Movies

తన లవ్‌ మ్యారేజ్‌ గురించి ఓపెన్‌ అయిన ఇంద్రజ

తన లవ్‌ మ్యారేజ్‌ గురించి ఓపెన్‌ అయిన ఇంద్రజ

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది ఇంద్రజ. పలు సినిమాల్లో కథానాయికగా నటించి ప్రేక్షకులకు చేరువైన ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తాజాగా ఓ షోలో ఇంద్రజ తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌ అయింది.తనది ప్రేమ వివాహమని వెల్లడించింది. తన పెళ్లికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే వచ్చారంది. అంతేకాదు, ఈ పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా రూ.7500 మాత్రమేనని చెప్పుకొచ్చింది. కాగా మలయాళంలో హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకుంది. 2006లో నటుడు, బిజినెస్‌మెన్‌ మహమ్మద్‌ అబ్సర్‌ను పెళ్లాడింది. వీరికి కుమార్తె సారా ఉంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె ఇటీవలే ఇండస్ట్రీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. స్టాండప్‌ రాహుల్‌ సినిమాలో హీరో తల్లిగా నటించి అలరించిన ఆమె ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది.