస్తున్నారని విమర్శించారు. తప్పు చేస్తే బీజేపీ, టీడీపీలను నిలదీస్తానని, ఉద్దానం బాధితులను ఉద్ధరిస్తామని, అసలు షూటింగులే చేయకుండా ప్రజల కోసమే వుంటానని హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. మాటమీద నిలబడడం మాట అటుంచి అసలు ఒక కాలు మీద తప్ప రెండు కాళ్ళ మీద సక్రమంగా నిలబడలేవని తెలుసంటూ ఎద్దేవా చేశారు.

*సంగ్మాకు ఇవ్వని మద్దతు ముర్ముకు ఎందుకు?: చలసాని శ్రీనివాస్‌
‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో సంగ్మాకు మద్దతు ఇవ్వని పార్టీలు ఇప్పుడు ద్రౌపతి ముర్ముకు ఎందుకు ఇస్తున్నాయి? మద్దతు విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వేర్వేరు కారణాలు చెబుతున్నా కేవలం ఢిల్లీ బాద్‌షాలకు భయపడి మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది’’ అని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. విజయవాడలో ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ అడగకుండానే టీడీపీ, వైసీపీలు మద్దతు ప్రకటించాయని ఆరోపించారు. ఈ పార్టీల వైఖరికి వ్యతిరేకంగా ఈనెల 18న ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో నిరసనలు తెలియజేయాలని చలసాని పిలుపునిచ్చారు.

*కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డే నా..: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధాన్యం సేకరణపై తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని రైతు బంధు సమితి అధ్యక్షులు , ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నకిషన్‌రెడ్డి మాట్లాడట్లేదని.. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి యాసంగిలో ధాన్యం వేయమని రైతులకు సూచనలు చేశారని చెప్పారు.రైతులు ధాన్యం పండించాక ఇప్పుడు బియ్యం కొనడంలో కేంద్రం మెలికలు పెడుతోందన్నారు.రైతుల ఘోస పట్టించుకోకుండా ఈటల రాజేందర్ అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెలా పదిహేను రోజులుగా తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదన్నారు.రైస్ మిల్లుల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పెద్దలు కూలుస్తున్నారని కేంద్రం వారి ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తే కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పారు.చివరి గింజ వరకు కొంటామని చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

*అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్: Tulasireddy
ప్రధాని మోదీ (Modi) పాలనలో దేశం పరిస్థితి, జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమైందన్నారు. అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్ స్థానంలో ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌కు శ్రీలంక పరిస్థితి వస్తుందని అన్నారు. రాజపక్సే దుస్థితి రాకుండా మోదీ, జగన్ జాగ్రత్త పడడం మంచిది అంటూ తులసిరెడ్డి హితవుపలికారు.

*పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాలపై ఏపీ ఆసక్తి: మంత్రి అమర్నాథ్‌రెడ్డి
ఈ నెల 16వ తేదీన విశాఖ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఏపీ…వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశం ఉంటుందని మంత్రి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాలపై ఏపీ ఆసక్తిగా ఉందని.. పరిశ్రమలు, నైపుణ్యం, గనులు, ఖనిజాలు, విద్యుత్ రంగాల్లో కలిసి పని చేయడానికి పరస్పర అంగీకారం కుదుర్చుకుంటామని మంత్రి అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

*అలా చేస్తే ద్రౌపది ముర్మును అవమానించడమే..: కనకమేడల
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తూ వక్రభాష్యం చెబుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…టీడీపీ నిర్ణయాన్ని వైసీపీ ఎద్దేవా చేయడమంటే ద్రౌపది ముర్మును అవమానించడమేనని చెప్పారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం గళమెత్తుతామన్నారు.సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకు ఓటేస్తామన్నారు. ద్రౌపది ముర్ముకు మద్దతివ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. కేంద్రం వివిధ హెడ్స్ ద్వారా ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్నారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీల నుంచి వైసీపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని.. దీనిపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ నిధులనూ ఏపీ ప్రభుత్వం. దారి మళ్లించిందన్నారు. జగన్ కంపెనీలు.. జగన్ బినామీ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్నాయి.. ఏపీ మాత్రం దివాళ తీస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

*విభజన హామీలపై కేంద్రంతో వైసీపీ మాట్లాడట్లేదు: రామ్మోహన్నాయుడు
విభజన హామీలపై వైసీపీ కేంద్రప్రభుత్వంతో మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా పేరుతో సీఎం జగన్ ఓట్లు దండుకున్నారన్నారు.మాట తప్పం.. మడమ తిప్పమనే జగన్ సిద్ధాంతం ఏమైంది? అని ప్రశ్నించారు.ప్రధాని కనిపిస్తే సెల్ఫీలు దిగి సంబరపడే జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదన్నారు.విశాఖ రైల్వే జోన్ ప్రకటన వచ్చినా.. నిధులు రూ.కోటి కూడా ఇవ్వడంలేదని రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.

*అలా చేస్తే ద్రౌపది ముర్మును అవమానించడమే..: కనకమేడల
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తూ వక్రభాష్యం చెబుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…టీడీపీ నిర్ణయాన్ని వైసీపీ ఎద్దేవా చేయడమంటే ద్రౌపది ముర్మును అవమానించడమేనని చెప్పారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం గళమెత్తుతామన్నారు.సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకు ఓటేస్తామన్నారు. ద్రౌపది ముర్ముకు మద్దతివ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. కేంద్రం వివిధ హెడ్స్ ద్వారా ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్నారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీల నుంచి వైసీపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని.. దీనిపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ నిధులనూ ఏపీ ప్రభుత్వం. దారి మళ్లించిందన్నారు. జగన్ కంపెనీలు.. జగన్ బినామీ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్నాయి.. ఏపీ మాత్రం దివాళ తీస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

*విభజన హామీలపై కేంద్రంతో వైసీపీ మాట్లాడట్లేదు: రామ్మోహన్నాయుడు
విభజన హామీలపై వైసీపీ కేంద్రప్రభుత్వంతో మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా పేరుతో సీఎం జగన్ ఓట్లు దండుకున్నారన్నారు.మాట తప్పం.. మడమ తిప్పమనే జగన్ సిద్ధాంతం ఏమైంది? అని ప్రశ్నించారు.ప్రధాని కనిపిస్తే సెల్ఫీలు దిగి సంబరపడే జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదన్నారు.విశాఖ రైల్వే జోన్ ప్రకటన వచ్చినా.. నిధులు రూ.కోటి కూడా ఇవ్వడంలేదని రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.

*కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డే నా..: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధాన్యం సేకరణపై తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని రైతు బంధు సమితి అధ్యక్షులు , ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నకిషన్‌రెడ్డి మాట్లాడట్లేదని.. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి యాసంగిలో ధాన్యం వేయమని రైతులకు సూచనలు చేశారని చెప్పారు.రైతులు ధాన్యం పండించాక ఇప్పుడు బియ్యం కొనడంలో కేంద్రం మెలికలు పెడుతోందన్నారు.రైతుల ఘోస పట్టించుకోకుండా ఈటల రాజేందర్ అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెలా పదిహేను రోజులుగా తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదన్నారు.రైస్ మిల్లుల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పెద్దలు కూలుస్తున్నారని కేంద్రం వారి ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తే కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పారు.చివరి గింజ వరకు కొంటామని చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

*రుణమాఫీ హామీ అమలు కోసం సంతకాల సేకరణ ఉద్యమం : బీజేపీ
రైతులకు లక్ష రూపాయల వ్యవసాయ రుణం మాఫీ కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 16నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు సంతకాల ేసకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే లక్ష రూపాయల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానన్న కేసీఆర్‌ ఆ మాటే మరిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ లో అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

*జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారు: కోమటిరెడ్డి
జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో విసిగిపోయిన జనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. సొంత సర్వేలతో కాకి లెక్కలు వేస్తూ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంజాబ్‌లో రైతులు మరణిస్తే రూ.30 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతులు, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

*ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుంది: శైలజానాథ్‌
ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరద ముంపు నదులను తలపిస్తున్నాయని విమర్శించారు. వరద సహాయ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధక్షుడు సోనియాను అనవసరంగా పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈడీ పిలవాల్సింది అమిత్‌షా, ఆయన కుమారుడినని చెప్పారు. ఈడీ విచారణకు వ్యతిరేకంగా 21న విజయవాడలో కాంగ్రెస్‌ ఆందోళన చేస్తున్నట్లు శైలజానాథ్‌ ప్రకటించారు.

*వరదలో ప్రజలు.. నిద్రావస్థలో సర్కారు: బాబు
భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525 గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వారందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరిచి నిద్రపోతోందని విమర్శించారు. ముఖ్యంగా ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే చిన్న సూచన కూడా వారికి ధైర్యాన్నిస్తుందని గురువారం ట్వీట్‌ చేశారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాంకేతికత ఆధారంగా హెచ్చరిక వ్యవస్థను ఆధునీకరించిన వైనాన్ని వివరించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

*పదిరోజుల్లో నాడు-నేడు పనులు: మంత్రి బొత్స
నాడు-నేడు పథకం రెండో దశలో భాగంగా చేపడుతున్న పనులన్నీ పది రోజుల్లో ప్రారంభం కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. గురువారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 22,344 పాఠశాలలకు గాను 20,757 పాఠశాలల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. దీనికి కావాల్సిన అన్ని అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పథకంలో నిధులకు ఎలాంటి కొరత లేదని, రూ.554 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల చేశామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో గరిష్ఠ ఫీజు రూ.15వేల కంటే ఎక్కువ దాటకుండా చూడాలన్నారు.

*ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణానికి చర్యలు: అజయ్‌ జైన్‌
పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఆప్షన్‌-3లో నిర్మిస్తున్న ఇళ్లను సత్వరమే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల హౌసింగ్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హౌసింగ్‌ బోర్డు ఎండీ నారాయణ భరత్‌గుప్తా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని లే-అవుట్లలో ఏవైనా సమస్యలు ఎదురైతే మున్సిపల్‌ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

*ప్రభుత్వ కుతంత్రం.. పేదలకు శాపం: సోము
స్వార్థ రాజకీయాలతో వైసీపీ ప్రభుత్వం 2.68కోట్ల మంది నిరుపేదలను ఆకలితో ఉంచడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రంలోని పేదలకు వైసీపీ ప్రభుత్వం సరఫరా చేయక పోవడాన్ని నిరసిస్తూ ఏపీ బీజేపీ శ్రేణులు గురువారంరాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల గోడౌన్ల ముందు ధర్నాకు దిగాయి. విజయవాడ సివిల్‌ సప్ల్సై గోడౌన్‌ వద్ద నిరసన చేపట్టిన వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ఐదు విడతలుగా కేంద్రం 25లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఏపీలోని పేదలకు ఇస్తే అందుకు రూ.5,500కోట్లు విడుదల చేసిందని వివరించారు. సెప్టెంబరు వరకూ ఈ పథకాన్ని పొడిగించిన మోదీ ప్రభుత్వం ఏప్రిల్‌, మే, జూన్‌లో కూడా నిధులిస్తే బియ్యం సరఫరా చేయలేదంటూ కేంద్రంపై అభాండాలు వేస్తూ వైసీపీ నేతలు ప్రజల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*టీడీపీ హయాంలోనే మైనింగ్‌ మాఫియా: మంత్రి పెద్దిరెడ్డి
‘రాష్ట్రంలో మైనింగ్‌ మాఫియా మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. విశాఖ రుషికొండ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారు. పర్యావరణ అనుమతులు ఉన్నచోట మాత్రమే మైనింగ్‌ జరుగుతోంది’ అని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో అక్రమ మైనింగ్‌ జరగడంలేదని అధికారులు తేల్చారని, కానీ చంద్రబాబు సీఎం జగన్‌పె చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 చోట్ల తాను అక్రమ మైనింగ్‌ చేయిస్తున్నానని చంద్రబాబు విమర్శలు చేయడం తగదన్నారు.

*వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతోంది: చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను.. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. పాలకుల అలసత్వంతో వరద బాధితులు అల్లాడుతున్నారని తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటూ సాయం చేయాలని టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ విమర్శలు మాని ప్రజలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చంద్రబాబు ప్రకటించారు.

*రుణమాఫీ హామీ అమలు కోసం సంతకాల సేకరణ ఉద్యమం : బీజేపీ
రైతులకు లక్ష రూపాయల వ్యవసాయ రుణం మాఫీ కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 16నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు సంతకాల ేసకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే లక్ష రూపాయల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానన్న కేసీఆర్‌ ఆ మాటే మరిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ లో అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

*ప్రభుత్వ కుతంత్రం.. పేదలకు శాపం: సోము
స్వార్థ రాజకీయాలతో వైసీపీ ప్రభుత్వం 2.68కోట్ల మంది నిరుపేదలను ఆకలితో ఉంచడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రంలోని పేదలకు వైసీపీ ప్రభుత్వం సరఫరా చేయక పోవడాన్ని నిరసిస్తూ ఏపీ బీజేపీ శ్రేణులు గురువారంరాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల గోడౌన్ల ముందు ధర్నాకు దిగాయి. విజయవాడ సివిల్‌ సప్ల్సై గోడౌన్‌ వద్ద నిరసన చేపట్టిన వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ఐదు విడతలుగా కేంద్రం 25లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఏపీలోని పేదలకు ఇస్తే అందుకు రూ.5,500కోట్లు విడుదల చేసిందని వివరించారు. సెప్టెంబరు వరకూ ఈ పథకాన్ని పొడిగించిన మోదీ ప్రభుత్వం ఏప్రిల్‌, మే, జూన్‌లో కూడా నిధులిస్తే బియ్యం సరఫరా చేయలేదంటూ కేంద్రంపై అభాండాలు వేస్తూ వైసీపీ నేతలు ప్రజల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*టీడీపీ హయాంలోనే మైనింగ్‌ మాఫియా: మంత్రి పెద్దిరెడ్డి
‘రాష్ట్రంలో మైనింగ్‌ మాఫియా మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. విశాఖ రుషికొండ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారు. పర్యావరణ అనుమతులు ఉన్నచోట మాత్రమే మైనింగ్‌ జరుగుతోంది’ అని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో అక్రమ మైనింగ్‌ జరగడంలేదని అధికారులు తేల్చారని, కానీ చంద్రబాబు సీఎం జగన్‌పె చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 చోట్ల తాను అక్రమ మైనింగ్‌ చేయిస్తున్నానని చంద్రబాబు విమర్శలు చేయడం తగదన్నారు.

*పదిరోజుల్లో నాడు-నేడు పనులు: మంత్రి బొత్స
నాడు-నేడు పథకం రెండో దశలో భాగంగా చేపడుతున్న పనులన్నీ పది రోజుల్లో ప్రారంభం కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. గురువారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 22,344 పాఠశాలలకు గాను 20,757 పాఠశాలల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. దీనికి కావాల్సిన అన్ని అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పథకంలో నిధులకు ఎలాంటి కొరత లేదని, రూ.554 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల చేశామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో గరిష్ఠ ఫీజు రూ.15వేల కంటే ఎక్కువ దాటకుండా చూడాలన్నారు.

*మందుల కొరత లేకుండా చూడాలి: మంత్రి రజిని
రాష్ట్రంలో వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఏపీఎంఎ్‌సఐడీసీ విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా మందులకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించి అన్నీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌, యూపీహెచ్‌సీలు, ఐదు మెడికల్‌ కాలేజీలు నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాల్సి ఉందన్నారు. ఆ పనులు సకాలంలో పూర్తియ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*విదేశీ విద్యా దీవెన అపరిమితం: మంత్రి నాగార్జున
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అన్ని వర్గాల్లోని నిరుపేద విద్యార్థులకు ఎంత మందికైనా అపరిమితంగా అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘‘క్యూఎస్‌ ర్యాంకింగ్‌ పొందిన టాప్‌-100 విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించిన వారికి రూ.కోటి వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. 100పైన 200 లోపు ర్యాంకింగ్‌లోని వర్సిటీల్లో సీటు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ సాయం చేస్తాం. ఇందుకోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాం. ’’ అని నాగార్జున చెప్పారు.

*ఆరోగ్య రంగానికి అనారోగ్యం: తులసిరెడ్డి
వైసీపీ పాలనలో ఆరోగ్య రంగానికి అనారోగ్యం పట్టుకుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతా అన్నట్టున్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్లకు, పారా మెడికల్‌ సిబ్బందికి, మందులకు దిక్కులేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని వేంపల్లెలో 50 పడకల ఆస్పత్రి పేరుకు మాత్రమే అని.., డాక్టర్లు, సిబ్బంది కొరతతో కనీసం పోస్టుమార్టం కూడా చేయలేని దుస్థితిలో ఆస్పత్రి ఉందన్నారు. జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు.

*రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలి: Vijayashanthi
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని BJP సీనియర్ నాయకురాలు Vijayashanthi డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. KCR స‌ర్కార్ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని ఆమె ఆరోపించారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమ‌లు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌కరమని ఆరోపించారు. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఉందని, 14వ తేదీ వచ్చినా 18 జిల్లాల్లో ఉద్యోగులకు శాలరీలు అందలేదని రాములమ్మ ఆరోపించారు. పెన్షన్ల పరిస్థితీ అలాగే ఉందని.. ఈఎంఐలు కట్టలేకపోతున్నామంటూ ఉద్యోగులు వాపోతున్నారని Vijayashanthi చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బందులు ప‌డుతున్నారని తెలిపారు. ఇప్ప‌టికైనా వారికి జీతాలు, పెన్ష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

* రాష్ట్రపతి ఎన్నికలోనూ ‘ఆపరేషన్‌ కమల్‌’: యశ్వంత్‌సిన్హా
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి జరుగుతున్న ఎన్నికలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా బేరసారాలకు పాల్పడుతూ ‘ఆపరేషన్‌ కమల్‌’ నిర్వహిస్తోందని విపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా ఆరోపించారు. ఎన్నికల సంఘం, రాజ్యసభ ప్రధాన కార్యదర్శి (రాష్ట్రపతి ఎన్నికకు ఆర్వో) ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ ఆపరేషన్‌లో భాగంగా భాజపాయేతర శాసనసభ్యులకు పెద్దమొత్తంలో డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. ‘కమలం’ భాజపా ఎన్నికల గుర్తు అన్న విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో కాంగ్రెస్‌ శాసనసభ్యులతో భేటీ అనంతరం యశ్వంత్‌సిన్హా మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను చూసి నేను విస్తుపోయా. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై భాజపా కన్ను పడిందని, క్రాస్‌ ఓటింగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది ఆ వార్త సారాంశం’ అన్నారు. ఆపరేషన్‌ కమల్‌కు సరైన పేరు ‘ఆపరేషన్‌ మురికి’ అని అభివర్ణించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రతిపక్షాల నడుమ స్పర్థలు తెచ్చేందుకు భాజపా ఇటువంటి మురికి రాజకీయాలకు పాల్పడుతోందని సిన్హా ధ్వజమెత్తారు

* క్యూఎస్‌ ర్యాంకు 200లోపుంటేనే.. విదేశీ విద్యా సాయం: మంత్రి నాగార్జున
క్యూఎస్‌ ర్యాంకు 200లోపున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. క్యూఎస్‌ ర్యాంకుల్లో మొదటి 100 స్థానాల్లోని వర్సిటీల్లో సీట్లు సాధించిన వారికి పూర్తిగా ఫీజు చెల్లిస్తామని, 100-200 మధ్య ర్యాంకుల్లో ఉన్న వాటిలో ప్రవేశాలు పొందిన వారికి రూ.50లక్షల వరకు ఫీజు చెల్లిస్తామని వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘గతంలో ఈ పథకానికి రూ.6 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచాం. విదేశీ వర్సిటీల్లో సీట్లు పొందేందుకు అవసరమైతే ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ ఇస్తాం. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో లోపాలున్నట్లు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ విచారణలో తేలింది. 2016-17లో ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను చెల్లించలేదు’ అని పేర్కొన్నారు.

* కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి కబ్జా చేశారు: నల్లారి
చిత్తూరు, పీలేరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి కబ్జా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా సాక్షిగా వారి అక్రమాలను నిరూపిస్తామని, సాక్షి మీడియా కూడా ఈ మీటింగ్‌కు రావాలనిస్వామిమాలలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి అబద్దాలు చెప్పటం సిగ్గుచేటన్నారు. పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్ , మైన్ అన్నింటిలోనూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కమీషన్లు ఇవ్వకుంటే మైనింగ్‌లో పెద్దిరెడ్డి వాటాలు రాయించుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నుంచి చైన్నై, బెంగుళూరు‌కు ప్రతి రోజూ 300 లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు.తిరుపతిలో డీకేటీ భూములు ఎమ్మార్వో ఆఫీసులో రికార్టులు ట్యాంపరింగ్ చేశారని చెప్పారు. ఎస్పీవై డిస్టలరీ లీజుకు తీసుకుని నాసికరం మద్యం తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ద్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగే ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులో పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డికి కమీషన్లు అందుతున్నాయన్నారు.అక్రమ సంపాదనతో వచ్చిన డబ్బుతో ఓట్లు కొని మళ్లీ అధికారంలోకి రావొచ్చని జగన్‌రెడ్డి, వైసీపీ నేతలనుకుంటున్నారని చెప్పారు.ప్రజలు అమాయకులు కాదు, మీ అరాచకాలపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీలకంలో పాలకులకు పట్టిన గతే ఏపీలో జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డిలకు పడుతుందని నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

*తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మకండి: Sampath kumar
ఆరా సంస్థ యజమాని మస్తాన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావం చేయాలని చూశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆ సర్వే వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఉన్నాయని ఆరోపించారు. ‘‘మీరు చేసిన సర్వే ఎప్పుడు.. ఎక్కడ చేశారు.. ఎవరెవరిని కలిసారని ఆధారాలతో సహా ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ డబ్బులకు అమ్ముడు పోయి మస్తాన్ రాజకీయ లాలూచీకి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మవద్దని తెలిపారు. ‘‘మంత్రి కేటీఆర్… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి విమర్శించే ముందు నీ సిరిసిల్లను సరి చేసుకో… అక్కడ వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు’’ అంటూ సంపత్ మండిపడ్డారు

*Modi గుజరాత్‌కు మాత్రమే ప్రధాని : KTR
నరేంద్ర మోదీ గుజరాత్‌ మాత్రమే ప్రధాని అని దేశానికి కాదని మంత్రి కేటీఆర్) పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్‌ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదన్నారు. ఎప్పటికీ, ఇప్పటికీ మోదీ పెరేడ్ గ్రౌండ్‌లో చెప్పిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియాలన్నారు. టెక్స్ టైల్స్ పార్కు, కట్టని ఫ్లై ఓవర్ కట్టారని అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు
*