* మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువ ఝామున ఖాలాఘాట్ దగ్గర అదుపు తప్పి ఓ ప్రయాణికుల బస్సు నర్మదా నదిలో పడిపోయింది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. సంఖ్యపై ఇంకా సరైన స్పష్టత రాలేదు.
*కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోటు చేసుకున్నది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
*కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దేశంలో తొలి మంకీపాక్స్ కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే. కొల్లాంకు చెందిన వ్యక్తి ఇటీవల షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం నిఘాను పెంచింది.
*స్నేహితులతో సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నది. సెల్ఫీ దిగుతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది. మృతురాలు తిరుపతి వాసి అయిన కట్టా వినీతగా గుర్తించారు. దాంతో తిరుపతిలో ఆమె నివాసం వద్ద విషాదం నెలకొన్నది.
*రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒకే ఇంజన్ ఉన్న పైపర్ పీఏ-45, సింగిల్ ఇంజిన్ సెస్నా 172 ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు తెలిపారు. పైపర్ పీఏ-45 విమానం లాస్ వేగాస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా సెస్నా 172 విమానాన్ని ఢీకొన్నది. దీంతో పైపర్ పీఏ-45 విమానం రన్‌వేకు కాస్త దూరంలో కూలిపోయింది. మరోవైపు సెస్నా విమానం సమీపంలోని నీటి కొలనులో పడింది.
*ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఆబ్కారీ, పోలీసులు జరిపిన ఏకకాల సోదాల్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు జిల్లాలో సాగిన సోదాల్లో దాదాపు మూడు వందల కిలోల వరకు ఉన్న గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి కేరళకు కారులో తరలిస్తున్న గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మంగళగిరి పోలీసులు అరెస్టు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
*మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి జిల్లాలో ఓ ఎస్యూవీ బ్రిడ్జి పైనుంచి నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పరాఠ్వాడా బైతుల్ రహదారిపై ఉన్న నింభోరా ఫాటా మలుపు వద్ద కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. భారీ వర్షాల వల్ల రహదారి సరిగా కనిపించకుండా ఉందని.. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బ్రిడ్జి నుంచి పక్కకు వెళ్లి ఉంటుందని పోలీసులు వివరించారు.
*గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత… సుమారు రెండు నుంచి ఐదు కిలోల దాకా గంజాయి దొరికిందని సమాచారం. ఇందులో బడా బాబు పిల్లలు ఉన్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*ల్లూరు జిల్లా కావలి శ్రీ చైతన్య స్కూల్ బస్ బోల్తా,చాలంచర్ల రోడ్డు వద్ద ప్రమాదం. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్ బోల్తా అంటున్న స్థానికులు,ఇద్దరు చిన్నారులకు గాయాలు.
*కురవి మండలం నేరడ శివారు మంచ్యా తండాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. తమ్ముడు వెంకన్న(45)పై అన్న బాలు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వెంకన్న అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
*నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ మండలం కిసాన్‌నగర్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారి పై ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని నిర్మల్ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైవేపై రోడ్డు ప్రమాదం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు.
*హైనా దాడిలో 14 గొర్రెలు మృతి చెందగా మరో 14 గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలు స్థానికుల కథనం ప్రకారం.. తాండ్ర గ్రామానికి చెందిన బి.మల్లయ్య కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో గొర్రెల పాక ఏర్పాటు చేసుకున్నాడు. రోజువారిగా గొర్రెలను పాకలో కట్టేసినట్లుగానే శనివారం రాత్రి సైతం గొర్రెల మందను ఉంచి వెళ్లాడు. గొర్రెల మందపై హైనాలు దాడి చేశాయి. ఈ దాడిలో 14 గొ ర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 గొర్రెలు తీ వ్రంగా గాయపడ్డాయి. గొర్రెల మందపై హైనా బీభత్సం సృ ష్టించడంతో కొన్ని గొర్రెలు ఇంటికి వచ్చాయి. దీంతో వెంటనే మల్లయ్య గొర్రెల మందకు వెళ్లాడు. చనిపోయిన గొర్రెలను చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పోలే సుశీల, ఈశ్వరయ్య, తహసీల్దార్ రాంరెడ్డి, ఫారెస్టు బీట్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. గొర్రెల మందపై హైనాలు దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
*ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు!
*నిజామాబాద్: జిల్లాలోని బాల్కొండ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కంటైనర్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
*ఐసీఎ్‌సఈ 10వ తరగతి ఫలితాల్లో 99.97% ఉత్తీర్ణత నమోదైంది. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో అబ్బాయిలు 99.97%, అమ్మాయిలు 99.98% మంది ఉత్తీర్ణులయ్యారు. 110 మంది విద్యార్థులు టాప్-3 ర్యాంకుల్లో నిలవడం విశేషం. 500 మార్కులకు 499 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు అనికా గుప్తా(కాన్పూర్), హర్గున్ కౌర్ (పుణె), పుష్కర్ త్రిపాఠి(బల్రామ్పూర్), కనిష్క మిట్టల్(లఖ్‌నవూ) జాతీ య స్థాయిలో మొదటి ర్యాంకు తెచ్చుకున్నారు.
*బంగ్లాదేశ్‌లో మరోమారు ఓ ఆలయం, హిందువుల ఇళ్లపై ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నరైల్ జిల్లా ఢిగోలియా గ్రామంలో ఓ ఆలయంపై ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారని, మైనారిటీలైన హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారని పోలీసు ఇన్స్పెక్టర్ హరన్ చంద్రపాల్ శనివారం వెల్లడించారు. ఫేస్బుక్లో ఓ హిందూ బాలుడు పెట్టిన పోస్టు ఇస్లామిస్టులను ఆగ్రహానికి గురిచేసిందన్నా రు. హిందువుల కుటుంబానికి చెందిన ఓ ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారని తెలిపారు.
*హైనా దాడిలో 14 గొర్రెలు మృతి చెందగా మరో 14 గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలు స్థానికుల కథనం ప్రకారం.. తాండ్ర గ్రామానికి చెందిన బి.మల్లయ్య కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో గొర్రెల పాక ఏర్పాటు చేసుకున్నాడు. రోజువారిగా గొర్రెలను పాకలో కట్టేసినట్లుగానే శనివారం రాత్రి సైతం గొర్రెల మందను ఉంచి వెళ్లాడు. గొర్రెల మందపై హైనాలు దాడి చేశాయి. ఈ దాడిలో 14 గొ ర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 గొర్రెలు తీ వ్రంగా గాయపడ్డాయి. గొర్రెల మందపై హైనా బీభత్సం సృ ష్టించడంతో కొన్ని గొర్రెలు ఇంటికి వచ్చాయి. దీంతో వెంటనే మల్లయ్య గొర్రెల మందకు వెళ్లాడు. చనిపోయిన గొర్రెలను చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పోలే సుశీల, ఈశ్వరయ్య, తహసీల్దార్ రాంరెడ్డి, ఫారెస్టు బీట్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. గొర్రెల మందపై హైనాలు దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
* బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లిలో ఆదివారం వేకువజామున మన్నవరపు రమణయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 50 వేలను చోరీ చేశారు. శనివారం రమణయ్య అదే గ్రామంలో ఉన్న కుమార్తె ఇంట్లో పడుకుని ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు పగులగొట్టి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. పరిశీలించగా అందులో రూ. 50వేలు చోరీ అయ్యాయని గుర్తించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వీరప్రతాప్ తెలిపారు. క్లూస్ టీం పరిశీలించి పలు వేలు ముద్రలు సేకరించింది.
*హైనా దాడిలో 14 గొర్రెలు మృతి చెందగా మరో 14 గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలు స్థానికుల కథనం ప్రకారం.. తాండ్ర గ్రామానికి చెందిన బి.మల్లయ్య కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో గొర్రెల పాక ఏర్పాటు చేసుకున్నాడు. రోజువారిగా గొర్రెలను పాకలో కట్టేసినట్లుగానే శనివారం రాత్రి సైతం గొర్రెల మందను ఉంచి వెళ్లాడు. గొర్రెల మందపై హైనాలు దాడి చేశాయి. ఈ దాడిలో 14 గొ ర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 గొర్రెలు తీ వ్రంగా గాయపడ్డాయి. గొర్రెల మందపై హైనా బీభత్సం సృ ష్టించడంతో కొన్ని గొర్రెలు ఇంటికి వచ్చాయి. దీంతో వెంటనే మల్లయ్య గొర్రెల మందకు వెళ్లాడు. చనిపోయిన గొర్రెలను చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పోలే సుశీల, ఈశ్వరయ్య, తహసీల్దార్ రాంరెడ్డి, ఫారెస్టు బీట్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. గొర్రెల మందపై హైనాలు దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
*ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతు తేలి శ్రీనివాస్(47) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న ఐదు ఎకరాలతోపాటు పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పులు తెచ్చి సోయా, పత్తి వేశారు. కాలం కలిసిరాక నష్టపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్.. బలవన్మరణానికి పాల్పడ్డారు.
*శ్రీసత్యసాయి: జిల్లాలోని పెనుకొండ శెట్టిపల్లితండాలో లలితాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక మద్యం అమ్ముతున్నారని ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెన్షన్ ఇవ్వడం లేదని గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకరనారాయణను లలితాబాయి నిలదీసింది. బైరాపురంలో సచివాలయ నిర్మాణ పనులకు లలితాబాయి వెళ్తుంది. సచివాలయం దగ్గర ఇసుకలో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు దొరికినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుకలో దాచి కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారని లలితాబాయిని అరెస్ట్ చేశారు. కొత్తచెరువు పీఎస్‌లో లలితాబాయిని పోలీసులు విచారిస్తున్నారు.
*నంద్యాల జిల్లా సంజామల మండలం ముదిగేడు గ్రామానికి చెందిన సాంబశివుడు(58) అనే కౌలు రైతు అప్పుల బాధ భరించలేక ఆదివారం ఆత్మహత్య చే సుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
*గూడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన నడుస్తున్నవ్యక్తులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మునియ్య , చెంచమ్మ లుగా గుర్తించారు. మద్యం మత్తులో మితి మీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని.. రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్అ తిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.