*ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ఇప్పుడు మన్యం ప్రాంతాలకు కూడా విస్తరించింది. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఇప్పటివరకు మనం చూశాం. మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
*కర్నూలు జిల్లా. ఆదోని పట్టణ శివారుమైన ఎస్వి రోడ్డు కాళీ పతార్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు వన్ టౌన్ సిఐ విక్రమ్ సింహ మాట్లాడుతూ రాబడి సమాచారం మేరకు శనివారం ఉదయం ఆదోని టౌన్ వాల్మీకి నగర్ శంకరమ్మ, సిరుగుప్ప కు చెందిన మల్లమ్మ, వాల్మీకి నగర్ కి చెందిన వీరేష్, సిరిగుప్ప కు చెందిన నరసప్ప మరియు శంషుద్దీన్ లు కలిసి శిరిగుప్ప నందు కర్ణాటక మద్యం 9 టెట్రా ప్యాకెట్స్ ( 894-90 ml) కొనుగోలు చేసి KA 34 B 2056 అనే ఆటో లో వస్తున్నారన్న సమాచారం మేరకు రవి, యువరాజు లను అదేవిధంగా ఒక మహిళ పోలీస్ ను, సిబ్బందిని వెంట తీసుకొని ఇస్వి రోడ్ లోని ఖాళీ పతర్ వద్ద వేచి ఉండి, సదరు ఆటో రావడం గమనించి , సిబ్బందితో చుట్టుముట్టి పరిశీలించగా కర్ణాటక మధ్యం ను జొన్న ల సంచులలో ఎవ్వరికీ అనుమానం రాకుండా దాచుకొని ఆదోని 1 టౌన్ పరిధి లో అమ్మకాలు చెయ్యడానికి వస్తుండగా పట్టుకొని వారి నుండి 864 కర్ణాటక ఆఫీసర్ ఛాయిస్ ,టెట్రా ప్యాకెట్స్ రవాణా చెయ్యడానికి ఉపయోగించిన ఆటో ను సీజుచేసి, పంచనామా కింద వారిని పై ఐదుగురిని అరెస్ట్ చెయ్యడం జరిగింది అన్నారు.. యస్ ఐ చంద్ర, , మహిళ పోలీస్ , సిబ్బంది వెంకటేష్, బాల భాస్కర్, రాజేంద్ర లను పాల్గొన్నారు.
*ఉమ్మడి చిత్తూరు జిల్లా: కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ కు చెందిన కుటుంబ సభ్యులు తమ కారులో తిరుమల వెలుతుండగా మార్గమధ్యలో చిన్నగొటిగళ్ళు వద్ద చెరువు కట్ట పై కారు అదుపు తప్పి పిట్టగోడను డీకొట్టి చెరువులో పడింది. అయితే కారులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న భాకరా పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ, సహకారాలు అందించారు.
*శ్రీసత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. లడ్డు(5), బుజ్జి(2)లను చంపి తల్లి భాగ్యమ్మ(27) ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఏడుగురు బాలికలకు అస్వస్థత, ఆస్పత్రిలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స..వాంతులు, విరోచనాలు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికలు
*ఎన్టీఆర్ జిల్లాచిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్ గ్రామ శివారులో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి, పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ 1.52.500 నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం. అదుపులోకి తీసుకొని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసిన ఎస్ ఐ చిన్నబాబు
*స్నేహితుడి దాడిలో ట్రాన్స్‌జెండర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొండాపూర్ మండలం మరేపల్లీలో ట్రాన్స్ జెండర్ దీపికపై స్నేహితుడు సాయి హర్ష దాడి చేశాడు. తీవ్ర గాయాలతో హైదరాబాద్ చందానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపిక ప్రాణాలు కోల్పోయింది. దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు… హత్య అని తేల్చారు. గురువారం రోజు బోనాల పండుగ కోసం అంబర్ పేటకు చెందిన ట్రాన్స్ జెండర్ దీపిక సంగారెడ్డి వెళ్లినట్లు తెలుస్తోంది. దీపిక హత్యపై డీఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో విచారణ జరిగింది. ట్రాన్స్‌జెండర్‌ను ఎల్బీనగర్‌కు చెందిన సాయి హర్ష హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
*బాపులపాడు మండలం. మల్లవల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం భార్య పై కత్తితో దాడి చేసిన పులయ్య ఉరి వేసుకోని ఆత్మహత్య..ఇటివలే భార్యను రమ్య గొంతుపై కత్తితో కోసి హత్య చేయబోయిన పుల్లయ్య…రెండవ భార్య రమ్యను నమ్మకంగా మామిడి తోటలోకి తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసిన పుల్లయ్య…ప్రస్తుతం భార్య రమ్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు..పుల్లయ్య గతంలో కూడా మొదటి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తెలుపుతున్న స్థానికులు.భార్య రమ్యను గొంతుకోసి పరారీలో ఉన్న పుల్లయ్య పై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి పుల్లయ్య కోసం గాలిస్తున్నారు.మామిడి తోటలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న పుల్లయ్య…సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటన స్ధలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఏఎస్ ఐ అంజనేయలు , పోలీసు సిబ్బంది తరలించినట్లు వీరవల్లి ఎస్ ఐ యం. సుబ్రహ్మణ్యం తెలిపారు
*రాజమండ్రిలో వెండిని కొనుగోలు చేసి భీమవరం వస్తున్న తండ్రీ కొడుకులను ఇరువురు వ్యక్తులు అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి 16 కేజీల వెండిని కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉండి ఎస్‌ఐ గంగాధరరావు గురువారం అందించిన వివరాలు ఇలా వున్నాయి. భీమవరానికి చెందిన వెండి వస్తువులను తయారు చేసే వ్యాపారులైన తండ్రీ, కొడుకులు రామలింగేశ్వరరావు, యశ్వంత్‌లు ఈనెల 16న రాజమండ్రి వెళ్లి 16 కేజీల వెండిని కొనుగోలు చేసుకుని మోటార్‌సైకిల్‌పై వస్తున్నారు. ఉండి మండలం సాగపాడు వచ్చేసరికి ఇరువురు వ్యక్తులు తాము తాడేపల్లిగుడెం పోలీసులమని చెప్పి వారి వద్ద వున్న వెండికి, కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులు సరిగా లేవంటూ భయపెట్టారు. వారి నుంచి వెండి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషనకు రమ్మని చెప్పి ముందుగా వెళ్తూ మార్గ మధ్యంలో కనిపించకుండా పోయారు. తండ్రీ కొడుకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి కోసం నిరీక్షించి పోలీసులకు విషయం వివరించారు. దాంతో ఉలిక్కిపడిన పోలీసులు ఇక్కడ నుంచి తమ వారు ఎవరు రాలేదని వాళ్లెవరో మిమ్మల్ని మోసం చేశారని వివరించారు. దీంతో వారు ఉండి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
*జీడిమెట్ల పారిశ్రామికవాడ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్‌లో పెద్దఎత్తు మంటలు చెలరేగాయి. మంటలకు ల్యాబ్‌లో కెమికల్ డబ్బాలు పేలాయి. రేకులు ఎగిరిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
*ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో శుక్రవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ నరేందర్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అక్కడికక్కడే చనిపోవడం సంచలనమైంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని డీసీపీ (ఈస్ట్) కశ్యప్ తెలిపారు. లక్ష్మీనగర్ పోలీస్ కాలనీలోని పార్కింగ్ ఏరియాలోని కారులో నరేందర్ కూర్చుని తనపై తానే కాల్పులు జరుపుకొన్నట్టు చెప్పారు. లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి ఆ శబ్దాలు వినిపించినట్టు చెప్పారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
*ఉమ్మడిగా సంపాదించిన ఆస్తిలో వాటా అడిగినందుకే సొంత అన్నను చంపించాలనుకున్నాడు ఓ తమ్ముడు. హత్య కోసం ఓ సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకొని.. ఏకంగా కోటి రూపాయలు, ఎకరం భూమి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి ఈ విషయాన్ని తన అన్నకు చెబుతున్నాడనే అనుమానం వచ్చి అతణ్ని చంపించాడు. హంతకుడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. అన్న హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ కావడం గమనార్హం. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం రాత్రి వెల్లడించారు.
*హరియాణా నుహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఉన్నట్లు అధికారులు తెలిపారు. నలుగురు పురుషులు, ఒక మహిళ మృతదేహాలను వెలికితీసి పున్హానా ఆస్పత్రికి తరలించారు.
* రాయికోడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. శుక్రవారం ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆరేళ్ల చిన్నారి తమ ఇంటి ముందు గురువారం సాయంత్రం ఆడుకుంటున్నది. దాదాపు 7 గంటల ప్రాంతంలో చిన్నారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన సర్దార్ (30) అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి గ్రామానికి కొద్దిదూరంలో జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారానికి యత్నించగా భయపడిన చిన్నారి బిగ్గరగా ఏడవడంతో నిందితుడు పారిపోయాడు. చిన్నారి ఇంట్లో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
*ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయి న్యాయవాద వృత్తిని చేపట్టిన శివారెడ్డి(44) ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకొని చనిపోయారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కడపకు చెందిన శివారెడ్డి ఎయిర్‌ఫోర్స్‌లో సార్జంట్‌గా పనిచేశారు. భార్య రమాదేవి నుంచి 2017లో విడాకులు తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలో ఒక్కరే ఉంటున్నారు. ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి శుక్రవారం ఉదయమే తన నివాసానికి వచ్చారు. మధ్యాహ్నం ఆయన సోదరి ఎన్ని సార్లు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో శివారెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూశారు. అప్పటికి ఆయన చనిపోయి ఉన్నారు.
* శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేయగా ప్యాంట్, అండర్ గార్మెంట్‌లో బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 3,591 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.
*ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ నారాయణవనం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన పాలమంగళం వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.5,40,830తో పాటు రెండు మద్యం బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మద్యం దుకాణ ఇన్‌చార్జి శరవణకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయనవనం సీఐ సురే్‌షకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం పుత్తూరు – ఊత్తుకోట బైపాస్ రోడ్డు వైఎస్సార్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం దుకాణంలో చోరీకి ప్పాడినట్లు అంగీకరించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందిన తమిళరసన్, ఆనంద్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3,12000 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మన రాష్ట్రంతోపాటు తమిళనాడులోనూ వీరిపై పలు కేసులు ఉన్నాయన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు రివార్డు ప్రకటించారు.
*తుని పరిధిలో ఇటీవల పట్టుబడ్డ రూ.23 లక్షల విలువైన 20,873 మద్యం సీసాలను జిల్లా పోలీసు ఉన్నతాధికా రులు ధ్వంసం చేశారు. శుక్రవారం తేటగుంట శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్, అడిషన్ ఎస్పీ, డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెట్ ఆఫీసర్ ఎం.జయరాజుతో పాటు పోలీస్, ఎస్‌ఈబీ అధికారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం సీసా లను నేలపైపరచి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యంపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు, యువతకి పరివర్తన ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యక్రమా లకు దూరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రూర ల్ సీఐ సన్యాసిరావు, ఎస్‌ఐ ఎ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
*ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయి న్యాయవాద వృత్తిని చేపట్టిన శివారెడ్డి(44) ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకొని చనిపోయారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కడపకు చెందిన శివారెడ్డి ఎయిర్‌ఫోర్స్‌లో సార్జంట్‌గా పనిచేశారు. భార్య రమాదేవి నుంచి 2017లో విడాకులు తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలో ఒక్కరే ఉంటున్నారు. ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి శుక్రవారం ఉదయమే తన నివాసానికి వచ్చారు. మధ్యాహ్నం ఆయన సోదరి ఎన్ని సార్లు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో శివారెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూశారు. అప్పటికి ఆయన చనిపోయి ఉన్నారు.
*ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ నారాయణవనం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన పాలమంగళం వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.5,40,830తో పాటు రెండు మద్యం బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మద్యం దుకాణ ఇన్‌చార్జి శరవణకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయనవనం సీఐ సురే్‌షకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం పుత్తూరు – ఊత్తుకోట బైపాస్ రోడ్డు వైఎస్సార్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం దుకాణంలో చోరీకి ప్పాడినట్లు అంగీకరించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందిన తమిళరసన్, ఆనంద్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3,12000 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
* వైసీపీ నాయకులు అమరావతిలో హల్ చల్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగులపై దాడికి యత్నించారు. డ్వాక్రా గ్రూపులకు రుణాల మంజూరులో వివాదం తలెత్తింది. సంతకాలు తేడాగా ఉండటంతో గ్రూపు లీడర్లను బ్యాంకు సిబ్బంది ప్రశ్నించారు. తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ బ్యాంక్ ఉద్యోగులపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
*సంగారెడ్డి: జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల జాతర కు జోగినిలు వెళ్లారు వీరితో పాటు జోగిని దీపికా వెళ్లింది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దీపికా అనుమానాస్పదంగా మృతిచెందింది. అయితే ఈ మృతిపై జోగినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపికా మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మారేడ్‌పల్లి నుంచి గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) మార్చురీకి అంబర్‌పేట్ పోలీసులు తరలించారు. గాంధీ ఆస్పత్రి వద్ద జోగినిలు నిరసన తెలిపారు. దీపికాను సాయిహర్ష అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడిని తప్పించడానికి పోలీసులు, లింగంపల్లి లోని ఓ హాస్పిటల్ వైద్యులు ప్రయత్నిస్తున్నారని జోగినిలు ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే జోగిని దీపికాను సాయిహర్ష హత్య చేశారని అంటున్నారు. దీపికా మృతదేహాన్ని నాగోల్( Nagol) లోని సాయిహర్ష ఇంటివద్దకు తీసుకు వెళ్లి ధర్నా చేస్తామని జోగినిలు తెలిపారు.
*తుని పరిధిలో ఇటీవల పట్టుబడ్డ రూ.23 లక్షల విలువైన 20,873 మద్యం సీసాలను జిల్లా పోలీసు ఉన్నతాధికా రులు ధ్వంసం చేశారు. శుక్రవారం తేటగుంట శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్, అడిషన్ ఎస్పీ, డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెట్ ఆఫీసర్ ఎం.జయరాజుతో పాటు పోలీస్, ఎస్‌ఈబీ అధికారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం సీసా లను నేలపైపరచి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యంపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు, యువతకి పరివర్తన ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యక్రమా లకు దూరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రూర ల్ సీఐ సన్యాసిరావు, ఎస్‌ఐ ఎ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
*రాయికోడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. శుక్రవారం ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆరేళ్ల చిన్నారి తమ ఇంటి ముందు గురువారం సాయంత్రం ఆడుకుంటున్నది. దాదాపు 7 గంటల ప్రాంతంలో చిన్నారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన సర్దార్ (30) అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి గ్రామానికి కొద్దిదూరంలో జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారానికి యత్నించగా భయపడిన చిన్నారి బిగ్గరగా ఏడవడంతో నిందితుడు పారిపోయాడు. చిన్నారి ఇంట్లో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
*విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకముందే వరదలో కొట్టుకుపోయాయనే ఆవేదనతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కొత్తపల్లిలో దుర్గం దేవాజీ (50) ఇటీవల తన నాలుగెకరాల పొలంలో పత్తి విత్తాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విత్తనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో మనస్తాపం చెందిన దేవాజీ గురువారం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
*పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ నుంచి శివభక్తులు గ్వాలియర్ వెళుతుండగా హత్రాస్ పట్టణం వద్ద శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. హత్రాస్‌లో కన్వారియాలను ట్రక్కు కొట్టడంతో ఐదుగురు మృతి చెందగా,మరొకరు గాయపడ్డారు. గాయపడిన శివభక్తుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.గ్వాలియర్ నుంచి శివ భక్తులు హరిద్వార్ నుంచి తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఒక ట్రక్కు వారిపై నుంచి దూసుకుపోయిందని ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కృష్ణ తెలిపారు.
*చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని భాగ్‌లింగంపల్లిలో కడప కు చెందిన న్యాయవాది శివారెడ్డి(44)( లైసెన్స్ గన్( తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గతంలో ఎయిర్‌ఫోర్స్ నుంచి సార్జెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. శివారెడ్డి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతను టీ తాగి తన పోర్షన్‌లోకి వెళ్లి లోపలి నుంచి బోల్ట్ పెట్టుకున్నాడు. శివారెడ్డి సోదరి మహేశ్వరి పలుసార్లు ఫోన్ చేసిన, అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె కవాడిగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మి భవానికి ఫోన్ చేసి తెలిపింది. వెంటనే శ్రీమతి లక్ష్మి భవాని తన తల్లితో కలిసి వాచ్‌మెన్ దుర్గాప్రసాద్ సహాయంతో తలుపు గడియ పగులగొట్టి లోపలికి ప్రవేశించగా శివారెడ్డి అప్పటికే మరణించి బెడ్‌పై ఉన్నాడు. శివారెడ్డి సెల్‌ఫోన్‌ని చిక్కడపల్లి పోలీసులు సీజ్ చేశారు. క్లూస్ టీమ్, వేలిముద్రల బృందం ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకి చిక్కడపల్లి పోలీసులు తరలించారు.
*విశాఖ ఎంవీపీ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రూ.500 వ్యవహారంలో అప్పలరెడ్డి అనే వ్యక్తిని రౌడీషీటర్ శంకర్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పెదవాల్తేర్ మునసబు వీధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వాలని అప్పలరెడ్డి అడిగితే దాడి చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి డబ్బులు ఇచ్చేందుకు బైక్‌పై వచ్చిన రౌడీషీటర్ శంకర్.. అప్పలరెడ్డి గొంతు కోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో విచారణ చేస్తున్నారు. మృతుడు కారు డ్రైవర్గా పనిచేస్తూ.. రాత్రి పూట మద్యం విక్రయిస్తాడని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.