NRI-NRT

అమెరికాను వణికిస్తున్న రాకాసి నత్తలు.. ఫ్లోరిడాలో లాక్‌డౌన్

అమెరికాను వణికిస్తున్న రాకాసి నత్తలు.. ఫ్లోరిడాలో లాక్‌డౌన్

అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఈ జాతికి చెందిన ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. ఈ 1200 నత్తలు ఒక్కొక్కటి 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయి. ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినటం ఖాయం.

ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సంక్రమిస్తే మనుషుల్లో జ్వరం, తలనొప్పి, మెదడుకు నీరుపట్టడం, కండరాల బలహీనత, ఫిట్స్, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నత్తలు ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ నత్తలు తిరుగుతున్న విషయాన్ని ఫ్లోరిడా వ్యవసాయ, వినియోగదారుల సేవా విభాగం (FDACS) నిర్ధారించింది. ఈ నత్తలు ఏయే వస్తువులపై తిరిగాయో వాటిని ఇప్పుడు ప్రజలు ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని న్యూ పోర్ట్ రిచీ పట్టణంలో లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ ప్రకారం ప్రజలు తమ ఇళ్ల దగ్గర ఉండే మొక్కలు, మట్టి, చెత్త, కంపోస్ట్ వంటి వాటిని కదపకూడదు. నిర్మాణ వస్తువుల్ని కూడా అలాగే ఉంచాలి. వీటి సంగతిని పర్యావరణ రక్షణ ఏజెన్సీ చూసుకుంటుంది. ఈ నత్తల వల్ల మనుషులకే కాకుండా పర్యావరణానికీ హానే. ఈ నత్తలకు చెట్లు, కాంక్రీట్ అంటే ఇష్టం. దీంతో ఇవి పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ ఇళ్లలోకి వచ్చిన నత్తలను బయట పడేయాలనుకుంటే ప్రొటెక్టివ్ గేర్ లాంటిది చేతులకు తొడుక్కోవాలని అధికారులు సూచిస్తున్నాకాగా రు. ఇలాంటి నత్తల్ని పంపిణీ చేయడం, విక్రయించడం, నౌకల్లో తరలించడం అమెరికాలో చట్ట విరుద్ధం.