టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా.. అత్యంత ఆకర్షణీయ భారతీయ సంస్థగా నిలిచింది. ఈ ఏడాదికిగాను రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ చేపట్టిన సర్వేలో అత్యధిక ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌పైనే మక్కువ కనబరిచారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండో స్థానంలో, అమెజాన్ ఇండియా మూడో స్థానంలో ఉన్నట్టు గురువారం విడుదల చేసిన నివేదికలో రాండ్‌స్టడ్ స్పష్టం చేసింది. సర్వే ప్రకారం.. ఆర్థికంగా, కీర్తి-ప్రతిష్ఠల్లో, జీతభత్యాల్లో మైక్రోసాఫ్టే మేటి. ఈ టాప్-3 ఎంప్లాయీ వాల్యూ ప్రపోజిషన్ సూచికల్లో సంస్థకే అత్యధిక స్కోర్ వచ్చింది. ఈ జనవరి-మార్చి మధ్య ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో సాగిన ఈ సర్వేలో 5,944 సంస్థల్లోని 18-65 ఏండ్ల వయసున్న 1.63 లక్షల మందికిపైగా అభిప్రాయాలను సేకరించారు.
సర్వే ముఖ్యాంశాలు
ప్రతీ 10 మంది భారతీయ ఉద్యోగుల్లో 9 మందికి శిక్షణ, వ్యక్తిగత కెరీర్లే ముఖ్యం
నిరుడు ద్వితీయార్ధంలో 24 శాతం మంది భారతీయ ఉద్యోగులు సంస్థల్ని మార్చేశారు
ప్రతీ ముగ్గురిలో ఒక్కరు ఈ ఏడాది ప్రథమార్ధంలో కొత్త సంస్థకు మారాలనుకున్నారు
దేశంలో 63 శాతం ఉద్యోగుల తొలి ప్రాధాన్యత పని-వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తే
జీతాలు, ప్రయోజనాలు, సంస్థ గుర్తింపు తర్వాతి ప్రాధాన్యతాంశాలు
దేశంలో టాప్-10 అత్యంత ఆకర్షణీయ సంస్థలు ర్యాంక్ సంస్థ
మైక్రోసాఫ్ట్ ఇండియా
మెర్సిడెస్ బెంజ్ ఇండియా
అమెజాన్ ఇండియా
హెచ్‌పీ ఇండియా
ఇన్ఫోసిస్
విప్రో
టీసీఎస్
టాటా స్టీల్
టాటా పవర్
సామ్సంగ్ ఇండియా