NRI-NRT

భారతీయులకు జర్మనీ అంటే ఇష్టమట!

భారతీయులకు జర్మనీ అంటే ఇష్టమట!

భారతీయులు జర్మనీని ఇష్టపడుతున్నారు. ఆ దేశానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడైన గణాంకాలు చెబతున్నాయి. జర్మనీ నేషనల్ టూరిస్ట్ ఆఫీస్ గురువారం రోజు కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది తొలి నెలల్లో.. అత్యధిక మంది భారత పర్యాటకులు జర్మనీని సందర్శించినట్టు వెల్లడించింది. ఇండియన్ టూరిస్ట్‌ల సంఖ్య 214శాతం పెరిగినట్టు తెలిపింది. యూపర్ దేశాలను విజిట్ చేసిన భారతీయుల సంఖ్యలో.. దాదాపు 9శాతం మంది జర్మనీని సందర్శించినట్టు చెప్పింది. తమ దేశానికి విజిట్ చేస్తున్న భారతీయుల్లో 38శాతం మంది కేవలం వ్యాపార పనుల కోసమే వస్తుండగా.. 55శాతం మంది మాత్రం విశ్రాంతి కొరకు వస్తున్నారని వివరించింది. ఈ సందర్భంగా జర్మన్ నేషనల్ టూరిస్ట్ ఆఫీస్ డైరెక్టర్ రోమిత్ తియోఫిలస్ మాట్లాడుతూ.. భారత సందర్శకులకు జర్మనీ గమ్యస్థానంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ నిబంధనలు సడలింపు.. పండుగల రోజులను పురస్కరించుకుని రానున్న రోజుల్లో జర్మనీకి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.