DailyDose

జీపీఎఫ్ సొమ్మును ఎప్పటిలోగా జమ చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు – TNI తాజా వార్తలు

జీపీఎఫ్ సొమ్మును ఎప్పటిలోగా జమ చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు – TNI  తాజా వార్తలు

* ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌లో నుంచి డ్రా చేసిన జీపీఎఫ్ సొమ్ము ను ఎప్పటిలోగా జమ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.దీనికి సంబంధించి ఆగస్టు 3వతేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పీఆర్సీ పై కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా ఉద్యోగుల అకౌంట్లో నుంచి ప్రభుత్వం జీపీఎఫ్ సొమ్మును డ్రా చేసిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. డ్రా చేసిన సొమ్మును ఉద్యోగుల అకౌంట్‌లో ఎప్పటిలోగా జమ అవుతుందో కౌంటర్ వెయ్యాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

*ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమానాలు నిలిచి పోతున్నాయి.తాజాగా బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం పాట్నా విమానాశ్రయంలో నిలిచిపోయింది.బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన 6ఈ2126 నంబరు గల ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో విమానాన్ని నిలిపివేశారు. ఇండిగో విమాన సర్వీసును రద్దు చేసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.ఈ ఘటన గురువారం అర్థరాత్రి పాట్నా విమానాశ్రయంలో జరిగింది. విమానంలో బాంబు ఉందని చెప్పడంతో ఆ విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు.విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడు రిషి చంద్ సింగ్‌గా గుర్తించారు.

*కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 10.960 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,15,140 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 44,480 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.23 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.16 టీఎంసీలుగా కొనసాగుతోంది.

*కిస్సింగ్ గేమ్‌లో పాల్గొన్న 8 మంది విద్యార్థుల‌ను మంగుళూరు పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థులు సెయింట్ అలియోసిస్ కాలేజీకి చెందిన‌ట్లు గుర్తించారు. వారిని జువెనైల్ కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి కిస్ చేసిన వీడియోను ఆర్నెళ్ల క్రితం తీశారు. అయితే త‌న‌పై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు ఆ అమ్మాయి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ఇద్ద‌రు అమ్మాయిలు మాత్ర‌మే క‌నిపించారు. మంగుళూరులోని లైట్ హౌజ్ హిల్ రోడ్డులో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆ వీడియో తీశారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న అబ్బాయితో త‌న‌కు అఫైర్ ఉంద‌న్న విష‌యం అబ్బాయిల‌కు తెలుసు అని, కానీ కిస్సింగ్ వీడియో త‌ర్వాత త‌న‌ను ఆ అబ్బాయిలు బ్లాక్ మెయిల్ చేశార‌ని ఆమె ఆరోపించింది.

*జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపారు.‘స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది. తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొంది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది’ పేర్కొన్నారు.

* ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకుకేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది.

*దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఫండ్ సంస్థ హెచ్డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస‌ర్ ప్ర‌శాంత్ జైన్ శుక్ర‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈక్విటీ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఆయ‌న చాలా సీనియ‌ర్‌. భార‌త మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మకు పునాదులేసిన వారిలో ప్ర‌శాంత్ జైన్ ఒక‌రు. హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో రూ.4.21 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఈక్విటీ ఫండ్లు నిర్వ‌హిస్తున్నారు. మ్యూచువ‌ల్ ఫండ్ మేనేజ‌ర్‌గా 28 ఏండ్ల పాటు కొన‌సాగిన ఏకైక వ్య‌క్తిగా నిలిచారు.

*రాజమండ్రి జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. సావిత్రినగర్, రామకృష్ణనగర్ ముంపులో ఉన్నా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రజల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ లంక గ్రామాల తరహాలో రాజమండ్రిలో ముంపు ఏర్పడిందన్నారు. వర్షాకాలం ఇంకా రెండు నెలలు ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే రాజమండ్రిలో లోతట్టు ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వందేళ్ల నాటి డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూడాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు

*రాష్ట్ర హైకోర్టుకు ఐదుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొల్జియం సభలో తీర్మానించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకపు ప్రక్రియను చేపట్టిన కొల్జియం రాష్ట్రానికి ఐదుగురిని ఖరా రు చేసింది. ఈనెల 19న ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సారథ్యంలో సభ జరిగింది. రాష్ట్రానికి ఎంపికైన జడ్జిలలో అనిల్‌ భీమశేన కట్టి, గురుసిద్దయ్య బసవరాజ, చంద్రశేఖర్‌ మృ త్యుంజయ జోషి, ఉమేష్‌ మంజునాథ భట్టె ఆడిగ, తల్కాడ గిరిగౌడ శివంక్రేగౌడలు ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి ఈనెల 2న పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సతీష్‏చంద్ర శర్మా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ ఛీఫ్‌ జస్టిస్‌ నియామకపు అంశంపైనా కొల్జియం సభలో చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ఇప్పటిదాకా ఎవరినీ ఖరారు చేయలేదు.

*రాజమండ్రి జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. సావిత్రినగర్, రామకృష్ణనగర్ ముంపులో ఉన్నా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రజల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ లంక గ్రామాల తరహాలో రాజమండ్రిలో ముంపు ఏర్పడిందన్నారు. వర్షాకాలం ఇంకా రెండు నెలలు ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే రాజమండ్రిలో లోతట్టు ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వందేళ్ల నాటి డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూడాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 71,437 మంది దర్శించుకోగా 31,315 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు వచ్చిందని వివరించారు

*చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ వశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్‌(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కాశీలో అర్చకత్వం చేసి నేపాల్‌ నుంచి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన శ్రీ స్వరూపానందగిరి ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీవశిష్ట ఆశ్రమంలో ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్చకుడు ఆత్మహత్యకు గల కారణాలపై చంద్రగిరి పోలీసులు విచారణ జరుపుతున్నారు

*లంక ప్ర‌ధానిగా దినేశ్ గుణ‌వ‌ర్ధ‌నే ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ దేశ 15వ ప్ర‌ధానిగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధానిగా ఉన్న రాణిల్ విక్ర‌మ‌సింఘే .. ఆ దేశ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో.. దినేశ్ గుణ‌వ‌ర్ణ‌నేకు ఆ ఛాన్సు వ‌చ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక‌లో కొన్నాళ్లుగా రాజ‌కీయ అనిశ్చిత నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశాన్ని విడిచి సింగ‌పూర్‌కు పారిపోవ‌డంతో.. అక్క‌డ రాజ‌కీయాలు తారుమార‌య్యాయి. సంక్షోభాన్ని త‌ట్టుకోలేక‌పోయిన ప్ర‌జ‌లు దేశ‌వ్యాప్తంగా భారీ నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

*ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ప్రాజెక్టుకు 1,52,396 క్యూసెక్కుల నీరు వస్తుండగా 51,164 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రేపు ఆనకట్ట గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

*ఏపీలో నూతన బార్ల కేటాయింపునకు ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. నూతన బార్ల విధానంలో రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ లైసెన్సులు మంజూరు చేయనుంది. వాటిని ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 27 వరకు దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025, ఆగస్టు 31 వరకు మూడేళ్లకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయనుంది. దరఖాస్తుల నమోదు, ఫీజుల చెల్లింపు, జిల్లాల వారీగా ఈ-వేలం, ఇందులో పాల్గొనేవారి అర్హతలను పేర్కొంటూ నోటిఫికేషన్‌ జారీచేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు, నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. దరఖాస్తుల సమర్పణ, ఈ-వేలం నిర్వహణకు జోన్ల వారీగా తేదీలను నిర్ణయించారు.

*నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో కొట్టుకుపోతున్న 350 ఆవులను గ్రామస్థులు రక్షించారు. వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన 500 ఆవులను సమీప అడవిపందులు వెంటపడి తరిమాయి. దీంతో ఆవులన్ని వెలుగోడు జలాశయంలో దిగాయి. నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకు పోతుండగా గమనించిన గ్రామస్థులు 350 ఆవులను రక్షించారు. మరో 150 ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

*తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షియర్ జోన్ ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

* బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ విలీనం ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కేంద్రమంత్రి చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఈ రెండు ప్రభుత్వసంస్థలను విలీనం చేసే ప్రతిపాదనకు.. 2019లో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. ఎంటీఎన్‌ఎల్‌ భారీగా రుణాల ఊబిలో కూరుకుపోయిందని, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థికపరిస్థితి ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. ఎంటీఎన్‌ఎల్‌ 2016 నుంచి వరుసగా ప్రతి ఏటా నష్టాలు వచ్చాయని చౌహాన్‌ తెలిపారు. ఎంటీఎన్‌ఎల్‌ రుణ భారం నుంచి కుదుటపడే వరకు విలీనం ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎంటీఎన్‌ఎల్‌ను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని చౌహాన్‌ స్పష్టం చేశారు.

*సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రమాదానికి ముందే విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టడం అనుమానం కలిగిస్తోందని అన్నారు. సంఘటన జరగబోతుందని.. ఆ సంఘటనకు తమరు బలవుతారని ఏ విధంగా అన్నారని ప్రశ్నించారు. ‘‘ఆ ఘోరం జరుగుతుందని ముందే ఊహించారా.. లేక ఉద్దేశ్య పూర్వకంగా మీరే చేయించారా’’ అని అన్నారు. కర్మపాపం ఏదైనా ఉందంటే పాపులకు లేదా జగన్‌కు కర్మపాపం ఉంటుందన్నారు. అలిపిరి తరువాత చంద్రబాబుకు రెండో ఘటన జరిగిందని.. దేవుడు ఆయన పక్షాన ఉన్నారని ఆయన తెలిపారు. విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకి ఏమి కాదని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి మొరగడం మానేసి వరద బాధితులకు ఏవిధంగా సహాయం చేయాలో ఆలోచిస్తే మంచిదని హితవుపలికారు. ఆఖరిగా చంద్రబాబును, టీడీపీ నేతలను అంతమొందించే కుట్ర అస్త్రాలు సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు చంద్రబాబుని ఏమి చేయలేరని జవహర్ స్పష్టం చేశారు.

*రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వరద ప్రభావం ఉందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… వరద బాధితుల్లో ఇప్పటి వరకు 95 వేల మందికి ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. వరదల్లో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి రూ.41 కోట్లు విడుదల చేశారన్నారు. వరదల వల్ల కోనసీమ జిల్లాలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం పడవలపై వెళ్ళారన్నారు. టీడీపీపై టీడీపీకి చెందిన నేతలు అచ్చెన్నాయుడు, దివ్యవాణి, కేశినేని నానిలే ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు చేశారు.

* ఏపీ(AP)లో శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయని టీడీపీ నేత పట్టాభి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక కార్యదర్శులు ఇదే చెబుతున్నాయని తెలిపారు. వైసీపీ నాయకుడిలా దువ్వూరి కృష్ణ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని పట్టాభి వ్యాఖ్యలు చేశారు.
* నల్ల బెల్లంతో నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నాటుసారా తాగి మరణిస్తే సంబంధిత వ్యక్తులే ఆ పర్యవసానాలు అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జప్తు చేసిన నల్ల బెల్లాన్ని తక్షణం విడుదల చేయాలని అధికారులకు తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు గురువారం ఆదేశాలిచ్చారు. తనకు చెందిన 25,250 కేజీల నల్ల బెల్లాన్ని పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వ్యాపారి వాసిరెడ్డి గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరంగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్నారు.వ్యాపారి నుంచి జప్తు చేసిన 25,250 కేజీల నల్లబెల్లాన్ని విడుదల చేయాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అధికారులను ఆదేశించారు. బెల్లం విలువ మేరకు పూచికత్తు సమర్పించాలని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ తరఫున ప్రభుత్వ న్యాయవాది టి.కిరణ్‌ చేసిన వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది…!!

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2,35,617 పెండింగ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 42,374 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నాటికి రాష్ట్ర హైకోర్టులో 37న్యాయమూర్తుల పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని, 13 ఖాళీలు ఉన్నాయని వివరించారు. కొత్తగా న్యాయమూర్తుల నియామకానికి హైకోర్టు కొలీజియం నుంచి 8 సిఫారసులు వచ్చాయని, అవి ఆయా దశల ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు…!!

*బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పాలనపై మరోసారి ధ్వజమెత్తారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే బాసర క్షేత్రం సమస్యలకు కొలువైందన్నారు. ఎన్నికల సమయంలో బాసర ఆలయ రూపురేఖలు మారుస్తానన్న కేసీఆర్.. భక్తులు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

* ఒక్క కేసులో వాదనలు వినిపించేందుకు ఎన్నిసార్లు వాయిదా తీసుకుంటారని హైకోర్టు గురువారం రెవెన్యూశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూశాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు రూ.10వేలు జరిమానా విధించింది. ఓ రెవెన్యూ వివాదంలో జనప్రియ ఇంజినీర్స్‌ సిండికేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుకూలంగా 2017లో ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రెవెన్యూశాఖ కార్యదర్శి, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌, చేవెళ్ల స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, శేరిలింగంపల్లి తహసీల్దార్‌లు డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు వాయిదా తీసుకుంది. ఆపై చివరి అవకాశంగా విచారణను హైకోర్టు జూలై 21కి వాయిదా వేసింది. గురువారం ప్రభుత్వం తరఫు న్యాయవాది మళ్లీ వాయిదా కోరారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. రెవెన్యూ కార్యదర్శికి రూ.10వేలు జరిమానా విధించింది. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

* తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్టు చేయాలని సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. నిర్ణీత గడువులోగా రిపోర్టు చేయకుంటే విద్యార్థులకు కేటాయించిన సీటును రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గురువారం ముగిసిన ప్రవేశ గడువును ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 1800 425 45678కు ఫోన్‌ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చని రోనాల్డ్‌ రాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

*రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ముఖ్యంగా వరద ప్రభావిత, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి జిల్లా వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాధుల లక్షణాలున్నవారికి వెంటనే పరీక్ష నిర్వహించి, చికిత్స అందించాలని నిర్దేశించారు.

* పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నియమించింది. కృష్ణా-గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌(కేజీబీవో)లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేవీకే కుచేల్‌, సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ మాజేటి రవికి పీపీఏ హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది.

*శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలుపుదల చేయించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి చైర్మన్‌కి ఏపీ ఈఎన్‌సీ(జనరల్‌) సీ.నారాయణరెడ్డి లేఖ రాశారు. 1996 జూన్‌ 15న విడుదల చేసిన జీవోనెం.69లోని ఆపరేషన్‌ రూల్స్‌ ప్రకారం తాగు, సాగునీటి అవసరాల కోసమే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా.. అనుమతి లేకుండా తెలంగాణ ప్రవర్తిస్తోందని ఆక్షేపించారు. అనుమతి లేకుండా విద్యుదుత్పత్తికి వాడిన నీటిని తెలంగాణ ఖాతాలో వేయాలని కోరారు.

*తెలంగాణ ప్రజలు భారీ వర్షాలు, వరదలో కష్టాలు పడుతుంటే.. కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధులు(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఎన్డీఆర్‌ఎ్‌ఫకు, ఎస్డీఆర్‌ఎ్‌ఫ(రాష్ట్ర విపత్తు సహాయ నిధి)కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

*కొనకనమిట్ల : మండలంలోని కాట్రగుంట, మునగపాడు, నాగరాజుకుంట గ్రామా లలో గురువారం సచివాలయాలను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రారంభించారు. నాగ రాజుకుంటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న సంకత్పంతో సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు ఏడుకొండలు, ఎంపీడీవో జనార్దన్‌, వైసీపీ మండల కన్వీనర్‌ మోరా శంకర్‌రెడ్డి, నాయకులు ఉడుముల గురవారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటరెడ్డి, జెన్నీఫా, రేగడపల్లి సొసైటీ అధ్యక్షుడు కామసాని వెంకటేశ్వరెడ్డి, ఎంపీ టీసీలు ఉడుముల ధనలక్ష్మి, భారతి, కల్లం సుబ్బమ్మ, వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

*అర్హులైన వారందరికీ నవరత్నాల పథకాలు వస్తాయని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక 31వ వార్డులో గురువారం గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

*తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.గురువారం నాడు బండి సంజయ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రూ. 800 కోట్లతో ప్రగతి భవన్ ను కట్టుకుని జల్సాలు చేస్తున్నావని కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేబినెట్ లో తెలంగాణ ద్రోహులే ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కెసిఆర్ రోడ్డున పడేశారని బండి సంజయ్ విమర్శించారు.

*వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. పీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

*ప్రయాణికుల రద్దీ దృష్టా సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌, రామేశ్వరం-సికింద్రాబాద్‌ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌-అగర్తల మధ్య ఆగస్టు 15,22,29, సెప్టెంబరు 5,12,19,26 తేదీల్లో ప్రత్యేక రైలు(07030)ను నడుపుతున్నట్టు వివరించారు. అగర్తల-సికింద్రాబాద్‌ మధ్య ఆగస్టు 19,26, సెప్టెంబరు 2,9,16,23,30తేదీల్లో ప్రత్యేక రైళ్లు(07029) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సికింద్రాబాద్‌- రామేశ్వరం మధ్య ఆగస్టు 24,31, సెప్టెంబరు 7,14,21,28 అక్టోబర్‌ 5,12,19,26, నవంబర్‌ 2,9,16,23,30 డిసెంబర్‌ 7,14,21,28తేదీల్లో ప్రత్యేకరైలు(07685) నడుస్తుందన్నారు. రామేశ్వరం- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేకరైలు (07686) ఆగస్టు 26, సెప్టెంబరు 2,9,16,23,30, అక్టోబర్‌ 7,14,21,28 తేదీల్లో, నవంబర్‌ 4,11,18,25, డిసెంబర్‌ 2,9,16,23,30 తేదీల్లో నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

*సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో యూపీ మంత్రి దినేష్ ఖటిక్ సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ జలశక్తి శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత, దినేష్ ఖటిక్ గురువారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. తాను పదవిలో కొనసాగుతానని సీఎంకు చెప్పారు. తన సమస్యలేవైనా వాటిని సీఎం దృష్టికి తెచ్చానని, వాటిని సీఎం పరిష్కరిస్తారని చెప్పారని మంత్రి తెలిపారు. దళితుడైన తనను అధికారులు పట్టించుకోలేదని ఖాటిక్ ఆరోపించారు.

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 7న అంకురార్పణ సందర్భంగా సహస్రదీపాలంకార సేవ, 9న అష్టదళ పాదపద్మారాధనతో పాటు 8 నుంచి పదో తేదీవరకు కల్యాణోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్‌ సేవలను రద్దు చేశారు.

* 2018-19లో జరిగిన ఎమ్మెల్యే గ్రాంట్‌ పనుల్లో చిన్న లోపాలపై మూడేళ్ల తర్వాత విజిలెన్స్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా ఇంజనీర్లను వేధిస్తున్నారని పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల జేఏసీ నేతలు మంత్రులకు గురువారం విజ్ఞప్తిచేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, గతంలో ఈ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రితో చర్చించి పంచాయతీరాజ్‌ ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇంజనీర్లపై చర్యలు తీసుకోవడం నిలిపేయాలని విజ్ఞప్తిచేశారు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2,35,617 పెండింగ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 42,374 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నాటికి రాష్ట్ర హైకోర్టులో 37న్యాయమూర్తుల పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని, 13 ఖాళీలు ఉన్నాయని వివరించారు. కొత్తగా న్యాయమూర్తుల నియామకానికి హైకోర్టు కొలీజియం నుంచి 8 సిఫారసులు వచ్చాయని, అవి ఆయా దశల ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు.

*నల్ల బెల్లంతో నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నాటుసారా తాగి మరణిస్తే సంబంధిత వ్యక్తులే ఆ పర్యవసానాలు అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జప్తు చేసిన నల్ల బెల్లాన్ని తక్షణం విడుదల చేయాలని అధికారులకు తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు గురువారం ఆదేశాలిచ్చారు. తనకు చెందిన 25,250 కేజీల నల్ల బెల్లాన్ని పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వ్యాపారి వాసిరెడ్డి గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరంగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్నారు.

*ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించిన సీఏ ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులు ఎం.అభినయ్‌ జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు, కె.మోహన్‌ 29, పి.పూజితారెడ్డి 32, ఎస్‌.నిఖిల్‌జైన్‌ 35, కె.దుర్గాయశ్వంత్‌ 44 ర్యాంకులు సాఽధించారని వెల్లడించారు. విద్యార్థులను అధ్యాపకులు, మాస్టర్‌మైండ్స్‌ డైరెక్టర్స్‌ మోహన్‌ తదితరులు అభినందించారు.

*‘ఒక్క బటన్‌ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లు జమ చేసింది. దేశంలో మరెక్కడా ఈ తరహా డీబీటీ విధానం లేదు’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన… ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంతగా ప్రయత్నాలు చేయలేదు. ఎస్‌డీజీ కోసం మనం ఎంత బాగా చేస్తున్నా సమర్థ రిపోర్టింగ్‌ కూడా అవసరమే. రిపోర్టింగ్‌ మానిటరింగ్‌ సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పని చేసినా లాభం లేదు. మరే రాష్ట్రంలో ఇన్ని పథకాలు లేవు. తొలిసారిగా మనం చేస్తున్నాం. జిల్లాల్లో కలెక్టర్లు ఎస్‌డీజీ రిపోర్టును మానిటరింగ్‌ చేసే బాధ్యత తీసుకోవాలి. విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ’’ అని అన్నారు. విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీ హబ్‌ను నిర్మించాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

*ఎక్సైజ్‌ శాఖ చీప్‌ లిక్కర్‌ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. ఒక్కో షాపులో రోజుకు 4 కేసుల లిక్కర్‌ మాత్రమే విక్రయించాలని షాపుల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీఅయ్యాయి. క్వార్టర్‌ రూ.120, రూ.130 విలువగల బ్రాండ్ల మద్యాన్ని ఉదయం ఒక కేసు, మద్యాహ్నం ఒక కేసు, సాయంత్రం రెండు కేసులు అమ్మాలని స్పష్టంచేశారు. ఈ మేరకు జిల్లాల్లో అధికారిక వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పెట్టారు. రూ.140 నుంచి పైన ఉండే మద్యంపై ఎలాంటి ఆంక్షలు లేవని అందులో తెలియజేశారు. కాగా దీనిపై బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేషన్‌ నుంచి అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. జిల్లాల్లో ఇలాంటి ఆదేశాలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

*వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,20,000 కోట్లని, ఈ మూడేళ్లలో రూ.1,65,000 కోట్లు డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) చేశామని, ఇంకో రూ.10,000 కోట్లతో పేదల కోసం ఇళ్ల స్థలాలు కొన్నామని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం సచివాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. 2019లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2.60 లక్షల కోట్లు ఉందని, అందులో దాదాపు రూ.లక్ష కోట్ల వరకు విభజన సమయంలో ఏపీ కింద వచ్చిన అప్పు ఉందని కృష్ణ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.80 లక్షల కోట్లకు పెరిగిందని, అయితే, మీడియాలో రూ.4.13 లక్షల కోట్లుగా రాస్తున్నారని, అది తప్పని చెప్పారు.

*జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె.. శతాధిక వృద్ధురాలయిన ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్వగృహంలో గురువారం ఆమె తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్న సమయంలో అస్వస్థతగా అనిపించడంతో తనతో పాటు ఇంట్లోనే ఉన్న కుమారుడు నరసింహానికి తాను చనిపోతున్నానంటూ చెప్పారు. అయితే నీకేం కాదంటూ నరసింహం ఆమెకు ధైర్యం చెప్పారు. రాత్రి 8గంటల సమయంలో ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుమారుడు వైద్యునికి ఫోన్‌ చేయగా ఆయన పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు.

*వరద సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ జీ మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖిక సమాధానమిచ్చారు. భారీవర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తమకు అవగాహన ఉందని తెలిపారు. వరద నివారణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సహకారం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుందన్నారు.

* ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడికి చోటు లభించింది. 32వ స్థానంలో నిలిచారు. యైటింక్లైన్‌కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌టట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్‌ 2011లో ‘తెలుగు టెక్‌టట్స్‌’ పేరిట ఛానల్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, వివిధ కంపెనీలకు చెందిన కొత్త ఫోన్ల అన్‌బాక్సింగ్‌, కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ప్రస్తుతం 16 లక్షల సబ్‌స్క్రైబర్లను చేరుకున్న హఫీజ్‌ యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఆయన వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్‌ తన మ్యాగజైన్‌లో పేర్కొంది. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన హఫీజ్‌ ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్‌ ద్వారా ఆకట్టుకుంటున్నారు. అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న హఫీజ్‌కు ‘డిజిటల్‌ స్టార్స్‌’లో 32వ స్థానం దక్కడంపై గోదావరిఖనిలో హర్షం వ్యక్తమవుతోంది.

*ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రం చేస్తున్న అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయని ఎక్కడా కూడా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అంతా బాగుందని ఏపీ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.

*దేశంలో మూడ‌వ మంకీపాక్స్ కేసు న‌మోదు అయ్యింది. కేర‌ళ‌లో 35 ఏళ్ల వ్య‌క్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన‌ యూఏఈ నుంచి మ‌ల్ల‌పురం వ‌చ్చిన వ్య‌క్తిలో మంకీపాక్స్‌ను గుర్తించారు. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న అత‌న్ని మాన్‌జెర్రీ మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. 13వ తేదీన హాస్పిట‌ల్‌లో చేరిన ఆ వ్య‌క్తిలో 15వ తేదీ నుంచి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ట్లు కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ వ్య‌క్తితో స‌న్నితంగా ఉన్న‌వారిని, కుటుంబ‌స‌భ్యుల్ని అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టిన‌ట్లు మంత్రి చెప్పారు.

*సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాల‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 వాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది. 10వ త‌ర‌గ‌తిలో అమ్మాయిలు 95.21 శాతం పాస‌య్యారు. అబ్బాయిలు 93.80 శాతం పాసైన‌ట్లు బోర్డు తెలిపింది. సుమారు 64,908 మంది విద్యార్థులు 95 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 2.36 ల‌క్ష‌ల మంది విద్యార్థులు 90 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 1,07,689 మంది విద్యార్థులు కాంపార్ట్‌మెంట్‌లో ఉండిపోయారు.

*భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. భారీ వర్షాల కారణంగా గత శుక్రవారం 15న గోదావరి మహోగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరి నీటిమట్టం 71.3 అడుగుల చేరింది. కాగా… వారం రోజుల తరువాత ఈరోజు గోదవారి సాధారణంగా ప్రవాహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 42.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం డివిజన్ ఇప్పుడిప్పుడే జలదిగ్బంధం నుంచి తేరుకుంటోంది. భద్రాచలం నుంచి గత మూడు రోజులుగా దుమ్ముగూడెం చర్లవైపు రాకపోకలు సాగుతున్నాయి. నిన్నటి నుంచి భద్రాచలం టూ ఆంధ్రాకు వెళ్లే కూనవరం ప్రధాన రహదారిపై పాక్షికంగా రాకపోకలు జరుగుతున్నాయి. కాగా… బురద మట్టి పేరుకు పోవడంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారం రోజుల తరువాత భద్రాచలం వద్ద గోదావరి సాధారణ ప్రవాహం ఉండటంతో ముంపు బాధితులు ఊపిరి పీల్చుకున్నారు

*జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 55,516 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 317.790 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. జూరాల గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

*నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టుకు 56,222 క్యూసెక్కుల వరద వస్తున్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. ఇప్పుడు 179.69 టీఎంసీలుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 535.80 అడుగుల వద్ద ఉన్నది.కాగా, జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది.

*దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్‌ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరింది. ఇందులో 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,930 మంది మృతిచెందగా, మరో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు 60 మంది బలవగా, 21,219 మంది డిశ్చార్జీ అయ్యారు