హార్రర్ కామెడీ సినిమా ‘ఫోన్ బూత్’తో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నది బాలీవుడ్ తార కత్రినా కైఫ్. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఫోన్ బూత్ చిత్రంలో తన క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఈ సందర్భంగా కత్రినా తెలిపింది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భయపెడుతూనే నవ్విస్తామని ఆమె చెప్పింది. కత్రినా ఈ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ 3’, విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రాల్లో నటిస్తున్నది.
భయపెడుతూనే నవ్విస్తా
