ఫిల్ల్యాండ్లోని షిరిడీ సాయిధామ్లో ఇటీవల గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రియా భాస్కర్, కమిటీ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. భజనలు, అభిషేకం, పల్లకీ సేవలతో సాయినాధుడిని అర్చించారు. హారతి కార్యక్రమం తరువాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.