* దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్‌కు చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ జి.ఏడుకొండలు శివరామ్‌పై చీటింగ్ కేసును సోమవారం నమోదు చేశారు.
*మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ ఇద్దర్నీ మార్గమధ్యంలోనే అటకాయించి కత్తితో పొడిచి చంపాడు. సోమవారం రాత్రి భోపాల్‌లోని కైలాష్ నగర్ సెమ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*నల్గొండ: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అక్రమంగా ఉంచినట్లు పోలీసులకు సమాచారం రావడంతో చిట్యాల మండలం నేరేడ గ్రామ శివారులోని ఓ గోదాంలో పోలీస్, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ తనిఖీల్లో నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
*రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్ సైదులు(38)వారం రోజులుగా కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థతి విషమించడంతో సోమవారం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి చెందిన శరత్‌కుమార్(21)హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఇండియానాపొలిస్ పట్టణంలోని గ్రీన్వుడ్పార్క్ మాల్లో ఓ దుండగుడు జరిపి న కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. 12 ఏళ్ల పాప సహా ఇద్దరు గాయ పడ్డారు. మాల్లోనే ఉన్న 22 ఏళ్ల యువకుడు తన లైసెన్స్డ్ తుపాకీతో దుండగుడిని కాల్చి చంపేశాడు. దీంతో అతడు హీరోగా మారిపోయాడు. దక్షిణ స్పెయిన్‌లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఒక వ్యక్తిని కత్తితో తీవ్రంగా పొడిచారు.
*అతివేగం, నిర్లక్ష్యం వల్ల సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గమ్యం త్వరగా చేరాలనే ఆత్రుతతో ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో చేసిన ప్రయాణం ఐదుగురిని బలితీసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామం వద్ద 161వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న ఆటో రాంగ్రూట్లో ప్రయాణిస్తుండగా.. మేనూరు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంలో ఆటో ఆ లారీ కిందికి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతి చెందిన వారిలో మేనూరు గ్రామానికి చెందిన కృష్ణ (18), మహారాష్ట్రలోని బామిని గ్రామానికి చెందిన మహాజన్ భుజంగ్ (35), నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బొలిశెట్టి లింబన్న(46)ను గుర్తించారు.
*రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్ సైదులు(38)వారం రోజులుగా కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థతి విషమించడంతో సోమవారం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి చెందిన శరత్‌కుమార్(21)హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*అత్యాచారం, హత్యాయత్నం కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ హయత్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం నాగేశ్వరరావును పదిరోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు.. నాగేశ్వరరావును ఈ నెల 22 వరకు అంటే ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వనస్థలిపురం పోలీసులు నాగేశ్వరరావును సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి జైల్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి, ఎల్బీనగర్ ఎస్వోటీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణలు నాగేశ్వరరావును విచారించినట్లు తెలిసింది. ఎక్కువ సమయం లేకపోవడంతో ఒక గంట మాత్రమే నాగేశ్వరరావును విచారించారు.
*గాజువాక.అర్దరాత్రి షీలానగర్ లో దారుణం హత్య.నామాల సురేష్ (38) ను రాడ్ తో కొట్టి హత్యచేసిన అఖిలేష్.
పరారీలో నిందితుడు.వివాహేతర సంబంధమే హత్యకు కారణం అని సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాజువాక ఏరియా ఆసుపత్రికి తరలింపు.
ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*ఏలూరు జాతీయ రహదారి దుగ్గిరాల బైపాస్ పై రోడ్డు ప్రమాదం.ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొన్న లారీ.ఏలూరు ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అధినేత కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు సోదరుడు షేక్ బాజుద్దీన్ (చిన్ని) గా గుర్తించిన పోలీసులు.తీవ్ర గాయాలతో ఉన్న బాజుద్దీన్ (చిన్ని) ను 108 అంబులెన్స్‌లో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.తీవ్ర గాయాలతో ఉన్న బాజుద్దీన్ మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి తరలింపు..ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది.
*సైబరాబాద్‌లో భారీ స్థాయిలో గంజాయి, కొకైన్‌ను పట్టుకున్నారు. పోలీసులు 1,982 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఏపీ, ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. 18 కేసుల్లో 61 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
*నూజివీడు పట్టణ పరిధిలో కొనంగుట రోడ్ లో బిస్ స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని మంగళవారం వేగంగా వచ్చిన సత్తుపల్లి డిపో బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ఎస్ ఐ లు ఎం లక్ష్మణ్, వెంకటేష్, లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
*దేశ రాజధాని ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మద్యాహ్నం నాలుగంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడటంతో స్ధానికుల్లో భయాందోళన నెలకొంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.
*ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. మిన్యా ప్రావిన్స్‌లోని మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.