హీరోయిన్గా కంటే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. నచ్చితే ఏ పాత్రనైనా చేయడానికి ముందుకొచ్చే ఈమె తనను ఒత్తిడికి దూరంగా ఉంచేదేంటో చెప్పుకొచ్చిందిలా.. ‘ప్రతి పాత్రని బాగా చేయాలంటే ఒత్తిడి అనివార్యం. మహానటి తర్వాత అది మరింత పెరిగింది. ఏమాత్రం ఆందోళనగా అనిపించినా నా పెంపుడు కుక్క నైక్తో ఆడతా. దాన్ని హత్తుకుంటే ఆందోళనంతా హుష్మని ఎగిరిపోతుంది. లేదూ దూరప్రయాణాలు చేస్తా. దేశం, విదేశంతో సంబంధం లేదు.. నచ్చిన చోటుకు ప్రయాణం కట్టేస్తా’ అని చెబుతోందీ మలయాళీ అమ్మాయి.