NRI-NRT

బ్రిట‌న్ ప్ర‌ధాని అయ్యే ఛాన్సెస్ ఉన్న ఈమె గురించి మీకు తెలుసా!

బ్రిట‌న్ ప్ర‌ధాని అయ్యే ఛాన్సెస్ ఉన్న ఈమె గురించి మీకు తెలుసా!

బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్న నేపథ్యంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించే ఆస్కారం ఉన్నవారిలో భారత మూలాలున్న బ్రిటన్‌ ఆర్థిక శాఖ మంత్రి రుషి సునాక్‌ పేరు బలంగా వినిపిస్తున్నది. ఎంపిక చివరి దశలో కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి ఆయనకు గట్టి పోటీగా నిలిచారు లిజ్‌ ట్రస్‌. ప్రస్తుతం ఆమె విదేశాంగ శాఖ సెక్రటరీగా ఉన్నారు. ఆహార్యంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ను అనుకరిస్తారు ట్రస్‌. దీంతో ఆమెను ‘మార్గరెట్‌ థాచర్‌ 2.0’ అని పిలుస్తున్నారు.ఆక్స్‌ఫర్డ్‌ నుంచి పొలిటికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ, ఎకనమిక్స్‌ ప్రధాన అంశాలుగా పట్టా పుచ్చుకున్న లిజ్‌ 1996 నుంచి కన్జర్వేటివ్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగానూ ఉన్నారు. పెన్షన్లు, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతలకు సంబంధించి అక్కడి వ్యాపారులు, ఉద్యోగులు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కింద తమ ఆదాయం మీద పన్ను కడతారు. ప్రభుత్వం ఈ ఏడాది దాన్ని పెంచింది. తాను ప్రధాని అయిన వెంటనే పన్ను భారాన్ని తగ్గిస్తానని చెబుతున్నారు లిజ్‌. ఒక వేళ ఈ పరుగులో నెగ్గితే.. బ్రిటన్‌ మూడో మహిళా ప్రధాని అవుతారామె.