శనివారం నాడు అయోవా రాష్ట్రంలోని డెమోయిన్స్లో మృతి చెందిన గుంటూరు జిల్లా చుండురుకు చెందిన సుంకర చంద్రశేఖర్, సుంకర లావణ్య, వారి ఇద్దరు కుమారుల పోస్టు మార్టం పూర్తి అయింది. వీరి మరణానికి గల కారణాలను పోలీసు శాఖ నేటి మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేసింది. లావణ్య, వారి ఇద్దరి కుమారులది హత్యగా ధృవీకరించగా, చంద్రశేఖర్ది మాత్రం ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. వీరు నలుగురు తుపాకీ తూటాలకు బలి అయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లావణ్య, వారి కుమారులను హత్య చేసింది ఎవరనేది అధికారికంగా పోలీసులు వివరించలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
భార్య కుమారులది హత్య-చంద్రశేఖర్ది ఆత్మహత్య
Related tags :