అమెరికాలోని టీడీపీ ఎన్నారై విభాగం సమర్థంగా పని చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు కితాబిచ్చారు. మొదటినుంచీ ప్రవాసాంధ్రులు టీడీపీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. ఎన్నారై టీడీపీ యూఎ్‌సఏ ప్రతినిధి బృందం మంగళవారం పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. ఎన్నారై యూఎ్‌సఏ సమన్వయకర్త జయరామ్ కోమటి ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలో మహానాడు నిర్వహణకు సమకూరిన నిధుల్లో కార్యక్రమానికి ఖర్చు చేయగా మిగిలిన రూ.కోటిని చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ బృందంలో రామకృష్ణ గుల్లపల్లి, కృష్ణ గొంప, రాజా సూరపనేని, మోహన్‌కృష్ణ మన్నవ, వెంకట్ కోగంటి, భాస్కర్ అన్నే, శ్రీను గుల్లపల్లి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీకి ఎన్నారై విభాగం కోటి విరాళం
