DailyDose

మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా: రంగంలో స్వర్ణలత ఆగ్రహం

మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా: రంగంలో స్వర్ణలత ఆగ్రహం

తెలంగాణలో ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు(సోమవారం) సికింద్రాబాద్‌ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు.
Rangam-Swarnalatha-jpg1